స్వతంత్రపురం
స్వతంత్రపురం కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
స్వతంత్రపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°01′00″N 81°02′48″E / 16.016689°N 81.046541°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కోడూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి అద్దంకి శారద |
పిన్ కోడ్ | 521328 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
ఈ గ్రామం కోడూరు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామం.
గ్రామానికి రవాణా సౌకర్యం
మార్చునాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మార్చుశ్రీ చామర్తి ప్రకాశరాయ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చు(1) ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న తిరుమలకొండ గోపీకృష్ణ, జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనాడు. 2014, డిసెంబరు-21 నుండి 23 వరకు, గుంటూరుజిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన, రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో ఇతడు ప్రతిభ కనబరచి, జాతీయస్థాయికి ఎంపికైనాడు. [1]
(2) ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న బి.ఎన్.వి.ఎస్.చైతన్య అను విద్యార్థి, 2015, సెప్టెంబరు-8వ తెదీనాడు, విజయవాడలోని డాన్ బాస్కో పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ పోటీలలో ప్రదర్శించిన, చెత్తను చేద్దాం చిత్తు అను ప్రదర్శన ప్రశంసలనందుకుని, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. [2] (3) ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన కె.ఉమాప్రసన్నలక్ష్మి (9.8 జి.పి.ఏ), శ్రీకాకుళం ఐ.ఐ.ఐ.టి.(9.8 జి.పి.ఏ)లోనూ, మద్దాల పూజ (9.7జి.పి.ఏ) కు నూజివీడులోనూ, బి.ఎన్.వి.ఎస్.చైతన్య (9.7జి.పి.ఏ)కూ, పి.ప్రదీప్ (9.7జి.పి.ఏ)కూ ఒంగోలులోనూ ప్రవేశం సంపాదించినారు. [4]
బి.సి.బాలుర వసతిగృహం
మార్చుప్రస్తుతం ఇక్కడ 62 మంది విద్యార్థులు ఉంటున్నారు. [3]
గ్రామములో మౌలిక వసతులు
మార్చుప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-25; 2వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-11; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-3; 43వపేజీ. [4] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జులై-1; 1వపేజీ.