హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (జననం 25 జూలై 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 26 మే 2014 నుండి 17 సెప్టెంబర్ 2020 వరకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి) పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేసింది. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ రైతు సంబంధిత ఆర్డినెన్స్‌లు & చట్టాలకు వ్యతిరేకంగా 17 సెప్టెంబర్ 2020న తన మంత్రి పదవికి రాజీనామా చేసింది.[1][2]
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ | |||
| |||
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 17 సెప్టెంబర్ 2020 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | కృష్ణ తీరథ్ | ||
తరువాత | నరేంద్ర సింగ్ తోమార్ | ||
లోక్‌సభ సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 13 మే 2009 | |||
ముందు | పరంజిత్ కౌర్ గుల్షన్ | ||
నియోజకవర్గం | బటిండా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | న్యూఢిల్లీ, భారతదేశం | 1966 జూలై 25||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | శిరోమణి అకాలీదళ్ | ||
జీవిత భాగస్వామి | సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (వివాహం 21 నవంబర్ 1991) | ||
బంధువులు | ప్రకాష్ సింగ్ బాదల్ (మామయ్య) బిక్రమ్ సింగ్ మజీతియా (సోదరుడు) సర్దార్ సుర్జీత్ సింగ్ మజీతియా (తాత) మజీతియా సిరిదార్స్ | ||
సంతానం | 3 | ||
నివాసం | చండీగఢ్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
రాజకీయ జీవితం
మార్చుహర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భార్య. ఆమె 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బటిండా నియోజకవర్గం నుండి శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిగా పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రణిందర్ సింగ్‌పై 120,960 ఓట్ల మెజారిటీతో గెలిచి 15వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైంది. హర్‌సిమ్రత్ బాదల్ 2014లో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ - పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ ఉమ్మడి అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌ను ఓడించి బటిండా నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ (ఆహార శుద్ధి) పరిశ్రమల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[3]
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బటిండా నియోజకవర్గం నుండి మూడోసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా 17 సెప్టెంబర్ 2020న మంత్రి పదవికి రాజీనామా చేసింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (17 September 2020). "కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (17 September 2020). "Harsimrat Kaur Badal resigns as Union Minister over Centre's farm bills" (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
- ↑ HT Correspondent (26 May 2014). "Bathinda MP Harsimrat Kaur Badal sworn in as food processing minister". Hindustan Times. New Delhi. Archived from the original on 27 May 2014.
- ↑ The Week (17 September 2020). "Harsimrat Kaur Badal quits Modi govt over farm bills" (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.
- ↑ BBC News తెలుగు (17 September 2020). "హర్‌సిమ్రత్ కౌర్ బాదల్: 'రైతు వ్యతిరేక' బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి రాజీనామా". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.