హర్లీన్ డియోల్

పంజాబ్ కి చెందిన క్రికెట్ క్రీడాకారిణి

హర్లీన్ కౌర్ డియోల్, పంజాబ్కి చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] హిమాచల్ ప్రదేశ్[2] కొరకు అటాకింగ్ కుడిచేతి బ్యాటర్‌గా ఆడుతుంది, అప్పుడప్పుడు కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తుంది.

హర్లీన్ డియోల్
హర్లీన్ డియోల్ (2022)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హర్లీన్ కౌర్ డియోల్
పుట్టిన తేదీ (1998-06-21) 1998 జూన్ 21 (వయసు 26)
చండీగఢ్, పంజాబ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 126)2019 ఫిబ్రవరి 22 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2022 సెప్టెంబరు 24 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.98
తొలి T20I (క్యాప్ 62)2019 మార్చి 4 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2023 ఫిబ్రవరి 12 - పాకిస్తాన్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.98
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013/14–ప్రస్తుతంహిమాచల్ ప్రదేశ్
2019–2020ట్రైల్‌బ్లేజర్స్
2022సూపర్నోవాస్
2023–ప్రస్తుతంగుజరాత్ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల వన్డే ట్వంటీ20
మ్యాచ్‌లు 6 14
చేసిన పరుగులు 101 142
బ్యాటింగు సగటు 25.25 15.77
100లు/50లు 0/1 0/1
అత్యధిక స్కోరు 58 52
వేసిన బంతులు 72 108
వికెట్లు 2 6
బౌలింగు సగటు 28.00 23.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/7 2/13
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/–
మూలం: ESPNCricinfo, 12 ఫిబ్రవరి 2023

హర్లీన్ కౌర్ డియోల్ 1998, జూన్ 21న పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్లో జన్మించింది. మొహాలి లోని యాదవీంద్ర పబ్లిక్ స్కూల్[3] నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది.

క్రికెట్ రంగం

మార్చు

2019 ఫిబ్రవరి 22న ముంబైలోని వాంఖడేలో ఇంగ్లండ్‌పై భారతదేశం తరపున అంతర్జాతీయ మహిళల వన్డేలోకి అరంగేట్రం చేసింది,[4] తానియా భాటియా తర్వాత భారతదేశం తరపున ఆడిన చండీగఢ్ నుండి రెండవ మహిళా క్రికెటర్‌గా నిలిచింది.[5] 2019 మార్చి 4 న ఇంగ్లాండ్‌తో జరిగిన అంతర్జాతీయ మహిళల ట్వంటీ20 లోకి అరంగేట్రం చేసింది.[6] మహిళల టీ20 ఛాలెంజ్‌ని ట్రైల్‌బ్లేజర్స్ కోసం 2019 మే 6న సూపర్‌నోవాస్‌తో ఆడింది. స్మృతి మంధానతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుంది.[7]

2020 జనవరిలో, ఆస్ట్రేలియాలో జరిగిన 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకుంది.[8]

2021 జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన ట్వంటీ 20 సిరీస్‌లో బౌండరీ రోప్‌ను తప్పించుకుంటూ డియోల్ విన్యాసాలు చేయడంతో వైరల్‌గా మారింది. లాంగ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తూ, డియోల్ లాఫ్టెడ్ అమీ జోన్స్ తన తలపై రెండు చేతులతో డ్రైవ్ చేస్తూ క్యాచ్‌కు దూసుకెళ్ళింది. తీను బౌండరీ తాడు దాటి వెళ్తున్నానని గ్రహించి, బంతిని గాలిలోకి విపిరింది. ఆ తరువాత పడిపోతున్న బంతిని తిరిగి పట్టుకోవడానికి మైదానంలోకి తిరిగి డైవ్ చేసింది. ఈ క్యాచ్‌కు ఆమె సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోడీ నుండి ప్రశంసలు అందుకుంది.[9] 2022 జూలైలో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం ఆమె భారత జట్టులో ఎంపికైంది.[10]

2023లో ఇండియన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో, హర్లీన్ డియోల్‌ను గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.[11] నాలుగు వారాల టోర్నమెంట్ ముగింపులో, 200కి పైగా పరుగులు చేసిన పదమూడు బ్యాటర్లలో ఒకరిగా నిలిచింది. 125.46 స్ట్రైక్ రేట్‌తో 202 సాధించి, జట్టుకు టాప్ స్కోరింగ్‌లో రెండు పరుగుల దూరంలో నిలిచింది.

మూలాలు

మార్చు
  1. "Harleen Deol". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  2. "In the zone – North - News - BCCI.tv". www.bcci.tv (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2019. Retrieved 2023-08-02.
  3. "'Opportunity a reward for all that hard work away from home'". Indian Express (in ఇంగ్లీష్). 21 February 2011. Retrieved 2023-08-02.
  4. "1st ODI, England Women tour of India at Mumbai, Feb 22 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  5. "Chandigarh cricketer Taniya Bhatia keen to make her mark after India selection". Hindustan Times (in ఇంగ్లీష్). 10 January 2018. Retrieved 2023-08-02.
  6. "1st T20I, England Women tour of India at Guwahati, Mar 4 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  7. "Match Report: M1 - TRAILBLAZERS vs SUPERNOVAS". www.iplt20.com (in ఇంగ్లీష్). Retrieved 2023-08-02.
  8. "Kaur, Mandhana, Verma part of full strength India squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 2023-08-02.
  9. Rao, Santosh (11 July 2021). "Prime Minister Narendra Modi Reacts To Harleen Deol's "Phenomenal" Catch". NDTV Sports. Retrieved 2023-08-02.
  10. "Team India (Senior Women) squad for Birmingham 2022 Commonwealth Games announced". Board of Control for Cricket in India. Retrieved 2023-08-02.
  11. "WPL Auction 2023 Highlights: Smriti Mandhana costliest player at ₹3.4 crore; Harmanpreet, Deepti, Jemimah hit jackpots". Hindustan Times. Retrieved 2023-08-02.

బయటి లింకులు

మార్చు