మౌలానా హస్రత్ మోహాని
మౌలానా హస్రత్ మోహాని (ఉర్దూ: مولانا حسرت موہانی) (జననం 1875 - మరణం 1951) ఒక శృంగారరసభరితమైన కవి. ఇతను ఉర్దూ భాషాకవి, జర్నలిస్టు, రాజకీయవేత్త, పార్లమెంటేరియన్, నిర్భయ స్వాతంత్ర్యసమరయోధుడు. ఇతని అసలు పేరు సయ్యద్ ఫజలుల్ హసన్. ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ జిల్లాలోని 'మోహాన్' పట్టణంలో 1875లో జన్మించాడు.
ఉర్దూ కవి సయ్యద్ ఫజల్ హసన్ హస్రత్ మోహాని | |
---|---|
![]() మౌలానా హస్రత్ మోహాని | |
పుట్టిన తేదీ, స్థలం | మోహన్ నగరము, ఉన్నవ్ జిల్లా, సంయుక్త ప్రాంతము, బ్రిటీష్ ఇండియా | 1 జనవరి 1875
మరణం | 13 మే 1951 లక్నో, ఉత్తరప్రదేశ్, భారత్ | (వయస్సు 76)
కలం పేరు | మౌలానా హస్రత్ మోహాని |
వృత్తి | ఉర్దూ కవి |
జాతీయత | భారతీయుడు |
కాలం | 20వ శతాబ్దం |
రచనా రంగం | గజల్ |
విషయం | ప్రేమ, తత్వము, |
సాహిత్య ఉద్యమం | భారత స్వాతంత్ర్య పోరాటం |
ఇతడు ఒక చురుకైన విద్యార్థి, అన్ని పరీక్షలలో రాష్ట్రస్థాయిలో ఉన్నతుడు. తరువాత అలీఘర్ లో చదివాడు. ఇతడు మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ జౌహర్ ల మిత్రుడు. ఇతని రచనలు 'కులియాత్-ఎ-హస్రత్ మోహాని', 'షర్హ్-ఎ-కలామ్-ఎ-గాలిబ్', 'నుకాత్-ఎ-సుఖన్', 'ముషాహిదాత్-ఎ-జిందాన్' మొదలగునవి. గజల్ గాయకుడు గులాం అలి పాడిన 'చుప్ కే చుప్ కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై' ఇతని రచనే.
ఇతడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిర్భయంగా పోరాడిన వీరుడు. ఆజాదియె-కామిల్ (సంపూర్ణ స్వరాజ్యం) కావాలంటూ 1921 లో డిమాండ్ చేసిన మొదటివ్యక్తి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ను అధ్యక్షత వహించాడు. కమ్యూనిజంపట్ల అభిమానమున్నవాడునూ. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. ఇతని స్ఫురద్రూపాన్ని చూచి ఇతన్ని భారతరాజ్యాంగనిర్మాణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈకమిటీ సిఫారసులను చూసి నొచ్చుకొని నచ్చక సంతకం చేయలేదు. ఇతని సమకాలీన ఉర్దూ కవులు జోష్ మలీహాబాది, నాసిర్ కాజ్మి, జిగర్ మొరాదాబాది, అస్గర్ గోండవి.
ఇతను మే 13, 1951, లక్నోలో మరణించాడు.
మౌలానా నుస్రత్ మోహానీచే, మౌలానా హస్రత్ మోహానీ మెమోరియల్ 1951లో స్థాపింపబడింది. పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో ఇతని గౌరవార్థం ఒక మెమోరియల్ హాల్ కు, గ్రంథాలయాన్ని, కోరంగిటౌన్ లోని ఒక కాలనీకి, ఇతని పేరు పెట్టారు.
ఇవీ చూడండిసవరించు
బయటి లింకులుసవరించు
- Urdu Poetry of Hasrat Mohani
- Hasrat Mohani - Selected ghazals in Urdu Nastalique- Selected poems of Hasrat Mohani in Urdu Nastalique [1][permanent dead link]
- [2]