హిరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్
హిరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్ (నవంబర్ 23, 1907 - జూలై 30, 2004) భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. అతను హీరేన్ ముఖర్జీగా కూడా సుపరిచితుడు. అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 1936 లో సభ్యునిగా చేరాడు. అతను 1951, 1957, 1962, 1967, 1971లో భారత లోక్‌సభకు కలకత్తా నార్త్ వెస్టు నియోజక వర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[1][2][3] అతను 1977లో ఓడిపోయాడు.[4][5] అతను 1991లో భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణను అందుకున్నాడు. 1990లో పద్మభూషణ పురస్కారాన్ని పొందాడు. [6]
హీరేంద్రనాథ్ ముఖర్జీ పార్లమెంటు సభ్యుడు | |
---|---|
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ | |
In office 1952–1977 | |
అంతకు ముందు వారు | కొత్త సీటు |
తరువాత వారు | ప్రతాప్ చంద్ర చుందర్ |
నియోజకవర్గం | కలకత్తా ఈశాన్య (లోక్ సభ నియోజకవర్గం) |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కోల్‌కతా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1907 నవంబరు 23
మరణం | 2004 జూలై 30 | (వయసు 96)
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా |
జీవిత భాగస్వామి | బీభా ఛటర్జీ |
తొలినాళ్ళ జీవితం
మార్చుఈయన 1907, నవంబర్ 23న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా లో జన్మించాడు. ఈయన తల్తాలా హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తిచేసాడు. ఈయన తన బి.ఏ. పట్టాను కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పూర్తిచేసాడు. ఈయన ఎమ్. ఏ చరిత్ర విభాగంలో పూర్తిచేసాడు.
కెరీర్
మార్చుఈయన విద్యావేత్తగా తన వృత్తిని ప్రారంభించాడు, చివరికి చరిత్ర, రాజకీయాలలో సీనియర్ లెక్చరర్‌గా, ఈయన 1934–35 చరిత్ర, రాజకీయ తత్వశాస్త్రంలో లెక్చరర్ గా కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. ఇదే కాలేజ్ లో 1940-44 మధ్య చరిత్ర విభాగాధిపతిగా కొనసాగారు.
మూలాలు
మార్చు- ↑ Fifth Lok Sabha Members Bioprofile:Hirendranath Mukherjee[permanent dead link] Parliament of India.
- ↑ Parliamentarian Hiren Mukherjee passes away/2004073106111200.htm Parliamentarian Hiren Mukherjee passes away:The Hindu[permanent dead link]
- ↑ A passionate revolutionary:Frontline
- ↑ Far Eastern Economic Review. April 1977. pp. xxiv. Retrieved 25 August 2019.
- ↑ Ananth (2008). India Since Independence: Making Sense of Indian Politics. Pearson Education India. pp. 182–. ISBN 978-81-317-4282-2. Retrieved 25 August 2019.
- ↑ "Padma Awards Directory (1954–2007)" (PDF). Ministry of Home Affairs. 30 మే 2007. Archived from the original (PDF) on 10 ఏప్రిల్ 2009. Retrieved 29 డిసెంబరు 2019.