పూరీ జగన్నాథ్

ప్రముఖ సినీ దర్శకుడు

పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన నేనింతే దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు.
అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు. తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలసి బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పు వంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు.

పూరి జగన్నాథ్
జననం (1966-09-28) 1966 సెప్టెంబరు 28 (వయసు 58)
కొత్తపల్లె
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు
జీవిత భాగస్వామిలావణ్య
పిల్లలుఆకాశ్ పూరి, పవిత్ర పూరి
బంధువులుపెట్ల ఉమాశంకర్ గణేష్, సాయిరాం శంకర్ (తమ్ముళ్లు)

చిత్రాలు

మార్చు

తెలుగు

మార్చు

కన్నడ

మార్చు
  1. అప్పు (2002)

అవార్డులు

మార్చు

నంది పురస్కారాలు

  1. ఉత్తమ మాటల రచయిత - అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, 2003
  2. ఉత్తమ మాటల రచయిత - నేనింతే, 2009

మూలాలు

మార్చు
  1. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  2. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.
  3. మూవీజప్, సినిమా (31 December 2021). "Liger movie First Glimpse". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.

బయటి లింకులు

మార్చు