హిందువుల క్రికెట్ జట్టు
హిందువుల క్రికెట్ జట్టు, వార్షిక బాంబే ట్రయాంగులర్లో పాల్గొన్న భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. బొంబాయిలోని హిందూ సమాజానికి చెందిన వారు ఈ బృందాన్ని స్థాపించారు.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | n/a |
కోచ్ | n/a |
యజమాని | హిందూ జింఖానా, ముంబై |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1902 |
స్వంత మైదానం | హిందూ జింఖానా మైదానం |
హిందువులు 1906లో బాంబే టోర్నమెంట్లో చేరారు, వారు యూరోపియన్స్ క్రికెట్ టీమ్, పార్సీస్ క్రికెట్ టీమ్‌లకు పోటీగా ఈ జట్టు చేరడంతో అప్పటివరకు ప్రెసిడెన్సీ మ్యాచ్‌గా జరుగుతున్న పోటీ బొంబాయి ట్రయాంగులర్గా మారింది. 1945-46 సీజన్ తర్వాత టోర్నమెంటు నిలిపివేసే వరకు హిందువులు టోర్నమెంట్లో పాల్గొంటూనే ఉన్నారు. వారు ఈ టోర్నమెంటును 11 సార్లు గెలుచుకున్నారు.
ప్రముఖ హిందువుల ఆటగాళ్ళలో భారతదేశపు మొదటి గొప్ప స్పిన్ బౌలర్‌గా పరిగణించబడే పాల్వంకర్ బాలూ ఉన్నాడు.
బాహ్య లింకులు
మార్చు- క్రికెట్ ఆర్కైవ్‌లో హిందువుల క్రికెట్ జట్టు Archived 2020-12-02 at the Wayback Machine
మూలాలు
మార్చు- వసంత్ రైజీ, ఇండియాస్ హ్యాంబుల్డన్ మెన్, టైబీ ప్రెస్, 1986
- మిహిర్ బోస్, ఎ హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఆండ్రీ-డ్యూచ్, 1990
- రామచంద్ర గుహ, ఎ కార్నర్ ఆఫ్ ఎ ఫారిన్ ఫీల్డ్ - యాన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఎ బ్రిటీష్ స్పోర్ట్, పికాడార్, 2001