హరికిరణ్ చేరెడ్డి

తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త, ఏంజెల్ ఇన్వెస్టర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

హరికిరణ్ చేరెడ్డి, తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త, ఏంజెల్ ఇన్వెస్టర్, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.[3] హెచ్.ఆర్.వి. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్. గతంలో సుజనా ఎనర్జీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.[4][5]

హరికిరణ్ చేరెడ్డి
జననం (1980-05-19) 1980 మే 19 (వయసు 43)[1]
విద్యఉస్మానియా విశ్వవిద్యాలయం (బిఈ), కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (ఎంబిఏ)
వృత్తివ్యాపారవేత్త, ఏంజెల్ ఇన్వెస్టర్
బోర్డు సభ్యులుహైదరాబాదు ఏంజెల్స్[2]

జననం, విద్య మార్చు

హరికిరణ్ చేరెడ్డి 1980, మే 19న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ డిగ్రీని, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి సప్లై-చైన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌లో ఎంబిఎ పట్టా పొందాడు.

వ్యాపారరంగం మార్చు

భారతదేశంలోని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆపరేషన్స్ హెడ్‌గా తన వృత్తిని ప్రారంభించిన హరికిరణ్, అధునాతన ఎల్ఈడి లైటింగ్ సొల్యూషన్స్‌ను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన సుజనా ఎనర్జీ (సౌర ఉత్పత్తులు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పరిష్కారాలు) అనే కంపెనీని స్థాపించాడు.[6][7] ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన శ్రీయం ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కుటుంబ వ్యాపారంలో చేరి, దానిని విస్తరించాడు. ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో జాబితా చేయబడిన లారస్ ల్యాబ్స్‌కు విక్రయించాడు. ఎనర్జీ & ఎన్విరాన్‌మెంట్‌పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్యానెల్‌లో సభ్యుడిగా పనిచేశాడు.[8]

బ్యాడ్మింటన్ మార్చు

హరికిరణ్ అనేక సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[9][10] ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్ లలో పురుషుల డబుల్స్‌లో 204, వరల్డ్ టూర్ ర్యాంకింగ్ పురుషుల డబుల్స్‌లో 142 లలో ఉన్నాడు.[11] ప్రపంచవ్యాప్తంగా 20 అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[12]

మూలాలు మార్చు

  1. "Hari Kiran Chereddi". Badminton World Federation. 2019. Retrieved 2022-05-22.
  2. "Hari Kiran Chereddi". Hyderabad Angels. 2019. Retrieved 2022-05-22.
  3. Vaidya, Jaideep. "Meet Hari Kiran C, an entrepreneur playing in his first ever badminton Nationals at age 37". Scroll.in. Retrieved 2022-05-22.
  4. Reporter, B. S. (2011-04-22). "Sujana group grants Rs 2.2 cr to Columbia Law School". Business Standard India. Retrieved 2022-05-22.
  5. "Suzlon pact with Vedanta for 150 Mw wind power projects" (PDF).
  6. "Mentors | Nexus". Archived from the original on 2018-10-06. Retrieved 2019-03-18.
  7. Reporter, B. S. (2010-05-28). "Sujana Energy eyes Rs 500 cr from lighting". Business Standard India. Retrieved 2022-05-22.
  8. "Green Company Rating System" (PDF).[permanent dead link]
  9. "US Open: Ajay Jayaram to spearhead India's challenge as Kidambi Srikanth, HS Prannoy miss out the tournament | Badminton News". www.timesnownews.com. Retrieved 2022-05-22.
  10. AuthorTelanganaToday. "Indonesia's Wardoyo shocks second seed Sai Praneeth". Telangana Today. Retrieved 2022-05-22.
  11. "HARI KIRAN CHEREDDI | Profile". bwfbadminton.com. Retrieved 2022-05-22.
  12. "Badminton - Hari Kiran Chereddi (India)". www.the-sports.org. Retrieved 2022-05-22.