స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ (1937 సినిమా)

1937, డిసెంబరు 21న విడుదలైన అమెరికా కార్టూన్ సినిమా

[[వర్గం:{{{year}}}_ఇంగ్లీష్_సినిమాలు]]

స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
({{{year}}} ఇంగ్లీష్ సినిమా)

స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ సినిమా పోస్టర్
దర్శకత్వం డేవిడ్ హ్యాండ్ (పర్యవేక్షణ), విలియం కాట్రెల్, విల్ఫ్రెడ్ జాక్సన్, లారీ మోరెయ్, పెర్స్ పియర్స్, బెన్ షార్ప్స్టీన్
నిర్మాణం వాల్ట్ డిస్నీ సంస్థ
రచన టెడ్ సియర్స్, రిచర్డ్ క్రీడేన్, ఒట్టో ఇంగ్లండర్, డిక్ రిక్షార్డ్, ఎర్ల్ హర్డ్, మెర్రిల్ దే మారిస్, డోరతీ ఆన్ బ్లాంక్, వెబ్ స్మిత్
తారాగణం అడ్రియానా కాసొలోట్టి, లుసిల్లె లా వెర్నే, హ్యారీ స్టాక్వెల్, రాయ్ అట్వెల్, పింటో కోల్విగ్, ఓటిస్ హార్లాన్, స్కాటీ మాట్త్ర, బిల్లీ గిల్బర్ట్, ఎడ్డీ కాలిన్స్, మొరోని ఒల్సెన్, స్టువర్ట్ బుకానన్
సంగీతం ఫ్రాంక్ చర్చిల్, పాల్ స్మిత్, లీ హర్లైన్
పంపిణీ ఆర్.కె.ఓ. రేడియో పిక్చర్స్
విడుదల తేదీ డిసెంబరు 21, 1937 (1937-12-21)(కార్తే సర్కిల్ థియేటర్)
ఫిబ్రవరి 4, 1938 (యునైటెడ్ స్టేట్స్)
నిడివి 83 నిముషాలు
దేశం యునైటెడ్ స్టేట్స్
భాష ఇంగ్లీష్
పెట్టుబడి $1.49 మిలియన్[1]
వసూళ్లు $418 మిలియన్[2]
నిర్మాణ_సంస్థ వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్

స్నో వైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్ 1937, డిసెంబరు 21న విడుదలైన అమెరికా కార్టూన్ సినిమా. గ్రిం బ్రదర్స్ రాసిన స్నో వైట్ అనే జానపద కథ ఆధారంగా వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ సినీచరిత్రలో పూర్తి నిడివితో వచ్చిన తొలి కార్టూన్ చిత్రంగా నిలిచింది.[3]

అందమైన రాజకుమారి (స్నో వైట్) కి క్రూరమైన సవతి తల్లి ఉంటుంది. రాజకుమారి అంటే ఏమాత్రం ఇష్టంలేని ఆ సవతి తల్లి, రాజకుమారిని చంపేందుకు విషంతో కూడిన ఆపిల్ పండును ఇస్తుంది. ఆ పండును తిన్న రాజకుమారి స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఆ సవతి తల్లి బంగారు పూత పూసిన అద్దాల శవ పేటికలో రాజకుమారిని పెట్టి అడవిలో వదిలేస్తుంది. అడవిలో ఉన్న ఏడుగురు మరుగుజ్జులు (డాక్, హ్యాపీ, గ్రంపీ, స్లీపీ, స్నీజీ, బ్యాష్ పుల్, డోపీ) వచ్చి ఆ రాజకుమారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ఒక అందాల రాజకుమారుడు వచ్చి ముద్దు పెట్టుకోగానే రాజకుమారికి స్పృహ వస్తుంది. రాజకుమారుడు, రాజకుమారిలు ఒకటవుతారు.

నటవర్గం

మార్చు
  • అడ్రియానా కాసొలోట్టి
  • లుసిల్లె లా వెర్నే
  • హ్యారీ స్టాక్వెల్
  • రాయ్ అట్వెల్
  • పింటో కోల్విగ్
  • ఓటిస్ హార్లాన్
  • స్కాటీ మాట్త్ర
  • బిల్లీ గిల్బర్ట్
  • ఎడ్డీ కాలిన్స్
  • మొరోని ఒల్సెన్
  • స్టువర్ట్ బుకానన్

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: డేవిడ్ హ్యాండ్ (పర్యవేక్షణ), విలియం కాట్రెల్, విల్ఫ్రెడ్ జాక్సన్, లారీ మోరెయ్, పెర్స్ పియర్స్, బెన్ షార్ప్స్టీన్
  • నిర్మాత: వాల్ట్ డిస్నీ సంస్థ
  • రచన: టెడ్ సియర్స్, రిచర్డ్ క్రీడేన్, ఒట్టో ఇంగ్లండర్, డిక్ రిక్షార్డ్, ఎర్ల్ హర్డ్, మెర్రిల్ దే మారిస్, డోరతీ ఆన్ బ్లాంక్, వెబ్ స్మిత్
  • ఆధారం: గ్రిం బ్రదర్స్ రాసిన స్నో వైట్ అనే జానపద కథ
  • సంగీతం: ఫ్రాంక్ చర్చిల్, పాల్ స్మిత్, లీ హర్లైన్
  • నిర్మాణ సంస్థ: వాల్ట్ డిస్నీ ప్రొడక్షన్స్
  • పంపిణీదారు: ఆర్.కె.ఓ. రేడియో పిక్చర్స్

చిత్ర విశేషాలు

మార్చు
  1. ఈ చిత్ర నిర్మాణంతో వాల్డ్ డిస్నీ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.[4]
  2. 1934లో ప్రారంభమైన ఈ చిత్రం పూర్తవడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది, 1937, డిసెంబరు 21న మొదటిసారి ప్రదర్శించబడిన ఈ చిత్రం 1939 నాటికి అత్యధిక వసూళ్లను చేసిన చిత్రంగా నిలిచింది.[5]
  3. 1937 లెక్కల ప్రకారం ఈ చిత్ర నిర్మాణానికి దాదాపు కోటిన్నర ఖర్చు అయింది. ఈ చిత్రంకోసం 570మంది చిత్రకారులు రెండున్నర లక్షల చిత్రాలను గీశారు.[4]
  4. ఈ చిత్రంలోని మరుగుజ్జు పాత్రలకోసం ఏడుగురి నటులు మరుగుజ్జు వేషాలు వేసుకొని నటిస్తుంటే, వారి కదలికలతో చిత్రకారులు కార్టూన్ లు వేశారు.[4]
  5. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు వాల్డ్ డిస్నీ సంస్థకు 11వ ఆస్కార్ అవార్డులో భాగంగా గౌరవ పురస్కారం లభించింది.
  6. అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారిచే అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 1998లో 100 సంవత్సరాలు...100 చిత్రాలు విభాగంలో 49వ చిత్రంగా,[6] 2007లో 100 సంవత్సరాలు...100 సినిమాలు (10వ వార్షికోత్సవ సంచిక) విభాగంలో 34వ చిత్రంగా,[7] టాప్ 10 చిత్రాల్లో 1వ యానిమేటెడ్ చిత్రంగా,[8] 2008లో 100 సంవత్సరాలు...100 హీరోలు, విలన్ విభాగంలో 10వ విలన్ గా,[9] 2004లో 100 సంవత్సరాలు...100 పాటలు విభాగంలో సమ్ డే మై ప్రిన్ప్ విల్ కమ్ అనే పాట 19వ చిత్రంగా[10] గుర్తించబడింది.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Barrier 1999, p. 229.
  2. Box-office
    • Wilhelm, Henry Gilmer; Brower, Carol (1993). The Permanence and Care of Color Photographs: Traditional and Digital Color Prints, Color Negatives, Slides, and Motion Pictures. Preservation Pub. p. 359. ISBN 978-0-911515-00-8. In only 2 months after the 1987 re-release, the film grossed another $45 million—giving it a total gross to date of about $375 million! ([www.books.google.com/books?ei=vdbJT52eBsbX8QPt_lg&id=0OtTAAAAMAAJ&dq=%22snow+white%22+million+worldwide+grosses Online copy] at Google Books)
    • "Snow White and the Seven Dwarfs (1987 Re-issue)". Boxoffice (magazine). Archived from the original on 2019-01-08. Retrieved May 29, 2016. North American box-office: $46,594,719
    • "Snow White and the Seven Dwarfs (1993 Re-issue)". Boxoffice (magazine). Archived from the original on 2018-12-25. Retrieved May 29, 2016. North American box-office: $41,634,791
  3. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 41.
  4. 4.0 4.1 4.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 39.
  5. Gabler, Neal (2007). Walt Disney: The Triumph of the American Imagination. New York: Random House. pp. 276–277. ISBN 0-679-75747-3.
  6. "AFI's 100 Years...100 Movie". American Film Institute. Los Angeles CA. June 1998. Retrieved 21 February 2019.
  7. "AFI's 100 Years...100 Movie – 10th Anniversary Edition". American Film Institute. Los Angeles CA. June 20, 2007. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 21 February 2019.
  8. "AFI's 10 Top 10: Animation". American Film Institute. Los Angeles CA. Retrieved 21 February 2019.
  9. "AFI's 100 Years... 100 Heroes and Villains". American Film Institute. Los Angeles CA. June 4, 2008. Archived from the original on 23 అక్టోబరు 2007. Retrieved 21 February 2019.
  10. "AFI's 100 Years... 100 Songs". American Film Institute. Los Angeles CA. June 22, 2004. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 21 February 2019.

ఇతర లంకెలు

మార్చు

ఆధార గ్రంథాలు

మార్చు