స్మార్ట్ సిటీస్ మిషన్
భారతదేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ (National Smart Cities Mission) 2015 వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనిని ప్రారంభించదానికి ముఖ్య కారణం విద్యుత్, నీరు, రవాణా, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను, సేవలను ప్రజలకు అందించడానికి, పరిపాలనను, ప్రజల జీవన ప్రమాణాలు సుస్థిరమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి,నియంత్రించడానికి, అమలు చేయడానికి వీలుగా సాంకేతిక ప్రణాళికలను రూపొందించారు. సమర్థవంతమైన మౌలిక సదుపాయాల వ్యవస్థ, సమర్థవంతమైన పంపిణీ స్మార్ట్ సిటీ మిషన్ ప్రాథమిక సూత్రం. ఇటీవలి సంవత్సరాలలో సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో జరుగుతన్న పురోగతితో, పట్టణ నిర్వహణ దాదాపు అన్ని శాఖలను ఏకీకృతం, సమన్వ్యం చేయడం, వీటిలో పరిపాలనను పౌరులకు స్నేహపూర్వక, జవాబుదారీ, పారదర్శక, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా చేస్తుంది[1].
స్మార్ట్ సిటీస్ మిషన్ | |
---|---|
దస్త్రం:Smart City Mission (also referred to as the 'Smart Cities Mission') logo.jpg | |
దేశం | భారతదేశం |
ప్రధానమంత్రి(లు) | నరేంద్ర మోడీ |
మంత్రిత్వ శాఖ | పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ |
ప్రధాన వ్యక్తులు | హర్దీప్ సింగ్ పూరి, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కునాల్ కుమార్ (మిషన్ డైరెక్టర్)[2] |
ప్రారంభం | మూస:ప్రారంభ తేదీ |
నిధులు | ₹2,03,979 crore (US$26 billion)[3] |
అవలోకనం
మార్చుస్మార్ట్ సిటీస్ మిషన్ అనేది ఉత్తమ పద్ధతులు, సమాచార, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, మరిన్ని ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను ఉపయోగించడం ద్వారా నగరాలు, పట్టణాలలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం చేపట్టినది. ఇందుకు గాను స్మార్ట్ సిటీ మిషన్ 2015 జూన్ 25, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ అమలు బాధ్యత కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. అలాగే, ప్రతి రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ )నేతృత్వంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ( ఎస్ పి వీ )ను ఏర్పాటు చేస్తారు. మిషన్ అమలును వారు పర్యవేక్షిణ చేస్తారు. ఈ మిషన్ విజయవంతానికి రూ.7,20,000 కోట్ల నిధులను కేటాయించారు. స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదలు వంద నగరాలను భారతదేశంలో ప్రాజెక్ట్ కింద వంద నగరాలను భారతదేశం లోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జరిగింది[4].
ఆర్ధిక వనరులు
మార్చుస్మార్ట్ సిటీ మిషన్ ను కేంద్ర ప్రాయోజిత పథకం (సిఎస్ఎస్) గా నిర్వహిస్తామని, ఈ మిషన్ కు ఐదేళ్లలో అంటే సంవత్సరానికి సగటున రూ.100 కోట్ల చొప్పున రూ.48,000 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనికి సమానమైన మొత్తాన్ని మ్యాచింగ్ ప్రాతిపదికన రాష్ట్రం/ పట్టణ ప్రాంత పురపాలక వ్యవస్థలు (యూఎల్ బి) [5] చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల స్మార్ట్ సిటీల అభివృద్ధికి దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ/ యుఎల్ బి నిధులు లభిస్తాయి. భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీలను దేశ ఆర్థికాభివృద్ధి కోసం స్మార్ట్ సిటీలు అవసరం అని అభివృద్ధి చేయాల్సినవసరం ఉందని భావిస్తూ, ఈ నగరాలలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు స్మార్ట్ సిటీల మిషన్ కీలక పాత్రగా ఉంటుందని, నగరాలలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే, మరింత మంది ప్రజలు అక్కడ నివసించడానికి ఇష్టపడతారు, తద్వారా ఆ నగరాలను అభివృద్ధి అనుకున్నట్లు జరిగితే పారిశ్రామికంగా పెట్టుబడులను పెంచవచ్చని భారత ప్రభుత్వం అంచనా వేస్తుంది[6].
విదేశీ భాగస్వామ్యం
మార్చుభారత్ స్మార్ట్ సిటీస్ మిషన్ కు ప్రపంచంలోని దేశాలు సహాయం చేస్తున్నాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు భారతదేశం స్మార్ట్ సిటీ మిషన్ పై ఆసక్తిని కనబరుస్తూ, స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఎదురు చూస్తున్నాయి. వీటిలో స్పెయిన్, అమెరికా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, సింగపూర్, స్వీడన్ ఉన్నాయి. ఢిల్లీని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు స్పెయిన్ ప్రతిపాదించింది. స్పెయిన్ కు చెందిన బార్సిలోనా రీజనల్ ఏజెన్సీ భారత్ తో సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్పిడి చేసుకునేందుకు ఆసక్తి చూపింది[7].
విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), అలహాబాద్ (ఉత్తర ప్రదేశ్), అజ్మీర్ (రాజస్థాన్)లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (యుఎస్టిడిఎ) నిర్ణయించింది.
భువనేశ్వర్ (ఒడిశా), కొచ్చి (కేరళ), కోయంబత్తూరు (తమిళనాడు)లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు జర్మనీ భారత్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
చెన్నై, అహ్మదాబాద్, వారణాసి నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు భారత్ కు సహకరించాలని జపాన్ నిర్ణయించింది.
చండీగఢ్, లక్నో, పుదుచ్చేరి మూడు భారతీయ నగరాలకు మద్దతు ఇవ్వాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. దీనికి గాను 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల (1.3 బిలియన్ యూరోలు) పెట్టుబడిని ప్రకటించింది.
భారతదేశ స్మార్ట్ సిటీ మిషన్ కు సహాయం చేయడానికి సింగపూర్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి సహాయం చేయడానికి ముందుకొచ్చింది.
స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, యూకే, హాంకాంగ్ కూడా స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
ఇటలీ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ పై ఆసక్తి కనబరిచింది, అనేక కార్యక్రమాల ద్వారా వచ్చే 20 సంవత్సరాలలో 1.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. కన్సల్టెన్సీ నుండి మౌలిక సదుపాయాల వాస్తవ నిర్మాణం వరకు సేవలతో ఇటాలియన్ కంపెనీలు స్మార్ట్ సిటీల రూపకల్పన, సాంకేతికత పరంగా దోహదం చేస్తాయి.
ఎంపికైన పట్టణాలు
మార్చు2016 లో స్మార్ట్ సిటీ ఇండియా ప్రాజెక్టును ప్రారంభించడంతో, అనేక రాష్ట్రాలు తమ నగరాలను సరికొత్త ప్రపంచంగా అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టులో ఎంపికైన నగరాల ( రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు) ఈ విధంగా ఉన్నాయి[8].
క్రమ సంఖ్య | పేరు | రాష్ట్రాలు |
---|---|---|
1 | పోర్ట్ బ్లెయిర్ | అండమాన్ నికోబార్ దీవులు |
2 | విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతి | ఆంధ్ర ప్రదేశ్ |
3 | పాసిఘాట్ | అరుణాచల్ ప్రదేశ్ |
4 | గౌహతి | అస్సాం |
5 | ముజఫర్ పూర్,భాగల్ పూర్,బిహార్ షరీఫ్,పాట్నా | బీహార్ |
6 | చండీగఢ్, | చండీగఢ్ |
7 | రాయ్ పూర్,బిలాస్ పూర్,నయా రాయ్ పూర్ | ఛత్తీస్ ఘడ్ |
8 | డయ్యూ | డామన్& డయ్యూ |
9 | సిల్వాసా | దాద్రా & నగర్ హవేలీ |
10 | న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ | ఢిల్లీ |
11 | పనాజీ | గోవా |
12 | గాంధీనగర్,అహ్మదాబాద్,సూరత్,వడోదర,రాజ్ కోట్,దాహోద్ | గుజరాత్ |
13 | కర్నాల్,ఫరీదాబాద్ | హర్యానా |
14 | ధర్మశాల,సిమ్లా | హిమాచల్ ప్రదేశ్ |
15 | శ్రీనగర్,జమ్మూ | జమ్మూ & కాశ్మీర్ |
16 | రాంచీ | జార్ఖండ్ |
17 | మంగళూరు,బెళగావి,శివమొగ్గ,హుబ్బళ్ళి ధార్వాడ్,తుమకూరు,దావణగేరే,బెంగళూరు | కర్ణాటక |
18 | కొచ్చి,త్రివేండ్రం | కేరళ |
19 | కావర్తి | లక్షద్వీప్ |
20 | భోపాల్, ఇండోర్,జబల్ పూర్,గ్వాలియర్,సాగర్,సత్నా,ఉజ్జయిని | మధ్య ప్రదేశ్ |
21 | నాసిక్,థానే,గ్రేటర్ ముంబై,అమరావతి,షోలాపూర్,నాగపూర్,కళ్యాణ్-డోంబివలి,ఔరంగాబాద్,
పుణె,పింప్రి చించ్వాడ్ |
మహారాష్ట్ర |
22 | ఇంఫాల్ | మణిపూర్ |
23 | షిల్లాంగ్ | మేఘాలయ |
24 | ఐజ్వాల్ | మిజోరం |
25 | కోహిమా | నాగాలాండ్ |
26 | భువనేశ్వర్,రూర్కెలా | ఒడిషా |
27 | ఔల్ గరెట్,పుదుచ్చేరి | పుదుచ్చేరి |
28 | లుధియానా,జలంధర్,అమృత్ సర్ | పంజాబ్ |
29 | జైపూర్,ఉదయపూర్,కోట,అజ్మీర్ | రాజస్థాన్ |
30 | నాంచి,గ్యాంగ్ టక్ | సిక్కిం |
31 | తిరుచిరాపల్లి,తిరునెల్వేలి,దిండిగల్,తంజావూరు,తిరుప్పూర్,సేలం,వెల్లూర్,కోయంబత్తూరు,
మదురై,ఏరోడ్,తూత్తుకుడి,చెన్నై |
తమిళనాడు |
32 | గ్రేటర్ హైదరాబాద్,గ్రేటర్ వరంగల్,కరీంనగర్ | తెలంగాణ |
33 | అగర్తలా | త్రిపుర |
34 | మొరాదాబాద్,అలీఘర్,సహారన్ పూర్,బరేలీ,ఝాన్సీ,కాన్పూర్,ప్రయాగ్ రాజ్,లక్నో,వారణాసి
ఘజియాబాద్,ఆగ్రా,రాంపూర్ |
ఉత్తర ప్రదేశ్ |
35 | డెహ్రాడూన్ | ఉత్తరాఖండ్ |
36 | న్యూ టౌన్ కోల్ కతా,బిధాన్ నగర్,దుర్గాపూర్,హల్దియా | పశ్చిమ బెంగాల్ |
పురోగతి
మార్చు2015లో ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్ సి ఎం ) భారతదేశంలో గుర్తించిన నగరాలను స్మార్ట్ సిటీలుగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది, మొదటి విడతలో కొంత జాప్యం జరిగినా, ప్రస్తుతం స్థిరంగా పురోగతిని సాధిస్తోంది.
2023 జూలై 7 నాటికి 7,978 ప్రాజెక్టులలో 100 స్మార్ట్ సిటీలు మొదలకు అనుమతులు ( వర్క్ ఆర్డర్లు) జారీ చేశాయని, వీటిలో 5,909 ప్రాజెక్టులు (74 శాతం) పూర్తయ్యాయని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ యు ఏ) లోక్ సభ కు సమర్పించిన తమ నివేదిక (డేటా)లో పేర్కొంది. 100 స్మార్ట్ సిటీల కోసం ప్రభుత్వం రూ.73,454 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.66,023 కోట్లు (90 శాతం) వినియోగించబడినాయని ఈ నివేదిక పేర్కొన్నది.
స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్ సిఎం) ప్రాజెక్టుల మొత్తం వ్యయం రూ .1,79,228.99 కోట్లు, ప్రారంభ మొత్తం అంచనా రూ .2.05 లక్షల కోట్లు, ఇందులో సగం కంటే తక్కువ ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయి, మిగిలిన మొత్తాన్ని అంతర్గత లేదా బాహ్య వనరులు,ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి సమీకరించాలని నిర్ణయించారు[9].
మూలాలు
మార్చు- ↑ "Smart Cities - Mission Statement & Guidelines" (PDF). Ministry of Urban Development- Government of India. 2015. Retrieved 20 November 2023.
{{cite web}}
: Invalid|url-status=/upload/uploadfiles/files/SmartCityGuidelines(1).pdf
(help) - ↑ "Team, Smart cities". Government of India. Retrieved 27 October 2023.
- ↑ "Total proposed investment in 99 smart cities to be Rs.203979 crores". 19 January 2018. Retrieved 27 October 2023.
- ↑ "Smart Cities Mission 2023: All You Need to Know about Smart Cities". Magicbricks Blog (in ఇంగ్లీష్). 2022-02-21. Retrieved 2023-11-20.
- ↑ Jha, Abhishek Kumar (2023-07-22). "What is the Full Form of ULB?". Leverage Edu (in ఇంగ్లీష్). Retrieved 2023-11-20.
- ↑ [w.insightsonindia.com/social-justice/welfare-schemes/schemes-under-ministry-of-housing-and-urban-affairs/smart-cities-mission-scm/ "Smart Cities Mission (SCM)"]. https://www.insightsonindia.com/social-justice/welfare-schemes. 20 November 2023. Retrieved 20 November 2023.
{{cite web}}
: Check|url=
value (help); External link in
(help)|website=
- ↑ "Smart Cities Mission | IBEF". India Brand Equity Foundation (in ఇంగ్లీష్). Retrieved 2023-11-20.
- ↑ "List of 98 Cities selected under Smart Cities Mission". https://pib.gov.in/newsite/printrelease.aspx?relid=126384. 27-August-2015.
{{cite web}}
: Check date values in:|date=
(help); External link in
(help)|website=
- ↑ "Rise of Smart Cities: Urbanization and Economic Transformation in India 2047". Business Today (in ఇంగ్లీష్). 2023-08-25. Retrieved 2023-11-20.