హల్దీఘాటీ

రాజస్థాన్‌లో ఆరావళి పర్వతాల్లోని కనుమ దారి

హల్దీఘాటి అనేది ఖమ్నోర్, బలిచా గ్రామాల మధ్య ఉన్న ఒక పర్వత కనుమ. ఇది రాజస్థాన్‌లోని ఆరావళి శ్రేణిలో, రాజ్‌సమంద్, ఉదయపూర్ జిల్లాలను కలుపుతూ ఉంది. ఈ కనుమ దారి ఉదయపూర్ నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. 'హల్దీఘాటి' అనే పేరు ఈ ప్రాంతంలోని పసుపు రంగు మట్టి నుండి వచ్చిందని భావిస్తున్నారు. (హిందీలో హల్దీ అంటే పసుపు). [1]

హల్దీఘాటీ
కనుమ వద్ద పసుపు రంగులో ఉన్న మట్టి
ప్రదేశంరాజ్‌సమంద్ జిల్లా, రాజస్థాన్
శ్రేణిఆరావళి

చరిత్ర మార్చు

ఈ పర్వత కనుమ ఒక ముఖ్యమైన చారిత్రక ప్రదేశం. ఖమ్నోర్‌ లోని రక్త్ తలై హల్దీఘాటీ యుద్ధం జరిగిన ప్రదేశం. ఈ యుద్ధం 1576 జూన్ 18 న మేవార్ రాజ్యానికి, మొఘల్ సైన్యానికీ మధ్య జరిగింది. అంబర్‌కు చెందిన మాన్ సింగ్ I నేతృత్వం లోని మొగలు సైన్యాలతో జరిగిన యుద్ధానికి మహారాణా ప్రతాప్, మేవార్ సైన్యానికి నాయకత్వం వహించాడు.

స్మారకం మార్చు

 
హల్దీఘాటి వద్ద చేతక్ సమాధి

హల్దీఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్, కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో చేతక్ ఘోరంగా గాయపడి 1576 జూన్ 18 న మరణించింది. చేతక్ పడిపోయిన ప్రదేశంలో మహారాణా ప్రతాప్ దాని కోసం ఒక చిన్న స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ఆ సమాధి ఇప్పటికీ హల్దీఘాటిలో ఉంది.

భారత ప్రభుత్వం 1997 సంవత్సరంలో మహారాణా ప్రతాప్ నేషనల్ మెమోరియల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 2009 జూన్‌లో స్మారకాన్ని ప్రారంభించారు. [2] స్మారక కట్టడంలో చేతక్‌పై ఎక్కి కూచున్న మహారాణా కాంస్య విగ్రహం ఉంది.

పర్యాటకం మార్చు

హల్దీఘాటి గులాబీ ఉత్పత్తికి, మోలెలా మట్టి కళకు ప్రసిద్ధి చెందింది. ప్రైవేట్ కుటీర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం పర్యాటక శాఖ కృషిచేస్తోంది. 

మూలాలు మార్చు

  1. ""Haldighati"".
  2. www.haldighati.com, retrieved 19 January 2010