నీదీ నాదీ ఒకే కథ

వేను ఉడుగుల చిత్రం 2018

నీదీ నాదీ ఒకే కథ 2018 మార్చి 23న విడుదలైన తెలుగు సినిమా.వేణు ఊడుగుల దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సత్నా టైటస్ జంటగా నటించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.[1]

నీదీ నాదీ ఒకే కథ
దర్శకత్వంవేణు ఊడుగుల
స్క్రీన్ ప్లేవేణు ఊడుగుల
కథవేణు ఊడుగుల
నిర్మాతప్రశాంతి, కృష్ణ విజయ్‌
తారాగణం
ఛాయాగ్రహణంరాజ్‌ తోట, పర్వీజ్‌ కె
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థలు
ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
విడుదల తేదీ
23 మార్చి 2018 (2018-03-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నాలుగు సార్లు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం అందుకున్న రుద్రరాజు దేవీ ప్రసాద్‌(దేవీ ప్రసాద్‌) కుమారుడు రుద్రరాజు సాగర్‌ (శ్రీ విష్ణు). పండిత పుత్ర పరమ శుంఠః అన్నట్టుగా చదువుల్లో చాలా వెనకబడి ఉంటాడు. డిగ్రీ అతి కష్టం మీద తన చెల్లెలితో కలిసి పరీక్షలు రాస్తాడు. చదువు అస్సలు ఎక్కదు. పరీక్షలంటే భయం. కానీ, తన తండ్రి ఆనందం కోసం ఏదైనా చేద్దామని తహతహలాడుతుంటాడు. అందుకోసం వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదువుతూ, ఆ తరగతులకు వెళ్తూ తనని తాను మార్చుకుంటూ.. నాన్నకు నచ్చేట్లుగా బతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. ఈ ప్రయత్నంలో సాగర్‌ ఏం తెలుసుకున్నాడు? జీవితానికి, జీవితంలో స్థిర పడటానికి తనిచ్చిన నిర్వచనం ఏంటి? అనేదే మిగిలిన కథ.[2]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • రచన & దర్శకత్వం: వేణు ఊడుగుల
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, పర్వీజ్‌ కె
  • స్క్రీన్ ప్లే సహకారం: మోహన్ సాటో
  • కూర్పు: బొంతల నాగేశ్వరరెడ్డి
  • కళ: టి.ఎన్‌.ప్రసాద్‌
  • నిర్మాత: నారా రోహిత్‌, ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు ఊడుగుల
  • బ్యానర్‌: ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
  • సమర్పణ: నారా రోహిత్‌, అట్లూరి నారాయణ రావు

ప్రచార చిత్రం

మార్చు

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం నీది నాది ఒకే కథ . సత్నా టిటస్‌(బిచ్చగాడు ఫేం)కథానాయిక. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. 2018 మార్చి 16 శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎంత చదివినా గుర్తుంచుకోని సగటు విద్యార్థిగా సాగర్‌ అనే పాత్రలో శ్రీవిష్ణు నటించాడు. 'ఒక రకంగా చెప్పాంటే మీలా అవ్వాలని ధార్మికగారూ అని కథానాయికను శ్రీవిష్ణు అడుగుతుంటే .. 'చూడు సాగర్‌.. నేనేదో గ్రేట్‌ కాదు కానీ, నీలాంటి వేస్ట్‌ ఫెలోస్‌ను మార్చడంలో నాకో తృప్తి ఉంటుందీ అంటూ ఆమె చెప్పడం నవ్వులు పూయిస్తోంది.

'నవ్వు రావడం, కోపం రావడం, బాధ కలగడం ఇవన్నీ బేసిక్‌ హ్యూమన్‌ ఎమోషన్స్‌ కదా ' అంటూ శ్రీవిష్ణు ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒత్తిడిని తట్టుకుని సాగర్‌ చదువులో రాణించాడా? తన తండ్రికి నచ్చేలా మారాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అన్నదే 'నీది నాది ఒకే కథ '. ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆరాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ సినిమాను నిర్మిస్తున్నారు.[3]

పాటలు

మార్చు
  1. ఈ సినిమాలో హృదయమెంత తపిస్తే.. బతుకు విలువ తెలిసింది అనే గజల్ ను స్వరూపరాణి పాడింది.[4]
  2. పార్వతి తనయుడివో , రచన: కందికొండ యాదగిరి, గానం.సురేష్ బొబ్బిలి, శంకర్ బాబు, సత్యవతి (మంగ్లి), రంజని, శివకుమార్ శిద్దారెడ్డి, నరేష్
  3. దేహం ఇచ్చిన దైవమా, రచన: శ్రీనివాస్ జిలుకర , మహారాజ్, గానం. నవీన్ అయ్యర్.
  4. ఏందిరా ఈ జననాల గోల, రచన: కాసర్ల శ్యామ్, గానం సురేష్ బొబ్బిలి, సత్యవతి, కైలాస్
  5. ఏదో జరిగే, రచన: కందికొండ, గానం. చిన్మయి
  6. నీది నాది ఒకే కథ, రచన: మట్ల తిరుపతి, గానం: శ్రీ కావ్య, సురేష్ బొబ్బిలి
  7. నాలోన నీవు నీలోన నేను , రచన: శ్రీనివాస్ జీలుకర, సోనీ, నాని

మూలాలు

మార్చు
  1. Sakshi (23 March 2018). "'నీదీ నాదీ ఒకే కథ' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
  2. "Needi Naadi Oke Katha Review". www.chitramala.in. 2018-03-22. Retrieved 2018-03-23.
  3. "'నీది నాది ఒకే కథ' ట్రైలర్‌ చూశారా!". ఈనాడు. 2018-03-16. Archived from the original on 2018-03-16. Retrieved 2018-03-16.
  4. ప్రజాశక్తి, ఫీచర్స్ (8 April 2018). "హృద‌యాన్ని త‌ట్టి‌న గ‌జ‌ల్ స్వ‌రూపం". గంగాధర్‌ వీర్ల. Archived from the original on 28 June 2019. Retrieved 28 June 2019.

బయటి లంకెలు

మార్చు