హల్దీఘాటీ యుద్ధం

హల్దీఘాటీ యుద్ధం 1576 జూన్ 18 న [a] మహారాణా ప్రతాప్ నేతృత్వంలోని మేవార్ దళాలు, అంబర్ కు చెందిన మాన్ సింగ్ I నేతృత్వంలోని మొఘల్ దళాల మధ్య జరిగిన యుద్ధం. మొఘలులు మేవార్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించి, యుద్ధంలో విజయం సాధించారు. రాణా ప్రతాప్‌, తోటి సైనికాధికారుల వత్తిడిపై యుద్ధరంగం విడిచి వెళ్ళిపోయాడు. దాంతో మొగలు సైన్యం అతన్ని పట్టుకోలేకపోయింది.

హల్దీఘాటీ యుద్ధం
మొగలు-రాజపుత్ర యుద్ధాలులో భాగము

చిత్రకారుడు ఛొక్క వేసిన యుద్ధ చిత్రం, 1822
తేదీ1576 జూన్ 18
ప్రదేశంఖమ్నోర్ (హల్దీఘాటీ), రాజ్‌సముంద్ జిల్లా, రాజస్థాన్
24°53′32″N 73°41′52″E / 24.8921711°N 73.6978065°E / 24.8921711; 73.6978065
ఫలితంమొగలుల విజయం [1][2]
ప్రత్యర్థులు
Mewar Kingdom మొగలు సామ్రాజ్యం
సేనాపతులు, నాయకులు
  • మహారాణా ప్రతాప్మూస:WIA
  • భీం సింగ్ దోడియా 
  • రామ్‌దాస్ రథోడ్ 
  • రాం షా తోమర్ 
  • శాలివాహన్ సింగ్ తోమర్ 
  • హకీం ఖాన్ సుర్ 
  • భిమా షా
  • తారాచంద్
  • బీడా ఝాలా 
  • రాణా పూంజా
  • రావత్ సంగా
  • నేతా సింగ్ 
  • మాన్ సొంగారా 
  • శంకర్‌దాస్ 
  • రామా సాందూ
 [3]
బలం
3,000 కాల్బలం
400 భిల్లు విలుకాండ్రు
సంఖ్య తెలీని ఏనుగులు
10,000 మంది సైనికులు
సంఖ్య తెలీని ఏనుగులు[8]
ప్రాణ నష్టం, నష్టాలు
500 మంది మరణించారు (అబుల్ ఫజల్ ప్రకారం)
1,600 జననష్టం (మేవారీ వర్గాల ప్రకారం)
150 మరణాలు (అబుల్ ఫజల్ ప్రకారం)
ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూచిన బదయూనీ, ఇరుపక్షాల్లోను 500 మంది మరణించారని, వారిలో 120 మంది ముస్లిములనీ చెప్పాడు.
హల్దీఘాటీ యుద్ధం is located in Rajasthan
హల్దీఘాటీ యుద్ధం
Location within Rajasthan

1568లో చిత్తోర్‌గఢ్ ముట్టడితో మేవార్ రాజ్యం లోని సారవంతమైన తూర్పు ప్రాంతం మొఘల్‌ల హస్తగతమైంది. అయితే, చెట్లతో కొండలతో కూడిన మిగతా రాజ్యం సిసోడియాల నియంత్రణ లోనే ఉండిపోయింది. మేవార్ గుండా గుజరాత్‌ వెళ్ళేందుకు ఒక సుస్థిరమైన మార్గం కావాలని అక్బరు భావించాడు. 1572లో ప్రతాప్ సింగ్ రాజుగా (రాణా) పట్టాభిషిక్తుడైనప్పుడు అక్బరు, ఈ ప్రాంతం లోని అనేక ఇతర రాజపుత్ర నాయకుల మాదిరిగానే రాణాను సామంతుడిగా మారమని కోరుతూ అనేక మంది రాయబారులను పంపాడు. అయితే, ప్రతాప్ అలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైంది.

యుద్ధం జరిగిన ప్రదేశం రాజస్థాన్‌లోని గోగుండా సమీపంలోని హల్దీఘాటి వద్ద నున్న ఇరుకైన కనుమ మార్గం. ఇరు సైన్యాల సంఖ్యపై విభిన్న అభిప్రాయాలున్నప్పటికీ, మొఘలు సైన్యం మేవార్ సైన్యం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిర్ధారించారు. తొలుత మేవారీలది పైచేయిగా ఉన్నప్పటికీ, పరిస్థితి నెమ్మదిగా వారికి వ్యతిరేకంగా మారింది. రాణా ప్రతాప్ గాయపడ్డాడు. మొఘలులు యుద్ధంలో గెలిచినందున, ఝాలా మాన్ సింగ్ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు రక్షక వలయంగా ఉంటూ రాణా తప్పించుకునేందుకు సహకరించారు.

హల్దీఘాటి వద్ద తిరోగమనం జరిగినప్పటికీ, గెరిల్లా యుద్ధాల ద్వారా మొఘల్‌లకు వ్యతిరేకంగా ప్రతాప్ తన ప్రతిఘటనను కొనసాగించాడు. అతని మరణం నాటికి అతని పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించాడు.

నేపథ్యం

మార్చు

సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత అక్బరు, రాజస్థాన్‌లో ప్రముఖ రాజ్యమైన మేవార్ తప్ప మిగతా రాజ్‌పుత్ర రాజ్యాలతో చాలావరకు సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు.[9] సిసోడియా వంశానికి అధిపతి అయిన మేవార్ రాణా మొఘల్‌కు లొంగిపోవడానికి నిరాకరించాడు. దీంతో 1568లో ఉదయ్ సింగ్ II నేతృత్వంలో చిత్తోర్‌గఢ్ ముట్టడి జరిగింది. రాజ్యపు తూర్పు భాగం లోని సారవంతమైన భూభాగంలో గణనీయమైన ప్రాంతాన్ని మొఘలులకు కోల్పోవడంతో ఆ యుద్ధం ముగిసింది. రాణా ప్రతాప్ తన తండ్రి తర్వాత మేవార్ సింహాసనాన్ని అధిష్టించినప్పుడు అక్బరు, అతని వద్దకు వరసగా రాయబారులను పంపాడు. రాజపుత్ర రాజును తన సామంతుడిగా అవమని వత్తడి చేసాడు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలనే కోరికతో పాటు, మేవార్‌లోని కలప, కొండ ప్రాంతాల గుండా గుజరాత్‌ వెళ్ళేందుకు ఒక సురక్షితమైన మార్గాన్ని ఏర్పరచుకోవాలంటే ఈ ప్రాంతాన్ని తన నియంత్రణలో ఉంచుకోవాలని అక్బరు అనుకున్నాడు.[10] [11]

మొదటి దూత జలాల్ ఖాన్ ఖుర్చీ. ఇతడు అక్బరు అభిమానించే సేవకుడు. అతని రాయబారం విఫలమైంది. తర్వాత అక్బరు, మొఘలుల పాలనలో ప్రభ వెలిగిపోతున్న అంబర్ (తరువాత అదే జైపూర్ అయింది) కు చెందిన మాన్ సింగ్‌ను పంపాడు. అతడు కచ్వా వంశానికి చెందిన రాజపుత్రుడు. అతను కూడా ప్రతాప్‌ని ఒప్పించడంలో విఫలమయ్యాడు. మూడవసారి అక్బరు, రాజా భగవంత్ దాస్ ను పంపాడు. అతను కూడా ఒప్పందం కుదర్చడంలో విఫలమయ్యాడు. అక్బరు సమర్పించిన వస్త్రాన్ని తన కుమారుడు అమర సింగుకు ధరింపజేసి అతన్ని అక్బరు దర్బారుకు పంపేందుకు మాత్రం అంగీకరింపజేసాడు అని అబూ ఫజల్ రాసాడు. అయితే, ఈ వృత్తాంతం సరికాదు. ఎందుకంటే ఇది సమకాలీన పర్షియన్ చరిత్రలు వేటిలోనూ ధృవీకరణ కాలేదు. అబ్ద్ అల్-ఖాదిర్ బదయూని, నిజాముద్దీన్ అహ్మద్ ల రచనలలో దీన్ని పేర్కొనలేదు. ఇంకా, తుజ్క్-ఎ-జహంగిరిలో జహంగీర్, మేవార్ రాజు పెద్ద కుమారుడు సా.శ.1615 లో కుదిరిన ఒప్పందానికి ముందు ఎప్పుడూ మొఘల్ ఆస్థానాన్ని సందర్శించలేదని పేర్కొన్నాడు. [12] చివరిగా, తోడర్ మల్ రాయబారిగా వెళ్ళాడు. అతను కూడా ఏ ఫలితమూ లేకుండా వెనక్కి వెళ్ళాడు. దౌత్యం విఫలమవడంతో యుద్ధం అనివార్యమైంది. [10] [11]

నాంది

మార్చు

కుంభాల్‌గఢ్‌ లోని రాతి కోటలో భద్రంగా ఉన్న రాణా ప్రతాప్, ఉదయపూర్ సమీపంలోని గోగుండా పట్టణంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కచ్వా వంశీకుడైన మాన్ సింగ్‌ను అతని వంశపారంపర్య విరోధులైన మేవార్ సిసోడియాలతో యుద్ధం చేయడానికి అక్బరు నియమించాడు. మాన్ సింగ్ మండల్‌ఘర్‌లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ తన సైన్యాన్ని సమీకరించుకుని గోగుండాకు బయలుదేరాడు. గోగుండాకు దాదాపు 14 మైళ్ళు ఉత్తరాన ఖమ్నోర్ గ్రామం ఉంది. ఈ రెండింటి మధ్య ఆరావళి పర్వత శ్రేణుల లోని "హల్దీఘాటి" అనే ఒక కనుమ ఉంది. ఆ పర్వతాల శిలలను నలిపితే, పసుపు పొడి (హల్ది) ను పోలి ఉండే ప్రకాశవంతమైన పసుపు రంగు ఇసుక వస్తుంది. మాన్ సింగ్ కదలికల గురించి తెలుసుకున్న రాణా, హల్దీఘాటి కనుమ ప్రవేశ ద్వారం వద్ద వారి కోసం వేచి ఉన్నాడు. [b] [14] 1576 జూన్ 18 న సూర్యోదయమైన మూడు గంటల తర్వాత యుద్ధం ప్రారంభమైంది [15]

సైన్యం బలాబలాలు

మార్చు

మేవారీ వర్గాల ప్రకారం రాణా సేనలో 20,000 మంది ఉన్నారు. మాన్ సింగ్ కు చెందిన 80,000 మంది సైన్యంతో వీరు పోటీపడ్డారు. జాదూనాథ్ సర్కార్ ఈ సంఖ్యల నిష్పత్తితో ఏకీభవించినప్పటికీ, ఆ అంకెలతో ఏకీభవించలేదు. రాణా ప్రతాప్ గుర్రం చేతక్, మాన్ సింగ్ యుద్ధ ఏనుగు పైకి దూకడం వంటి అతిశయోక్తుల లాగానే ఈ అంకెలు ఉన్నాయని అతను అన్నాడు.[16] జాదూనాథ్ సర్కార్ మొఘల్ సైన్యపు బలం 10,000 మంది ఉంటుందని అన్నాడు. [17] సతీష్ చంద్ర అంచనా ప్రకారం మాన్ సింగ్ సైన్యంలో 5,000–10,000 మంది సైనికులున్నారు. ఇందులో మొఘలులు, రాజపుత్రులు ఉన్నారు.[14]

యుద్ధాన్ని చూసిన అల్ బదయూని ప్రకారం, రాణా సైన్యంలో 3,000 మంది ఆశ్వికులు, పనర్వా రాజపుత్ర అధిపతి అయిన రాణా పుంజా నేతృత్వంలోని 400 మంది భిల్లు విలుకాళ్ళూ ఉన్నారు. పదాతిదళం గురించి ప్రస్తావించలేదు. మాన్ సింగ్ అంచనా ప్రకారం 10,000 మంది సైనికులున్నారు. [17] వీరిలో 4,000 మంది అతని స్వంత కచ్వా వంశానికి చెందినవారు, 1,000 మంది ఇతర హిందూ రిజర్వ్‌లు, 5,000 మంది మొఘల్ సామ్రాజ్య సైన్యంలోని ముస్లింలు.[17]

రెండు వైపులా యుద్ధ ఏనుగులు ఉన్నాయి, కానీ రాజ్‌పుత్రుల వద్ద తుపాకీలేమీ లేవు. మొఘలులు చక్రాల ఫిరంగి లేదా భారీ ఆయుధాలను రంగంలోకి దించలేదు గానీ, చాలా మస్కెట్లను ఉపయోగించారు.[17]

చిత్రకారుడు ఛొక్క వేసిన యుద్ధ చిత్రం, సుమారు 1810 –  1820.[18]

యుద్ధం

మార్చు

రాణా చేసిన దాడితో మొఘల్ సైన్యపు పార్శ్వాలు కూలిపోయాయి. మొఘల్ సైన్యం యుద్ధం ఎక్కడ నుండి మొదలుపెట్టారో అక్కడికే వెనక్కి వెళ్ళవలసి వచ్చిందని, అయితే వారు వెంటనే రాతి-తలై (తరువాత దాన్నే రక్త్ తలై అని పిలుస్తారు) అనే ప్రదేశానికి సమీపంలో చేరారనీ అబుల్ ఫజల్ చెప్పాడు.[19] ఈ ప్రదేశం ఖమ్నోర్‌కు దగ్గరగా ఉందని అబుల్ ఫజల్ చెప్పగా, బదయూని మాత్రం అంతిమ యుద్ధం గోగుండలో జరిగిందని చెప్పాడు.[20] మేవార్ సైన్యం మొఘల్‌లను అనుసరించి వారి ఎడమ, కుడి పార్శ్వాలపై దాడి చేసింది. మొఘలుల ముందు భాగం కూలిపోయింది. మాన్ సింగ్ స్వయంగా యుద్ధంలోకి దిగాడు. అతన్ని మిహ్తార్ ఖాన్ అనుసరిస్తూ మొగలు చక్రవర్తి అదనపు సైన్యాన్ని పంపాడంటూ పుకారు పుట్టించాడు. ఇది మొఘల్ సైన్యంలో ధైర్యాన్ని పెంచింది. యుద్ధాన్ని వారికి అనుకూలంగా మార్చింది. అదే సమయంలో రాణా సైన్యం లోని అలసిపోయిన సైనికులను నిరుత్సాహపరిచింది.[21] అదనపు బలగాల రాక గురించి తెలుసుకున్న తర్వాత మేవారీ సైనికులు పెద్ద సంఖ్యలో యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళడం మొదలుపెట్టారు. మేవార్ సైనికాధికారులు, అప్పటికే గాయపడిన రాణాను యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళేందుకు అంగీకరింపజేసారు.[21] మాన్ సింగ్ అనే పేరున్న ఝాలా అధిపతి రాణా స్థానాన్ని తీసుకుని, అతని రాజ చిహ్నాలను ధరించాడు. దీనితో మొఘలులు అతనే రాణా అని తప్పుగా భావించారు. మాన్ సింగ్ ఝాలాను చివరికి చంపేసారు. అతని ధైర్యసాహసాల కారణంగా రాణా సురక్షితంగా వెళ్ళిపోయేందుకు తగినంత సమయం దొరికింది.

ప్రాణనష్టం

మార్చు

యుద్ధంలో మరణించిన వారి గురించి వేర్వేరు కథనాలు ఉన్నాయి.

  • అబుల్ ఫజల్, నిజాముద్దీన్ అహ్మద్ ల ప్రకారం, 150 మంది మొఘలులు మరణించారు, మరో 350 మంది గాయపడ్డారు. మేవార్ సైన్యం 500 మందిని కోల్పోయింది.[22]
  • యుద్ధంలో 500 మంది మరణించారని, అందులో 120 మంది ముస్లింలు ఉన్నారని బదయూని చెప్పాడు.[23]
  • తరువాతి కాలపు రాజస్థానీ చరిత్రకారులు యుద్ధం స్థాయిని నొక్కిచెప్పడానికి మరణాల సంఖ్యను 20,000 కి పెంచి చెప్పారు.

రెండు పక్షాల్లోనూ రాజపుత్ర సైనికులు ఉన్నారు. యుద్ధంలో ఒక దశలో, స్వపక్ష, విపక్ష రాజపుత్రుల మధ్య తేడాను ఎలా గుర్తించాలని బదయూని అసఫ్ ఖాన్‌ను అడిగాడు. అసఫ్ ఖాన్ బదులిస్తూ, "మీకు నచ్చిన రాజపుత్రులపై కాల్చండి. ఏ పక్షాన ఉన్నవారు చచ్చినా, అది ఇస్లాంకు లాభమే." అని అన్నాడు.[24] [25] మధ్యయుగ భారతదేశంలో తమ ముస్లిం ప్రభువుల కోసం హిందూ సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారని అంచనా వేయడానికి కె.ఎస్.లాల్ దీన్ని ఉదహరించాడు.[26]

అనంతర పరిణామాలు

మార్చు

రాణా ప్రతాప్ విజయవంతంగా తప్పించుకోగలగడంతో, యుద్ధం ఇరుపక్షాల మధ్య ఉన్న ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమైంది. తదనంతరం అక్బరు, రాణాకు వ్యతిరేకంగా ఒక నిరంతర ప్రచారానికి నాయకత్వం వహించాడు. త్వరలోనే, గోగండా, ఉదయపూర్, కుంభాల్‌గఢ్ అన్నీ అతని ఆధీనంలోకి వచ్చాయి. రాణా మిత్రుల పైన, ఇతర రాజ్‌పుత్ర ముఖ్యులపైనా మొఘల్‌లు ఒత్తిడి తెచ్చి, నెమ్మదిగా తమవైపు తిప్పుకుని భౌగోళికంగా, రాజకీయంగా అతన్ని ఒంటరి చేసారు. మొఘలుల దృష్టి సా.శ. 1585 తర్వాత, సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్లడంతో, ప్రతాప్ తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కల్పించింది. ఇది సమకాలీన శిలాశాసనాల ద్వారా ధృవీకరించబడింది. ఇలా రాణా ప్రతాప్ తిరిగి స్వాధీనం చేసుకున్న వాటిలో చిత్తోర్, మండల్‌ఘర్ లతో పాటు మేవార్ లోని మొత్తం 36 అవుట్‌పోస్టులు ఉన్నాయి.[27] [28]

గమనికలు

మార్చు
  1. Badauni, the eye witness of the battle, stated it was fought on 21 June 1576 near Gogunda
  2. Sarkar and a few other sources prefer to call the spur Haldighat rather than Haldighati.[13]

మూలాలు

మార్చు
  1. de la Garza 2016, p. 56.
  2. Raghavan 2018, p. 67.
  3. Ram Vallabh Somani 1976, p. 230:"Seveal chiefs of Mewar lost their lives. Prominent among them were Netasingh, Dodiys Bhim, Sonagara Man, Rathor Ramdas, Sankardas, Tomar Ram Shah and his 3 sons, Hakim Khan Sur Rama Sandu etc"
  4. Ram Vallabh Somani 1976, p. 229: "Madhosingh Kachhawa inflicted a wound on the Rana, who counter attacked and killed Bahlol Khan, a senior Mughal officer"
  5. Ram Vallabh Somani 1976, p. 227:"The shelter of the Mughal centre, Kachhawa Jagnnath fought desperately and was about to fall but was rescued by the timely help of the Reserves sent under Kachhawa Madhosingh"
  6. Sharma, G.N. (1962). Mewar and the Mughal Emperors: 1526-1707 A. D. Shiva Lal Agarwala. p. 98. Retrieved 2022-06-20. Qazi Khan, although he was but a Mulla, stood his gournd manfully, until receiving a similar blow on his right hand which wounded his thumb, being no longer able to hold his own, he receited (the saying) - Flight from overwhelming odds is one of the traditions of the Prophet and followed his men (in the retreat).
  7. :"The Shekh Zadas of Sikari fled away: An arrow struck Shah Mansur, who soon left the field"
  8. "Akbarnama by Abu'l Fazl". Archived from the original on 13 September 2017. Retrieved 24 May 2018.
  9. Ram Vallabh Somani 1976, pp. 206–207.
  10. 10.0 10.1 Sarkar 1960, p. 75.
  11. 11.0 11.1 Chandra 2005, pp. 119–120.
  12. Ram Vallabh Somani 1976: "After settling the affairs of Rewaliya, a slave of Sher Khan and reducing Narayandas to extremities, Bhaga- wantdas paid a visit to Gogundah.
  13. Sarkar 1960, pp. 75–77.
  14. 14.0 14.1 Chandra 2005, p. 120.
  15. Sarkar 1960, p. 80.
  16. Sarkar 1960, p. 77–78.
  17. 17.0 17.1 17.2 17.3 Sarkar 1960, p. 77.
  18. Royal Asiatic Society.
  19. Hooja, Rima (2006). A History of Rajasthan. Rupa & Company. pp. 469–470. ISBN 9788129115010.
  20. Hooja, Rima (2006). A History of Rajasthan. Rupa & Company. pp. 469–470. ISBN 9788129115010.
  21. 21.0 21.1 Ram Vallabh Somani 1976, pp. 227–228.
  22. Hooja, Rima (2018). Maharana Pratap: The Invincible Warrior. Juggernaut. p. 117. ISBN 9789386228963. Retrieved 2020-10-10.
  23. Hooja, Rima (2018). Maharana Pratap: The Invincible Warrior. Juggernaut. p. 117. ISBN 9789386228963. Retrieved 2020-10-10.
  24. Smith, Akbar the Great Mogul, pp.108–109.
  25. Lal, Studies in Medieval Indian History, pp.171–172.
  26. Lal, Kishori Saran (2012). Indian Muslims:Who Are They. New Delhi. ISBN 978-8185990101.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  27. Sarkar 1960, p. 83.
  28. Ram Vallabh Somani 1976: "During these years Akbar was engrossed in other affairs of his empire and found a new field for his ambition in the South, Pratap soon managed to recapture all the 86 important outposts of Mewar excluding Mandalgarh and hittor, Several copper plates, color phones of MSS and inscriptions coroborate this fact, A perusal of the copper plate!” of V.E, I644 (587 A.D.) of Rikhabdeva, the colo- phone of M.S, Gora Badal Qhopai! copied at Sadari (Godawar) in ‘V.E, I645 (688 A.D.), the copper plate of Pander’ (Jahazpur) dated V.E. 647 (590 A.D.) etc. all pertaining to his reign, prove that a considerable territory was regained by him, which he managed to enjoy throughout the latter part of his life"
ఉల్లేఖన లోపం: <references> లో "FOOTNOTERam Vallabh Somani1976228" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.