హసన్‌పర్తి, తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హసన్‌పర్తి మండలం లోని గ్రామం.[1]

హసన్‌పర్తి
—  రెవెన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 425: No value was provided for longitude.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండలం హసన్‌పర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

హసన్‌పర్తి, వరంగల్ కు సుమారు 15కి.మీ దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లా లోకి చేర్చారు.[2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3] ఇది హనుమకొండ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి బస్ స్టాప్ నుండి ఎల్లాపూర్ రైల్వే స్టేషను 2 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు మార్చు

ఇక్కడ ప్రముఖ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు, నాలుగు ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. అందులో ఉత్తమ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్) [4] ఇంజనీరింగ్ కళాశాల ఒకటి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన మూడు కార్పొరేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి.[5] ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన స్పార్క్రిల్ అంతర్జాతీయ పాఠశాల ప్రధాన కార్యాలయం ఉంది.ఈ గ్రామములో 60 సంవత్సరంల క్రిందట స్థాపించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలఉంది. ఇంకా సుజాత, పోతన, మహాత్మాగాంధీ, St.మేరీస్ హైటెక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ బాలికల రెసిడెన్సియల్ కళాశాల ఉంది.

శిక్షణా సంస్థలు మార్చు

ఈ గ్రామములో సంస్కృతి విహార్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్, జిల్లా శిక్షణా సంస్టలు ఉన్నాయి.

విశేషాలు మార్చు

  • హసన్‌పర్తి గ్రామములో ఆర్య సమాజ్ చాలా ప్రసిద్ధి చెందింది. గత 40 సంవత్సరాలుగా గ్రామంలో యోగ, యజ్ఞాలు, దేశభక్తి, వంటి అనేక విలువైన విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
  • ప్రతి సంవత్సరం, హోలీ పండుగ రోజు హసన్‌పర్తి ఎర్రగట్టు జాతరకు అనేక గ్రామాల నుండి ప్రజలు హాజరవుతారు.
  • శకుంతల సినిమా థియటర్ ఉంది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-25.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "Kits Warangal". www.kitsw.ac.in. Retrieved 2021-10-08.
  5. "Sparkrill International School, Hasanparthy, Warangal: Admission, Fee, Facilities, Affiliation". school.careers360.com (in ఇంగ్లీష్). Retrieved 2021-10-08.

వెలుపలి లింకులు మార్చు