హితకారిణి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు సమాజ సేవ కొరకుస్థాపించిన సంస్థ.[1]

హితకారిణీ శతజయంత్యుత్సవ ప్రత్యేక సంచిక ముఖచిత్రం

సంస్థ విశేషాలు

మార్చు

హితకారిణి సమాజం పేరుతో ఒక ధర్మ సంస్థను 1906లో లో వీరేశలింగం 36మంది సభ్యులతో ప్రారంభించి తన యావదాస్థిని దానికి ఇచ్చేసాడు.[2][3] వితంతు వివాహాల నిర్వహణకు హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు, ఆ సంస్థ కోసం తన స్వార్జితంతో రాజమండ్రిలో 19 ఎకరాల 29 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న రాజమండ్రి సర్వే రికార్డుల ప్రకారం సర్వే నెంబర్‌ 1943లో హితకారిణి సంస్థ పేరిట 19.29 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని సంరక్షించే బాధ్యతను దేవాదాయశాఖ చూసుకుంటోంది.[4] హితకారిణి సమాజం ద్వారా ఎన్నో నాటకాలను ప్రహసనాలను వ్రాసి ప్రదర్శించారు.[5] ఈ సంస్థ బాల వితంతువుల కేంద్రంగా ఉండేది. ఇక్కడ వితంతువులకు పునర్వివాహాలు జరిగేవి. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా విద్యను అందించేవారు.[1]


లక్ష్యాలు

మార్చు

ఈ సంస్థ యొక్క లక్ష్యం క్రింది మార్గాలను, మార్గాల ద్వారా విద్య, దాతృత్వ, ఇతర ఉపయోగకరమైన పనిని కొనసాగించడం.

 • వితంతు గృహాలు, అనాథాశ్రమాలు, ఆశ్రమాలు, బాలుర, బాలికల పాఠశాలలు, పారిశ్రామిక, సాంకేతిక సంస్థలు, ఇతర విద్యా, దాతృత్వ సంస్థలను స్థాపించడానికి లేదా నిర్వహించడానికి తోడ్పడుతుంది.
 • పైన పేర్కొన్న ప్రయోజనాల కోసం నిధులను సేకరించడం, స్వీకరించడం, నిర్వహించడం.
 • ఈ రకమైన పనులకు ఉపయోగకరమైనవో గుర్తించి వాటికి నిధుల మంజూరులో సమాజం యొక్క ఉద్దేశ్యం గురించి సమాజం ఆలోచించడం
 • భూములు, ఎస్టేట్లు లేదా ఇతర తరలించదగిన, తరలించలేని సంపదను కొనుగోలు చేయటానికి.
 • నిర్మాణానికి, సౌకర్యవంతంగా లేదా సౌలభ్యంతో ఉన్న అవసరమైన భవనాలను నిర్మించడం, కొనుగోలు చేయడం వాటిని నిర్వహించడం.
 • సమాజ నిర్వహణలో ఉన్న ఏ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలను విలీనం చేయడం, నిలిపివేయడం లేదా రద్దుచేయడం[6].

అప్పటి కమిటీ సభ్యులు

మార్చు
 1. అధ్యక్షుడు : రావు బహదూర్ కందుకూరి వేరేశలింగం పంతులు, రిటైర్డ్ తెలుగు పండితుడు, ప్రభుత్వ కళాశాల, రాజమండ్రి
 2. ఉపాధ్యక్షుడు : రఘుపతి వెంకట రత్నంనాయుడు, M.A., L.T., ప్రధానాధ్యాపకులు, పిఠాపురం, రాజాస్ కళాశాల, కోకనాడ
 3. సెక్రటరీ : కరుమూర్తి వీరభద్రస్వామి, బి.ఎ., సెక్రటరీ, మ్యునిసిపల్ కౌన్సి, రాజమండ్రి

సభ్యులు:

 1. ధర్వాడ వి.కృష్ణారావు, B.A., B.L, వాకిల్, రాజమండ్రి
 2. నాళం కృష్ణారావు, భూయజమాని, రాజమండ్రి
 3. కనపర్తి శ్రీరాములు, న్యాయవాది, రాజమండ్రి
 4. గంటి లక్ష్మన్న, B.A., B.L., వాకిత్, రాజమండ్రి
 5. చిలకమర్తి లక్ష్మీనరసింహం, భూయజమాని, రాజమండ్రి
 6. దేశిరాజు పెదబాపయ్య, భూయజమాని, రాజమండ్రి
 7. కనుమూరి బాపిరాజు, వర్తకుడు, రాజమండ్రి
 8. ఎం.సుబ్బారాయుడు, బి.ఎ., ప్రైవేట్ సెక్రటరీ, పిఠాపురం రాజాస్థానం, పిఠాపురం.

విద్యాసంస్థలు

మార్చు

రాజమహేంద్రవరంలో హితకారిణీ సంస్థ పేరుతో కందుకూరి వీరేశలింగం పంతులు ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజీ, ఎస్‌కెవిటి ఇంగ్లీషు మీడియం హైస్కూలు, ఎస్‌కెవిటి జూనియర్ కాలేజి, ఎస్‌ఆర్‌కెఆర్ మహిళా కాలేజి, ఎలిమెంటరీ పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలన్నీ 1972-74 మధ్యలో దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లాయి. దీంతో ఈ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం కాస్తా దేవాదాయ శాఖ సిబ్బంది జీతాలకు వెచ్చిస్తున్నారు[7].

ఆంధ్రకవుల చరిత్ర సంస్కరణ

మార్చు

ఆనాటి హితకారిణీ సమాజమునకు అధ్యక్షులు మధురకవి నాళం కృష్ణారావు కార్యదర్శి దంగేటి నారాయణస్వామి, నాళము కృష్ణారావు ఆధ్యక్షతను 1950 అక్టోబరు 30న జరిగిన హితకారిణీ సమాజ కార్యనిర్వాహక వర్గ ప్రత్యేకసభలో ఈ క్రింది తీర్మాన మామోదింపబడినది.
"ఆంధ్ర కవుల చరిత్రము సవరణలో అత్యవసరమని తోచిన సవరణలు, మార్పులు, చేర్పులు, ఈ వగైరా మార్పులు చేర్చుట లేక ఫుట్ నోట్సు లో చేర్చుట, అనే మొదలగు సూచనలన్నియు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికే వదలివేయుటకు తీర్మానింపబడినది. అతి ముఖ్యమని తోచిన చోట్ల మార్పులుచేస్తూ వీరేశలింగంగారి ప్రత్యేకతకు భంగం రానివ్వరని కమిటీవారు విశ్వసించుచున్నారు."

ఆ తీర్మానము ననుసరించి మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు ఆంధ్రకవుల చరిత్రను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించి హితకారిణీ సమాజం వారికి ఆందచేశారు.

మల్లంపల్లి సోమశేఖర శర్మగారిని ఆ బృహత్కార్యం నిర్వర్తించినందులకు - హితకారిణీ సమాజం 500 రూపాయలు పారితోషికమిచ్చి ఘనంగా సన్మానించింది.[8]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 "Hithakarini Samajam yet to get new trust board". The New Indian Express. Retrieved 2019-01-18.
 2. "self study report-Sree Kandukuri VeeresalingamTheistic College" (PDF). 2015-12-31. Archived from the original (PDF) on 2019-07-12. Retrieved 2019-01-18.
 3. "Rajahmundry's abode of reforms". The Hans India (in ఇంగ్లీష్). 2014-12-18. Retrieved 2019-01-18.
 4. "'వీరేశలింగం గారి భూమి..సమర్పయామి'". www.andhrajyothy.com. 2015-07-04. Retrieved 2019-01-18.[permanent dead link]
 5. "Kandukuri Veereasa Lingam Pantalu / కందుకూరి వీరేశలింగం పంతులు". www.telugukiranam.com. Archived from the original on 2019-01-04. Retrieved 2019-01-18.
 6. స్వీయ చరిత్రము - రెండవ భాగము (1915) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు. చింతాద్రిపేట - మద్రాసు: విజ్ఞానచంద్రికా మండలి. 1915.
 7. "సంక్షోభంలో హితకారిణి సమాజం". andhrabhoomi.net. Retrieved 2019-01-18.[permanent dead link]
 8. ఆంధ్రకవుల చరిత్రము - కందుకూరి వీరేశలింగం. రాజమండ్రి: హితకారిణి సమాజం-రాజమహేంద్రవరం. 1978.

బయటి లంకెలు

మార్చు