స్తోత్రము
(స్తోత్రాలు నుండి దారిమార్పు చెందింది)

Look up స్తోత్రము in Wiktionary, the free dictionary.
స్తోత్రము : హిందూమత ధర్మములో స్తోత్రము అనగా స్థుతిస్తూ గానము చేసేది లేక ప్రశంశములతో కూడిన గానం (ప్రశంశా గానం) లేదా కీర్తన లేదా పాట.[1] ఈ స్తోత్రములు దేవీ, శివుడు లేదా విష్ణువు కొరకు నిర్దేశింపబడినవి. స్వామి తపస్యానందుల వారి ప్రకారం, శ్లోకాలను శబ్దపూరితంగా, తన్మయం చెందుతూ, భగవన్నామ కీర్తన జేయడం.
స్తోత్రములు, ప్రసిద్ధిపొందిన ధార్మిక సాహిత్యం, వీటిని దైనందిన జీవితంలో నిత్యమూ ఉపయోగిస్తుంటారు.
స్తోత్ర భాగాలు సవరించు
- ప్రార్థన
- ప్రధానమైన స్తోత్రము
- ఫలశృతి : ఏదేని స్తోత్రం చదివినప్పుడు వచ్చే ఫలన్ని తెలియజెప్పే శృతి. ఉదాహరణకు : విష్ణు సహస్రనామ స్తోత్రము చూడండి.
మతాలలో స్తోత్రములు సవరించు
హిందూ మతము సవరించు
- విష్ణు సహస్రనామ స్తోత్రము: శ్రీ మహావిష్ణువు యొక్క సహస్ర (1000) నామములను స్మరిస్తూ కీర్తించడం.
- శివ సహస్రనామ స్తోత్రము: పరమశివుని సమస్ర నామములను స్మరిస్తూ కీర్తించడం.
- సౌందర్యలహరి: ఆదిశంకరుడు శ్రీదేవిని స్తుతిస్తూ స్మరిస్తూ రచించిన స్తోత్రం.
- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: అణ్ణన్ స్వామి శ్రీవేంకటేశ్వరుని స్తుతిస్తూ రచించిన స్తోత్రం.
క్రైస్తవ మతము సవరించు
క్రైస్తవ మతములో యెహోవాను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హిమ్న్ అని అంటారు.
ఇస్లాం మతం సవరించు
ఇస్లాం మతములో అల్లాహ్ను (భగవంతుణ్ణి) కీర్తించడాన్ని హమ్ద్ అని అంటారు.
నోట్స్ సవరించు
మూలాలు సవరించు
- {{{Last}}} ({{{Year}}})