స్వామినారాయణ దేవాలయం (కాలిఫోర్నియా)

కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయ సముదాయం.

స్వామినారాయణ దేవాలయం, దక్షిణ కాలిఫోర్నియాలోని నైరుతి శాన్ బెర్నార్డినో కౌంటీలోని చినో హిల్స్‌లో ఉన్న హిందూ దేవాలయ సముదాయం. హిందూమతంలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థకు చెందిన ఈ దేవాలయం, అన్ని మతాల భక్తులకు పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది.[1]

స్వామినారాయణ దేవాలయం (కాలిఫోర్నియా)
దేవాలయ ప్రధానమెట్లు, సాంప్రదాయ చెక్కిన రాయి
దేవాలయ ప్రధానమెట్లు, సాంప్రదాయ చెక్కిన రాయి
భౌగోళికం
దేశంయునైటెడ్ స్టేట్స్
రాష్ట్రంకాలిఫోర్నియా
ప్రదేశంచినో హిల్స్‌
శాన్ బెర్నార్డినో కౌంటీ
సంస్కృతి
దైవంస్వామి నారాయణ
రాధాకృష్ణ
సీత-రాముడు
శివుడు-పార్వతి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుదక్షణ భారత/శిల్పశాస్త్రం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీడిసెంబరు 2012
సృష్టికర్తప్రముఖ్ స్వామి మహారాజ్
వెబ్‌సైట్అధికారిక వెబ్సైటు

నిర్మాణ శైలీ మార్చు

ప్రపంచంలోనే మొదటి భూకంప ప్రూఫ్ దేవాలయమిది.[2] 2012లో పూర్తిచేయబడిన సాంప్రదాయ హిందూ మందిరమిది. 20 ఎకరాల స్థలంలో 91 అడుగుల తామరపువ్వు ఆకారంలో ఉన్న ఈ దేవాలయ సముదాయంలో సాంస్కృతిక కేంద్రం, వ్యాయామశాల, తరగతి గదులు ఉన్నాయి. మందిరాన్ని నిర్మించడానికి రెండవతరానికి చెందిన భారతీయ-అమెరికన్‌లతో సహా దాదాపు 900 మంది వాలంటీర్లు సుమారు 1.3 మిలియన్ల పనిగంటలను స్వచ్ఛందంగా అందించారు.[3] విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి, పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ దేవాలయంలో సౌర విద్యుత్ వ్యవస్థ ఉంది.[2] సోలార్ ప్యానెల్ పవర్ సిస్టమ్ 1,556 టన్నుల కార్మన్ డై ఆక్పైడ్ ఉద్గారాలను తగ్గిస్తుంది, ఇది 25 సంవత్సరాల కాలంలో 62,244 చెట్లను నాటడానికి సమానంగా ఉంటుంది.[4]

చరిత్ర మార్చు

బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ మాజీ ఆధ్యాత్మికవేత్త స్వామి మహారాజ్ 1977లో కాలిఫోర్నియాను సందర్శించాడు. 1984లో స్వామి మహారాజ్ లాస్ ఏంజిల్స్ కౌంటీలోని విట్టియర్‌లో ఒక చిన్న ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రారంభించాడు.[5] పంతొమ్మిది సంవత్సరాల తరువాత, 1996లో సాంప్రదాయ రాతి మందిరంతో సహా ఒక పెద్ద సౌకర్యాన్ని నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది.[5]

2004లో ఆలయంపై ప్రజల వ్యతిరేకతతో నగర మండలి తిరస్కరించగా, ఆగస్టు 2011లో కౌన్సిల్ ఆమోదన లభించింది. 78 అడుగుల ఎత్తుతో సంప్రదాయ మందిరాన్ని నిర్మించేందుకు 2011, ఆగస్టులో చినో హిల్ నగరపు ఏకగ్రీవ ఆమోదాన్ని పొందింది.[6]

నిర్మాణం మార్చు

35,000 ముక్కలు చెక్కిన ఇటాలియన్ కర్రారా పాలరాయి, భారతీయ పింక్ ఇసుకరాయితో ఈ దేవాలయం నిర్మించబడింది. ఐదు పినాకిల్స్, రెండు పెద్ద గోపురాలు, నాలుగు బాల్కనీలు, 122 స్తంభాలు, 129 ఆర్చి దారులను కలిగివుంది. బయటి గోడలు, గోపురాల నుండి లోపలి స్తంభాలు, పైకప్పుల వరకు, మందిరం మొత్తం పాలరాయి, ఇసుకరాయితో నిర్మించారు. 6,600 చేతితో చెక్కబడిన బొమ్మలు హిందూమత చారిత్రక వ్యక్తులు, భక్తి కథలను వర్ణిస్తాయి.[7]

దేవాలయ నిర్మాణ వివరాలు మార్చు

స్వామినారాయణ దేవాలయం నిర్మాణ వివరాలు:[7]

  • 5 శిఖరాలు
  • 2 గోపురాలు
  • వందలాది బొమ్మలతో కూడిన 4 బాల్కనీలు
  • 35,000 రాతి ముక్కలు ఒక పజిల్ లాగా ఉంచబడ్డాయి
  • 122 చేతితో చెక్కబడిన స్తంభాలు
  • 129 ఆర్చ్‌వేలు
  • 6,600 చేతితో చెక్కిన చిత్రాలు (బొమ్మలు)
  • భారతదేశంలోని 1,500 మంది హస్తకళాకారులు
  • 91 అడుగులు, లోటస్ ఆకారంలో ప్రతిబింబించే చెరువు, ఫౌంటెన్
  • భూకంపాల నుండి రక్షించడానికి 40 బేస్-ఐసోలేటర్ యూనిట్లు
  • ఏటా 597 కిలోవాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే అత్యాధునిక సౌర వ్యవస్థ
  • సహజ, శక్తి ఆదా లైటింగ్ కోసం 20 స్కైలైట్లు
  • 900 మంది వాలంటీర్లు తమ సేవలను అందించారు
  • 1.3 మిలియన్ల పని గంటలు.
  • 1000 సంవత్సరాల పాటు ఉండేలా నిర్మించారు

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. "MAJESTIC HINDU TEMPLE Opens In CALIFORNIA". 2012-12-22. Archived from the original on 2015-04-23. Retrieved 19 January 2022.
  2. 2.0 2.1 Sindhu, Sonia (2013-01-02). "New BAPS mandir combines best of architecture & technology". India Post News Service. Retrieved 19 January 2022.
  3. Pais, Arthur J (2013-01-04). "How the new BAPS temple in California overcame opposition". India Abroad.
  4. Patel, Deep. "Blank". The Solar Drop.
  5. 5.0 5.1 "California's First Quake-Ready Stone Temple". Hinduism Today. 2013-07-01. Archived from the original on 2021-04-16. Retrieved 19 January 2022.
  6. Napoles, Marianne (2012-12-22). "BAPS Races to open Dec 23". Chino Hills Champion.
  7. 7.0 7.1 Bodiwala, Suresh (2012-12-28). "Blank". Asian Media USA.