భారతదేశపు పట్టణ పరిపాలన

భారతదేశపు పట్టణాలు, నగరాలు స్థానిక సంస్థ స్థాయిలో మూడవ స్థాయి పాలన

భారతదేశ పట్టణ పరిపాలన, కేంద్ర, రాష్ట్ర స్థాయిల తరువాత మూడవ స్థాయి పరిపాలన వ్యవస్థగా 1993 లో అమలులోకి వచ్చిన 74వ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించారు.[1]

చరిత్రసవరించు

మద్రాస్ మునిసిపల్ కార్పొరేషన్ 1687లో, కలకత్తా, బొంబాయి మునిసిపల్ కార్పొరేషన్లు 1726 లో ఏర్పడడంతో 1687 సంవత్సరం నుండి భారతదేశంలో మునిసిపల్ పాలన జరుగుతుందని చెప్పవచ్చు. పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో, దాదాపుగా భారతదేశంలోని అన్ని పట్టణాలు పురపాలకసంఘాల పాలనలో వున్నాయి. 1882 లో స్థానిక స్వపరిపాలన పితామహుడిగా పిలువబడే వైస్రాయ్ ఆఫ్ ఇండియా, లార్డ్ రిపోన్ చేసిన స్థానిక స్వపరిపాలన తీర్మానం ద్వారా, భారతదేశంలో ప్రజాస్వామ్య రూపంలో మునిసిపల్ పాలనకు బీజం పడింది. [2]

1919, 1935 లో చట్టాల ద్వారా స్థానిక ప్రభుత్వాన్ని నిర్దిష్ట అధికారాలతో రాష్ట్ర లేదా ప్రాంతీయ ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి.

74 వ రాజ్యాంగ సవరణ చట్టంసవరించు

1992 లో భారత రాజ్యాంగంలో 74 వ సవరణ మునిసిపల్ లేదా స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగ ప్రామాణికతను తెచ్చిపెట్టింది. సంబంధిత రాష్ట్ర మునిసిపల్ చట్టాలలో కూడా సవరణలు చేసే వరకు, మునిసిపల్ అధికారులు అల్ట్రా వైర్లు (అధికారం దాటి) పాలన చేయగలిగే పరిస్థితి రాష్ట్రాలలో ఉండేది.

2011 జనాభా లెక్కల ప్రకారం, కీలకమైన పట్టణీకరణ ప్రాంతాలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి [3]

 1. చట్టబద్ధమైన పట్టణాలు: మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, కంటోన్మెంట్ బోర్డ్, నోటిఫైడ్ టౌన్ ఏరియా కమిటీ, టౌన్ పంచాయతీ, నగరపాలికా వంటి శాసనం ద్వారా పట్టణంగా నిర్వచించబడిన అన్ని పరిపాలనా విభాగాలను చట్టబద్ధమైన పట్టణాలుగా పిలుస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం,4041 చట్టబద్ధమైన పట్టణ స్థానిక సంస్థలు (యుఎల్‌బి) ఉన్నాయి. ఇవి 2001 జనాభా లెక్కల ప్రకారం 3799 ఉన్నాయి.[4]
 2. సెన్సస్ పట్టణాలు : ఈ క్రింది మూడు ప్రమాణాలను ఒకేసారి సంతృప్తిపరిచే అన్ని పరిపాలనా విభాగాలు: i) కనీసం 5,000 మంది జనాభా; ii) వ్యవసాయేతర పనులలో నిమగ్నమై ఉన్న పురుషుల ప్రధాన శ్రామిక జనాభాలో 75 శాతం, అంతకంటే ఎక్కువ; iii) చ. కి. మీ. కి కనీసం 400 మంది జన సాంద్రత. 2011 జనాభా లెక్కల ప్రకారం 3,784 సెన్సస్ పట్టణాలు ఉండగా, వాటి సంఖ్య 2001 లో 1,362 గా ఉంది.

చట్టబద్ధమైన పట్టణాలు వివిధ రకాలుగా ఉంటాయి.

 1. మునిసిపల్ కార్పొరేషన్ (నగర్ నిగం)
 2. మున్సిపాలిటీ (పురపాలక సంఘం మునిసిపల్ కౌన్సిల్, మునిసిపల్ బోర్డు, మునిసిపల్ కమిటీ, నగర పరిషత్)
 3. టౌన్ ఏరియా కమిటీ
 4. నోటిఫైడ్ ఏరియా కమిటీ

మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు పూర్తిగా ప్రతినిధుల సంస్థలు. నోటిఫైడ్ ఏరియా కమిటీలు, టౌన్ ఏరియా కమిటీలు పూర్తిగా లేదా పాక్షికంగా నామినేట్ చేయబడిన సంస్థలు.భారత రాజ్యాంగం, 1992 - 74 వ సవరణ చట్టం ప్రకారం[5] పట్టణ స్థానిక సంస్థలను మూడు వర్గాలకు తగ్గించారు.

అన్ని పట్టణ స్థానిక ప్రభుత్వాలలో, మునిసిపల్ కార్పొరేషన్లు ఎక్కువ ఆర్థిక స్వయంప్రతిపత్తి, విధులను కలిగి ఉంటాయి. వీటిలో రాష్ట్రాల పరంగా కొంత తేడా ఉంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. మరోవైపు, మునిసిపాలిటీలు లేదా నగర పంచాయతీలకు తక్కువ స్వయంప్రతిపత్తి, చిన్న అధికార పరిధికి లోబడి ఉంటాయి.ఇవి మునిసిపాలిటీల డైరెక్టరేట్ ద్వారా లేదా ఒక జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవహరించాలి. ఈ స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాల వివరణాత్మక పర్యవేక్షణ నియంత్రణ, మార్గదర్శకత్వానికి లోబడి పనిచేస్తాయి.

రాష్ట్ర మునిసిపల్ చట్టాలుసవరించు

రాష్ట్ర మునిసిపల్ చట్టాలు మునిసిపల్ ప్రభుత్వాలను స్థాపించడానికి, వాటిని నిర్వహించడానికి, రాష్ట్రంలోని నగరాలకు పరిపాలన చట్రాన్ని అందించడానికి రూపొందించినవి. [6] ఎన్నికలకు నియమాలు, సిబ్బంది నియామకం, పట్టణ ప్రాంతాల సరిహద్దుతో సహా వివిధ ప్రక్రియలు రాష్ట్ర మునిసిపల్ చట్టాల నుండి తీసుకోబడ్డాయి. కంటోన్మెంట్ ప్రాంతాలు మినహా ఆయా రాష్ట్రాల్లోని అన్ని చట్టబద్ధమైన పట్టణ ప్రాంతాలలో చాలా మునిసిపల్ చట్టాలు అమలు చేయబడతాయి. భారత ప్రభుత్వం 2003 లో ఒక మాదిరి మునిసిపల్ చట్టాన్ని జారీ చేసింది, ఇది వివిధ రాష్ట్రాల్లోని మునిసిపల్ ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడం, సవరించడం, వాటిని 74 వ రాజ్యాంగ సవరణ నిబంధనలకు అనుగుణంగా చేయటానికి ఉద్దేశించింది. [7]

పట్టణ స్థానిక సంస్థల బాధ్యతలుసవరించు

భారత మునిసిపల్ సంస్థలు తమ మునిసిపల్ చట్టాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించిన విధుల జాబితా సుదీర్ఘంగా వుంటుంది.

రాజ్యాంగ పన్నెండవ షెడ్యూల్ (ఆర్టికల్ 243 w) లో పద్దెనిమిది విధులున్నాయి. [8]

ప్రజారోగ్యం (నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పారిశుధ్యం, సంక్రమణ వ్యాధుల నిర్మూలన); సంక్షేమం (విద్య, వినోదం మొదలైనవి); నియంత్రణ విధులు (భవన నిబంధనలను సూచించడం, అమలు చేయడం, ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, జనన నమోదు, మరణ ధృవీకరణ పత్రం మొదలైనవి); ప్రజా భద్రతలో అగ్ని మాపకం, వీధి దీపాలు); ప్రజా పనులు (నగర లోపలి రహదారుల నిర్మాణం, నిర్వహణ); అభివృద్ధి విధులు (పట్టణ ప్రణాళిక, వాణిజ్య మార్కెట్ల అభివృద్ధి)

చట్టబద్ధంగా కేటాయించిన విధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ రంగ విభాగాలు తరచుగా ఏకపక్షంగా, ఏజెన్సీ ప్రాతిపదికన, కుటుంబ నియంత్రణ, పోషణ, మురికివాడల అభివృద్ధి, వ్యాధులు లేదా అంటువ్యాధుల నియంత్రణ మొదలైన వివిధ విధులను కేటాయిస్తాయి.

మునిసిపాలిటీల సాంప్రదాయిక ప్రధాన విధులతో పాటు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, సాంస్కృతిక, విద్యా, ఆహ్లాదకర అంశాలను ప్రోత్సహించడం వంటి అభివృద్ధి విధులు కూడా ఇందులో ఉన్నాయి. ఏదేమైనా, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన అనుగుణ్యత చట్టం ఈ విషయంలో విస్తృత వైవిధ్యాలను సూచిస్తుంది. బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మణిపూర్, పంజాబ్ , రాజస్థాన్ పన్నెండవ షెడ్యూల్‌లో తమ సవరించిన రాష్ట్ర మునిసిపల్ చట్టాలలో అన్ని విధులను చేర్చగా, ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ విధుల జాబితాలో ఎటువంటి మార్పులు చేయలేదు. కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పన్నెండవ షెడ్యూల్‌లో సూచించిన విధంగా మునిసిపల్ ఫంక్షన్ల జాబితాలో అదనపు విధులను చేర్చడానికి తమ మునిసిపల్ చట్టాలను సవరించాయి.

రాష్ట్రాలలో మునిసిపల్ సంస్థలకు విధిగా, విచక్షణతో కూడిన విధులను కేటాయించడంలో చాలా తేడా ఉంది. సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి ప్రణాళిక, పట్టణ అడవులు , పర్యావరణ అంశాలను ప్రోత్సహించడం వంటి పనులు మహారాష్ట్ర మునిసిపాలిటీలకు విధిగా ఉన్నాయి, కర్ణాటకలో ఇవి విచక్షణా విధులు.

అనేక రాష్ట్రాల్లో నీటి సరఫరా, మురుగునీటిని రాష్ట్ర ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయి లేదా రాష్ట్ర సంస్థలకు బదిలీ చేయబడ్డాయి. ఉదాహరణకు, తమిళనాడు, మధ్యప్రదేశ్ గుజరాత్‌లలో, నీటి సరఫరా, మురుగునీటి పనులను రాష్ట్ర స్థాయి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం లేదా నీటి సరఫరా, మురుగునీటి బోర్డులు నిర్వహిస్తుండగా, రుణాలు తిరిగి చెల్లించడం, నిర్వహణ బాధ్యత మునిసిపాలిటీల వద్ద ఉంది. ఈ రాష్ట్ర స్థాయి ఏజెన్సీలతో పాటు, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) వంటి నగర అభివృద్ధి ట్రస్టులు, పట్టణాభివృద్ధి సంస్థలు అనేక నగరాల్లో స్థాపించారు. ఈ ఏజెన్సీలు సాధారణంగా భూసేకరణ, అభివృద్ధి పనులను చేపట్టాయి. ఆదాయం పొందగలిగే మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు మొదలైన ప్రాజెక్టులను కూడా చేస్తాయి.

సూచించబడిన మున్సిపల్ విధులుసవరించు

మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర్ పంచాయతీలకు సూచించిన విధులు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. [9]

ముఖ్యమైన కొన్ని మునిసిపల్ విధులు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్ నగర్ పంచాయతీ
పట్టణ ప్రణాళికతో సహా పట్టణ ప్రణాళిక అవును అవును అవును
భూ వినియోగం, భవనాల నిర్మాణ నియంత్రణ అవును అవును అవును
ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రణాళిక అవును అవును అవును
రోడ్లు, వంతెనలు అవును అవును అవును
నీటి సరఫరా (నివాస, పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కొరకు) అవును అవును అవును
ప్రజారోగ్యం, పారిశుధ్యం, సంరక్షణ (Conservancy), ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అవును అవును అవును
అగ్నిమాపక సేవలు అవును అవును లేదు
పట్టణ అడవులు అవును అవును అవును
వ్యాధులు రాకుండా ఆరోగ్య సంరక్షణ అవును అవును అవును
పట్టణ సౌకర్యాలు, పార్కులు, తోటలు, ఆట స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించడం అవును అవును అవును
ఖనన శ్మశానవాటికలు, దహన సంస్కారాలు, దహన, విద్యుత్ స్మశానవాటికలు / మైదానాలు అవును అవును అవును
పశువుల దొడ్లు నిర్వహణ, జంతువులపై క్రూరత్వాన్ని నివారించడం అవును అవును అవును
జననాలు, మరణాల నమోదుతో సహా కీలక గణాంకాలు అవును అవును అవును
వీధి లైటింగ్ అవును లేదు అవును
పార్కింగ్ స్థలాలు, బస్ స్టాప్లు, ప్రజా సౌకర్యాలు అవును అవును అవును
కబేళాలు, టన్నరీల నియంత్రణ అవును అవును అవును
మురికివాడ మెరుగుదల అవును అవును అవును
ఏజెన్సీ విధులు
పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ అంశాల ప్రచారం అవును అవును అవును
వికలాంగులు, మానసిక వికలాంగులతో సహా సమాజంలోని బలహీన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం అవును అవును అవును
పట్టణ పేదరిక నిర్మూలన అవును అవును అవును
సాంస్కృతిక, విద్య, ఆహ్లాదపరిచే అంశాల ప్రచారం అవును అవును అవును
ప్రాథమిక విద్య అవును అవును అవును
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవును అవును అవును

మున్సిపల్ కార్పొరేషన్ (నగర్ నిగం / మహానగర్ పాలికా)సవరించు

పది లక్షలు (1 మిలియన్) కంటే ఎక్కువ జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరంపాలనకు, అభివృద్ధికి మహానగర్ పాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్ ) పనిచేస్తుంది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పూణేలోని ఎనిమిది మెట్రోపాలిటన్ నగరాల్లో అతిపెద్ద సంస్థలు ఉన్నాయి. ఈ నగరాలు పెద్ద జనాభాను కలిగి ఉండటమే కాకుండా, ఇవి దేశంలోని పరిపాలన, వాణిజ్య పరంగా ముఖ్య కేంద్రాలు.

మున్సిపాలిటీ (నగర్ పాలికా)సవరించు

పురపాలక సంఘం (మునిసిపాలిటీ, నగర్ పాలికా) అనేది పట్టణ స్థానిక సంస్థ, ఇది సాధారణంగా 100,000 - 1,000,000 జనాభా గల పట్టణాలను పాలిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా సంబంధంమున్నా, పరిపాలనాపరంగా అది ఉన్న జిల్లాలో ఒక భాగం.

పురపాలక సంఘం సభ్యులను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. పట్టణాన్ని జనాభా ప్రకారం వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుండి ప్రతినిధులను ఎన్నుకుంటారు. సభ్యులు అధ్యక్షత వహించడానికి, సమావేశాలు నిర్వహించడానికి తమలో ఒకరిని అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. నగర్ పాలిక పరిపాలనా వ్యవహారాలను నియంత్రించడానికి ఒక ముఖ్య అధికారి, ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ ఆఫీసర్, రాష్ట్ర ప్రజా సేవ నుండి వచ్చిన విద్యాశాఖాధికారి వంటి అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.

నగర పంచాయతీ (నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్)సవరించు

నగర పంచాయితీ లేదా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ లేదా సిటీ కౌన్సిల్ అనేది మునిసిపాలిటీతో పోల్చదగిన భారతదేశంలోని పట్టణ రాజకీయ విభాగం. 11,000 కంటే ఎక్కువ, 25 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ కేంద్రాన్ని "నగర్ పంచాయతీ" గా నిర్వచించారు.

ప్రతి నగర పంచాయతీలో కనీసం పది మంది ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వార్డ్ సభ్యులు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులను కలిగి వుంటుంది. వారిలో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటారు. సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు సీట్లు కేటాయించబడ్డాయి.

ఇవి కూడ చూడుసవరించు

మూలాలుసవరించు

 1. "Nagrika - The Constitution and the 74th Constitutional Amendment Act". Nagrika (in అమెరికన్ ఇంగ్లీష్).
 2. "Good municipal governance key to improve quality of life". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 19 December 2019.
 3. "Census 2011 Meta Data" (PDF). Census India.
 4. "Handbook of Urban Statistics, India" (PDF). MoHUA. Retrieved 8 October 2020.
 5. "74th Amendment Act of 1992". Retrieved 18 January 2009.
 6. "Nagrika - What is a Municipal Act?". Nagrika (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-08.
 7. "Model Municipal Law, 2003" (PDF). International Environmental Law Research Center.
 8. "74th Amendment Act of 1992". Archived from the original on 23 ఏప్రిల్ 2009. Retrieved 18 January 2009. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 9. Reforming Municipal Finances: Some suggestions in the context of India’s Decentralization Initiative, by Mohanty P.K., Urban India, January–June 1995.

బాహ్య లింకులుసవరించు