సుఖ్‌బీర్ సింగ్ బాదల్
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా, [1] ఫిరోజ్‌పూర్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నాడు.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ | |||
| |||
లోక్‌సభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 | |||
ముందు | షేర్ సింగ్ గుబాయ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఫిరోజ్‌పూర్ | ||
పదవీ కాలం 2004–2009 | |||
ముందు | జాగ్ మీత్ సింగ్ బ్రార్ | ||
తరువాత | పరంజిత్ కౌర్ గుల్షన్ | ||
నియోజకవర్గం | ఫరీద్‌కోట్ | ||
పదవీ కాలం 1996–1999 | |||
ముందు | జాగ్ మీత్ సింగ్ బ్రార్
రాజ్యసభ సభ్యుడు 2001 - 2004 | ||
తరువాత | జాగ్ మీత్ సింగ్ బ్రార్ | ||
నియోజకవర్గం | ఫరీద్‌కోట్ | ||
ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 10 ఆగష్టు 2009 – 11 మార్చి 2017 | |||
ముందు | రాజిందర్ కౌర్ భత్తల్ | ||
తరువాత | *సుఖ్జిందర్ సింగ్ రంధావా సెప్టెంబర్ 2021
| ||
పదవీ కాలం 21 జనుఅరీ 2009 – 1 జులై 2009 | |||
పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 మార్చి 1998 – 12 అక్టోబర్ 1999 | |||
ముందు | మురసోలి మారన్ | ||
తరువాత | మురసోలి మారన్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం ఆగష్టు 2009 – మే 2019 | |||
ముందు | షేర్ సింగ్ గుబాయ | ||
తరువాత | రమిందర్ సింగ్ ఆవాల | ||
నియోజకవర్గం | జలాలాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఫరీద్ కోట్, పంజాబ్, భారతదేశం | 1962 జూలై 9||
రాజకీయ పార్టీ | శిరోమణి అకాలీదళ్ | ||
జీవిత భాగస్వామి | హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ | ||
బంధువులు | గురుదాస్ సింగ్ బాదల్ (బాబాయ్) మాన్ ప్రీత్ సింగ్ బాదల్ | ||
సంతానం | 3 | ||
నివాసం | చండీగఢ్ | ||
వెబ్‌సైటు | http://sukhbirsinghbadal.co.in |
జననం, విద్యాభాస్యం
మార్చుసుఖ్బీర్ సింగ్ బాదల్ 1962 జూలై 9న ప్రకాశ్‌సింగ్ బాదల్, సురీందర్ కౌర్ బాదల్ దంపతులకు పంజాబ్ రాష్ట్రం, ఫరీద్‌కోట్లో జన్మించాడు. ఆయన చండీగఢ్ యూనివర్సిటీలో డిగ్రీ, అమెరికా లాస్‌ఏంజెలిస్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుసుఖ్బీర్ సింగ్ బాదల్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ పార్టీ నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో రెండోసారి ఎంపీగా ఎన్నికై ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి, అనంతరం రాజ్యసభ సభ్యుడిగా 2001 నుంచి 2004 వరకు పనిచేశాడు. ఆయన 2004లో మూడోసారి ఎంపీగా ఎన్నికై, 2008 జనవరిలో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధ్యక్షుడయ్యాడు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 2009లో పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో జలాలాబాద్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 నుండి 2017 వరకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[2]
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ 2019లో పంజాబ్ ఫిరోజ్‌పూర్ నుంచి పోటీ చేసి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికలయ్యాడు. ఆయన 2022లో జరిగిన ఎన్నికల్లో జలాలాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగ్‌దీప్ కాంబోజ్ చేతిలో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ "Sukhbir Badal becomes youngest president of Shiromani Akali Dal". Punjab Newsline. 31 January 2008. Archived from the original on 28 November 2010. Retrieved 10 December 2010.
- ↑ Sakshi (23 January 2022). "వ్యూహకర్త బాదల్". Archived from the original on 28 March 2023. Retrieved 28 March 2023.