హరవిలాసం (సినిమా)
హరవిలాసము (ప్రత్యామ్నాల శీర్షిక: శివరాత్రి మహాత్య్మము) 1941 అక్టోబరు 18న విడుదలైన తెలుగు సినిమా. సుందరం సౌండ్ స్టుడియోస్ పతాకం కింద నిర్మించబడిన ఈ సినిమాకు కొచ్చెర్లకోట రంగారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వేమూరి గగ్గయ్య, పారుపల్లి, పద్మ, పువ్వుల లక్ష్మీకాంతం లు ప్రధాన తారాగణంగా నటించారు.[1] ఈ చిత్రం "హరవిలాస్" లేదా "శివరాత్రి మహాత్మ్యం" అనే శీర్షికతో విడుదలైంది.
హరవిలాసం (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొచ్చర్లకోట రంగారావు |
---|---|
తారాగణం | వేమూరి గగ్గయ్య, పారుపల్లి, పద్మ, లక్ష్మీకాంతం |
నిర్మాణ సంస్థ | సుందరం సౌండ్ స్టూడియో |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- వేమూరి గగ్గయ్య
- పారుపల్లి
- పద్మ
- పువ్వుల లక్ష్మీకాంతం
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కొచ్చెర్లకోట రంగారావు
కథ
మార్చుహరవిలాసము కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడైన శ్రీనాథుడు రాసిన కావ్యం. ఈ గ్రంథం శైవభక్తుల జీవితాల్లో పరమేశ్వరుడైన శివుడు చేసిన పలు లీలల సంకలనం. శిరియాళుడు, చిరుతొండనంబి మొదలైన పలువురు శివభక్తుల జీవితగాథలు ఈ గ్రంథానికి ఇతివృత్తం. ఈ గ్రంథం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడినది.
మూలాలు
మార్చు- ↑ "Haravilasamu (1941)". Indiancine.ma. Retrieved 2022-12-25.