హార్దిక్ సింగ్ (జననం:1998 సెప్టెంబర్ 23) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. ఇతను భారత జాతీయ జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడుతాడు.[1]

హార్దిక్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1998-09-23) 1998 సెప్టెంబరు 23 (వయసు 25)
ఎత్తు 1.76 m
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్
జాతీయ జట్టు
2010–ప్రస్తుతం భారత జాతీయ పురుషుల మైదాన హాకీ జట్టు 39 (1)

వ్యక్తిగత జీవితం మార్చు

వృత్తిరీత్యా పోలీసు అధికారి అయిన హార్దిక్ సింగ్ తండ్రి ఒకప్పుడు భారత జాతీయ హాకీ జట్టులో క్రీడాకారుడు. అతని తాత ప్రీతమ్ సింగ్ భారత నౌకా దళంలో హాకీ కోచ్ గా వ్యవహరించాడు.[2] హార్దిక్ తన మామ జుగరాజ్ సింగ్(భారత మాజీ హాకీ క్రీడాకారుడు)ని గురువుగా అభివర్ణిస్తాడు. ఇతని అత్తమ్మ రజబీర్ కౌర్ 1980 ఒలింపిక్స్ లో భారత్ జాతీయ జట్టులో మైదాన హాకీ క్రీడాకారిణి, ఈ ఒలింపిక్స్ లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.[3]

కెరీర్ మార్చు

భారత మైదాన హాకీ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్, 2018 ఆసియా పురుషుల హాకీ చాంపియన్‌షిప్ తో మొట్టమొదటి సారి అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టులో ఆడాడు, ఈ పోటీల్లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది.

మూలాలు మార్చు

  1. "HARDIK SINGH". hockeyindia.org. Hockey India. Archived from the original on 27 జూలై 2019. Retrieved 15 July 2019.
  2. Das, Tanmay (1 December 2018). "Hockey World Cup: 'Home' support for Hardik Singh". The New Indian Express. Retrieved 14 July 2019.
  3. "Vice-captain Hardik Singh is fifth in family to win laurels in hockey". The Tribune. 1 October 2016. Retrieved 14 July 2019.

బయటి లంకెలు మార్చు