హమీర్సర్ సరస్సు
హమీర్సర్ సరస్సు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం లో గల కచ్ జిల్లా ప్రధాన కేంద్రమైన భుజ్ లో ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు.
హమీర్సర్ సరస్సు | |
---|---|
![]() హమీర్సర్ సరస్సు ఉత్తర తీరం | |
ప్రదేశం | భుజ్, గుజరాత్ |
అక్షాంశ,రేఖాంశాలు | 23°15′5″N 69°39′51″E / 23.25139°N 69.66417°ECoordinates: 23°15′5″N 69°39′51″E / 23.25139°N 69.66417°E |
సరస్సు రకం | కృత్రిమ సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 69 acres (28 ha) |
Islands | రాజేంద్ర పార్క్ |
ప్రాంతాలు | భుజ్ |
చరిత్రసవరించు
హమీర్సర్ సరస్సు 450 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతన సరస్సు. దీనిని భుజ్ వ్యవస్థాపకుడు నిర్మించాడు. కచ్‌లోని జడేజా రాజవంశం స్థాపకుడు రావు ఖెంగర్జీ (1548–1585) పాలనలో ఈ సరస్సు నిర్మించబడింది. దీనికి అతని తండ్రి రావు హమీర్ పేరు పెట్టారు. దీనిని 1549 లో అతని రాజ్యానికి రాజధానిగా ప్రకటించాడు.[1]
ప్రకృతి వైపరిత్యాలుసవరించు
కచ్‌లో 2001 లో సంభవించిన భూకంపానికి ముందే, హమీర్‌సర్ సరస్సు, దాని పరీవాహక ప్రాంతాలు చాలావరకు నీట మునిగాయి.భూకంపం తరువాత, సాంప్రదాయ నీటి వ్యవస్థను పునరుద్ధరించడానికి, భుజ్ ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి దాని పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికి, అక్కడి మునిసిపాలిటీ చర్యలు చేపట్టింది. గత 50 సంవత్సరాల వ్యవధిలో అత్యధిక వర్షపాతం (22 అంగుళాలు) 2003 లో నమోదైంది. ఇది హమీర్సర్ సరస్సును పొంగి ప్రవహింపజేసింది.[2]
భౌగోళికంసవరించు
ఈ సరస్సు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అహ్మదాబాద్ లోని కంకరియా సరస్సు వలె మధ్యలో అందమైన తోటను కలిగి ఉంది. ఈ తోటను మిడ్-లేక్ ఐలాండ్ అనీ, గ్రీన్ ఐలాండ్ అని పిలిచేవారు. కాని ఇప్పుడు దీనికి రాజేంద్ర పార్క్ అని పేరు పెట్టారు.[3]
సందర్శనీయ స్థలాలుసవరించు
ఈ సరస్సు అంచున ఉన్న మహల్, ప్రాగ్ మహల్, కచ్ మ్యూజియం, ఆల్ఫ్రెడ్ హై స్కూల్, తూర్పున ఉన్న అనేక దేవాలయాలు ఇక్కడి చూడదగ్గ ప్రదేశాలు.[4]
మూలాలుసవరించు
- ↑ The famous Hamirsar Lake named after the founder of Bhuj
- ↑ Jadeja dynasty of Cutch Hamirji - Rao Khengarji I Archived 2011-06-13 at the Wayback Machine
- ↑ "Understanding the water system of Bhuj - on www.bhujbolechhe.org". Archived from the original on 2014-05-22. Retrieved 2021-06-30.
- ↑ Hamirsar Lake