స్వరూపరాణి తెలుగు గజల్ గాయని. కర్ణాటక సంగీతము నేర్చుకున్న స్వరూప అనేక ప్రదర్శనలు ఇచ్చింది.

జననం - విద్యాభ్యాసం మార్చు

ఆమె మెదక్ జిల్లా జహీరాబాద్ లో వ్యవసాయ కుటుంబంలో పెద్దారెడ్డి, వీరమణి దంపతులకు జన్మించింది. స్థానిక సరస్వతీ శిశుమందిర్ లో విద్యాభ్యాసం చేసింది. ఆమెకు చిన్నతనం నుండి పాటలన్నా, శ్లోకాలన్నా ఆసక్తి ఉండేది. సంగీతం పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ జహీరాబాదులో తగిన బోధకులు లేనందువల్ల పదవ తరగతి చదివిన తరువాత సంగీతాన్ని అభ్యసించుటకు హైదరాబాదు వచ్చింది. హైదరాబాదు రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ లో చేరింది.

సంగీత ప్రస్థనం మార్చు

'రామ్‌కోటి' కాలేజీలోని సంగీతం కోర్సులో చేరింది. జె.డి.చక్రవర్తి తల్లి కోవెల శాంత వద్ద సంగీత జ్ఞానాన్ని అభ్యసించింది. ఇంటర్ విద్య తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీతంలో డిగ్రీ చేసింది. గజల్స్ పై ఆసక్తితో వాటిని కూడా నేర్చుకొని, 2017, మార్చి 16న రవీంద్రభారతిలో తన మొదటి గజల్‌ కచేరి నిర్వహించింది.[1][2]

సినిమారంగం మార్చు

  1. నీదీ నాదీ ఒకే కథ సినిమాలో హృదయమెంత తపిస్తే.. బతుకు విలువ తెలిసింది అనే గజల్ ను పాడింది.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

ఆమె భర్త వెంకటరెడ్డి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యం, సంగీతం అంటే ఆయనకూ చాలా ఇష్టం. అమెనెంతో ప్రోత్సహిస్తారు.. వీరికి పాప ఖ్యాతిప్రియ, బాబు సాయి ప్రహర్షిత్‌ రెడ్డి.[3]

మూలాలు మార్చు

  1. YOYO TV Channel (2017-07-02), Singer Dr. Swaroopa Rani Songs and Exclusive Interview | Aamani | YOYO TV Channel, retrieved 2018-04-25
  2. "హృద‌యాన్ని త‌ట్టి‌న గ‌జ‌ల్ స్వ‌రూపం". Archived from the original on 2019-06-28. Retrieved 2018-04-25.
  3. 3.0 3.1 ప్రజాశక్తి, ఫీచర్స్ (8 April 2018). "హృద‌యాన్ని త‌ట్టి‌న గ‌జ‌ల్ స్వ‌రూపం". గంగాధర్‌ వీర్ల. Archived from the original on 28 June 2019. Retrieved 28 June 2019.

బయటి లంకెలు మార్చు