హరి వినాయక్ పటాస్కర్

భారతీయ రాజకీయవేత్త


హరి వినాయక్ పటాస్కర్ ఒక భారతీయ న్యాయవాది, పుణె విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్.[1]

హరి వినాయక్ పటాస్కర్

పదవీ కాలం
14 జూన్ 1957 – 10 ఫిబ్రవరి 1965
ముందు పట్టాభి సీతారామయ్య
తరువాత కె.సి. రెడ్డి

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (భారతదేశం)
పదవీ కాలం
7 డిసెంబర్ 1956 – 16 ఏప్రిల్ 1957
ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
ముందు లాల్ బహదూర్ శాస్త్రి
తరువాత లాల్ బహదూర్ శాస్త్రి

శాసన సభ సభ్యుడు
పదవీ కాలం
9 డిసెంబర్ 1946 – 24 జనవరి 1950

వ్యక్తిగత వివరాలు

జననం (1892-05-15)1892 మే 15
ఇందాపూర్, పుణె, ముంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మహారాష్ట్ర, భారతదేశం)
మరణం 1970 ఫిబ్రవరి 21(1970-02-21) (వయసు 77)
పుణె, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి అన్నపూర్ణ బాయి

జననం,విద్య

మార్చు

హరి వినాయక్ పటాస్కర్ 15 మే, 1892న మహారాష్ట్రలోని పూనా జిల్లాలోని ఇందాపూర్ అనే ప్రదేశంలో జన్మించాడు. అతను బి.ఎ., ఎల్.ఎల్.బి., L.L.D. డిగ్రీలు పొందాడు. పూనాలోని 'ఫెర్గూసన్ కాలేజ్', ముంబైలోని 'గవర్నమెంట్ లా కాలేజ్'లో చదువుకున్నాడు.

వివాహం

మార్చు

హరి వినాయక్ పటాస్కర్ 29 మార్చి, 1913 న అన్నపూర్ణ బాయిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు ఉంది.[2]

పురస్కారాలు

మార్చు

పటాస్కర్ 1963లో, పబ్లిక్ అఫైర్స్‌ సేవలకు గాను భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను పొందాడు.[3]

ఇతర లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "List of members of the constituent assembly".
  2. "Padma Vibhushan Awardees".
  3. "Governors of Madhya Pradesh". Archived from the original on 12 March 2012.