హరిశ్చంద్ర (1935 సినిమా)
హరిశ్చంద్ర టి.ఎ.రామన్ దర్శకత్వంలో స్టార్ కంబైన్స్ పతాకంపై కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి, భీమారావు ప్రధాన పాత్రల్లో నటించిన 1935 నాటి తెలుగు పౌరాణిక చలన చిత్రం. ఈ సినిమాకు పి. పుల్లయ్య సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఈ సినిమాతో కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా మంచి విజయం సాధించింది.
హరిశ్చంద్ర (1935 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎ.రామన్ |
---|---|
రచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
తారాగణం | కన్నాంబ, భీమారావు, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, ఏలేశ్వరపు కుటంబశాస్త్రి |
నిర్మాణ సంస్థ | స్టార్ కంబైన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సంగీతం
మార్చుచిత్ర బృందం
మార్చునటీనటులు
మార్చుతర్వాతి కాలంలో ప్రఖ్యాతి పొందిన తెలుగు సినిమా నటులు కన్నాంబ, అద్దంకి శ్రీరామమూర్తిలకు ఇది తొలి చలన చిత్రం.[1] నటులు - పాత్రల వివరాలు ఇలా ఉన్నాయి:
- కన్నాంబ - చంద్రమతి
- అద్దంకి శ్రీరామమూర్తి - హరిశ్చంద్రుడు
- భీమారావు -
- పులిపాటి వెంకటేశ్వర్లు - నక్షత్రకుడు
- ఏలేశ్వరపు కుటుంబశాస్త్రి - కౌశికుడు
- బందరు నాయుడు
- ఆకుల నరసింహారావు
సాంకేతిక వర్గం
మార్చు- రచన - బలిజేపల్లి లక్ష్మీకాంతం
- దర్శకత్వం - టి.ఎ.రామన్
- ఫోటోగ్రఫీ - జినరాజా బోధ్యే
- రికార్డింగ్ - జి.ఎల్.కాలే
- సంగీతం - బి.జి.తెంబే, ఖా సాహెబ్ బూర్జిఖా
- కళా దర్శకత్వం - గణపతిరావు వదాంగేకర్
- సహ దర్శకుడు - అన్నాసాహెబ్ రాజోపాధ్యాయె
- సహాయ దర్శకుడు - పి.పుల్లయ్య
స్పందన
మార్చుహరిశ్చంద్ర చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది విజయవంతం అయింది.[1]
పాటల జాబితా
మార్చు1.అకటా ఆకలికి నేనో మాతా సైపజాలను ,
2.అపరాధము సైవువే ఆర్యమణి, గానం: అద్దంకి శ్రీరామమూర్తి
3.ఆటకు బోధమా సఖులారా వాటముగ జేరి ,
4.కనుగొనజాలన్ ప్రియసుతునికనె, గానం: పసుపులేటి కన్నాంబ
5.కరుణాకర కరుణింపవా కాంచనాంబ రా , గానం.పసుపులేటి కన్నాంబ
6.కరుణాగుణా ఆధారాసంతతా శ్రీతదీనా లావణ్య ,
7.జయ జయ కోసల దేశప్రభు జయజయ శ్రీహరి, గానం.బృందం
8.దండాలండి బాబు దండాలు దండాలండి మీకు , గానం.
9.నా ప్రియ మనోరమణా నను నేపుడీటువలె, గానం.పసుపులేటి కన్నాంబ
10.మాతా నడువలేనా హా పాదములెంత పొక్కేనో,
11.వగలమారి ఓ వయ్యారి మామా చిందులేతయు,
12 . శ్రీతజనబందు కరుణాసింధు సేద్యరూప హర, గానం.పసుపులేటి కన్నాంబ
13.హా తనయా నను బాసితివా యీ విధి నీవస్తమింప, గానం: పసుపులేటి కన్నాంబ
14.సలలిత కరుణానిలయా శరణీయము గాదే ,
పద్యాలు
మార్చు1.అంతటి రాజచంద్రునికి నాత్మజవై , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
2.అకటా మొక్కని పంచదాసియయు , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
3.అడుగేన్నండిడనీక నేలపై నట్లాల్లారు ముద్దుగా, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
4.అరయన్ వంశము నిల్పనే కదా వివాహంబట్టి , గానం.అద్దంకి శ్రీరామమూర్తి
5..ఆ కల్పాంతము నంతముంగనని, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
6.కదలవేయని విప్పుడదలించుటకు మున్ను గనులారా, గానం.పసుపులేటి కన్నాంబ
7.చతురంబోది పరీత భూత ధరణి సామ్రాజ్య సర్వస్వ, గానం.అద్దంకి శ్రీరామచంద్రమూర్తి
8.చనుబాలిచ్చిన తోడనే నిదుర బుచ్చన్, గానం.పసుపులేటి కన్నాంబ
9.చెడుగా ఏపని చేతగానియెడ నాచే నౌనే, గానం.పసుపులేటి కన్నాంబ
10.జలదమా సుంత మార్పులికిన్ దోసమా ఎరుగవా , గానం.పసుపులేటి కన్నాంబ
11.తన మహీరాజ్య మంతయు గాధి సూతికిన్ దానమిచినట్టి , గానం.పులిపాటి వెంకటేశ్వర్లు
12.దళమౌ పయ్యదలో నడంగియు సముద్యత్కాంత , గానం.అద్దంకి శ్రీరామమూర్తి .
13.దేవ బ్రాహ్మణ మాన్యంలిడిచి భక్తిన్, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
14.నను శంకింతువే ఇంత నిష్టూరనీ తాంత క్షాత్రరేఖా,
15.సరసీ కష్టములెన్ని వచ్చినను గాను నీ పదాబ్ద, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
16.బ్రతుకాశించిన వాడేవండు వినడీ వాక్యంభు, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు
17.కట్టా ఎక్కడ లేరే దీనజన రక్షాదక్షులీ, గానం.పసుపులేటి కన్నాంబ .
18.మాయామేయ జగంబే నిత్యమని సంభావించి, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
20.హృదయమున దుఃఖమింతేని బదిలపడదు, గానం.అద్దంకి శ్రీరామమూర్తి .
21.వైదిక వృత్తి సంపాదింతునంటివా యుడుగవు, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు
22.సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశ మంతరించెడు గాక, గానం.అద్దంకి శ్రీరామమూర్తి
23.హిమ శైలంబున వాయు భక్షణుడై మృతుంజయుని గూర్చి, గానం.బందరు నాయుడు
24.మునివరా లోకమెల్ల ధనమూలము గాన , గానం.అద్దంకి శ్రీరామమూర్తి .
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు". ఆంధ్రజ్యోతి ఆదివారం: 4. 28 January 2007. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 7 June 2017.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.