హార్ట్ అటాక్

2014 సినిమా

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన స్వీయ నిర్మాణ సంస్థ పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నితిన్, అదా శర్మ ముఖ్యపాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం హార్ట్ అటాక్. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 31, 2014న విడుదలైంది.

హార్ట్ అటాక్
(2014 తెలుగు సినిమా)
Heart Attack poster.jpg
దర్శకత్వం పూరీ జగన్నాథ్
నిర్మాణం పూరీ జగన్నాథ్
కథ పూరీ జగన్నాథ్
చిత్రానువాదం పూరీ జగన్నాథ్
తారాగణం నితిన్
అదా శర్మ
కేశ కంభంపాటి
బ్రహ్మానందం
ఆలీ
సంగీతం అనూప్ రూబెన్స్
గీతరచన భాస్కరభట్ల రవికుమార్
సంభాషణలు పూరీ జగన్నాథ్
ఛాయాగ్రహణం అమోల్ రాథోడ్
కూర్పు ఎస్. ఆర్. శేఖర్
నిర్మాణ సంస్థ పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
భాష తెలుగు

కథసవరించు

వరుణ్‌ (నితిన్‌) ఒక హిప్పీ. దేశాలు పట్టి తిరుగుతూ, రేపటి మీద ఆశ లేకుండా ఏ రోజుని ఆ రోజు గడిపేసే రకం. చూడగానే హయాతిని (అదా శర్మ) ఇష్టపడతాడు. ఆమెని ఓ ముద్దిమ్మంటూ వెంటపడతాడు. తనని ప్రేమించడం లేదని, ముద్దిస్తే చాలని వేధిస్తుంటాడు. ఈ వరసలో వరుణ్‌ని హయాతి ప్రేమిస్తుంది. కానీ ఆమెని తాను ప్రేమించిన విషయాన్ని తెలుసుకుని వరుణ్‌ వచ్చేలోగా ఆమెకి వేరే వాడితో పెళ్ళి నిశ్చయం అవుతుంది. తర్వాత ఏమి జరిగిందనేది కథ.

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

సినిమాని దర్శకుడు పూరీ జగన్నాధ్ తన స్వంత పతాకంపై తానే నిర్మాతగా తీశారు. సినిమా కథాంశం కొంత విచిత్రంగా ఉండడంతో, ఇలాంటిది వేరే నిర్మాతలకు చెప్పి ఒప్పించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. కమర్షియల్ సినిమా శైలికి కాస్త భిన్నంగా ఉండే ఈ కథనాన్ని వేరే నిర్మాతతో తీయించి రిస్క్ చేయడం కన్నా తనకు నచ్చింది కనుక తానే నిర్మాతగా తీయడం కరెక్ట్ అని ఈ సినిమా తీశారు.[1]

మూలాలుసవరించు

  1. ఇంటర్వ్యూయర్. "పవన్ తో విభేదాల వెనుక అసలు కథ:పూరీ జగన్నాథ్". ఫిల్మ్ బీట్ తెలుగు. Retrieved 13 August 2015.