హుస్నాబాద్ మండలం,తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.

గణాంక వివరాలుసవరించు

:2011 భారత జనగణన గణాంకాల మండల జనాభా ప్రకారం- మొత్తం 78,793 - పురుషులు 39,593 - స్త్రీలు 39,200

కరీంనగర్ జిల్లా నుండి సిద్ధిపేట జిల్లాకు మార్పు.సవరించు

లోగడ హుస్నాబాద్ గ్రామం / మండలం కరీంనగర్ జిల్లా,కరీంనగర్ రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా హుస్నాబాద్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సిద్ధిపేట జిల్లా,కొత్తగా ఏర్పడిన హుస్నాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. హుస్నాబాద్
  2. పొట్లపల్లి
  3. మడుద
  4. మొహమ్మదాపూర్
  5. నాగారం
  6. ఉమ్మాపూర్
  7. మీర్జాపూర్
  8. పోతారం (యస్)
  9. తోటపల్లి (యస్)
  10. కూచన్‌పల్లి
  11. పందిళ్ళ

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-04-11.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలుసవరించు