హెచ్. వసంత్ కుమార్

భారత రాజకీయ నాయకుడు & వ్యాపారవేత్త

హరికృష్ణన్ నాడార్ వసంతకుమార్ (14 ఏప్రిల్ 1950 – 28 ఆగస్టు 2020) భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన రిటైల్ గృహోపకరణాల సంస్థ వసంత్ & కో వ్యవస్థాపకుడు & ఛైర్మన్, తమిళ శాటిలైట్ టీవీ ఛానెల్ వసంత్ టీవీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్. వసంతకుమార్ రెండుసార్లు తమిళనాడు శాసనసభ సభ్యుడిగా[1] , 2019లో కన్యాకుమారి నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2]

హెచ్. వసంత్ కుమార్
హెచ్. వసంత్ కుమార్


పదవీ కాలం
18 జూన్ 2019 – 28 ఆగష్టు 2020
ముందు పొన్ రాధాకృష్ణన్
తరువాత విజయ్ వసంత్
నియోజకవర్గం కన్యాకుమారి
పదవీ కాలం
25 మే 2016 – 29 మే 2019
ముందు ఏ. నారాయణన్
తరువాత రెడ్డిగారుపట్టి వీ. నారాయణన్
నియోజకవర్గం నంగునేరి
పదవీ కాలం
17 మే 2006 – 14 మే 2011
ముందు ఎస్. మాణిక్ రాజ్
తరువాత ఏ. నారాయణన్
నియోజకవర్గం నంగునేరి

వ్యక్తిగత వివరాలు

జననం (1950-04-14)1950 ఏప్రిల్ 14
అగస్తీశ్వరం,
(present-day కన్యాకుమారి జిల్లా, తమిళనాడు, భారతదేశం)
మరణం 2020 ఆగస్టు 28(2020-08-28) (వయసు 70)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి తమిళసెల్వి
బంధువులు కుమారి అనంతన్ (సోదరుడు)
తమిళిసై సౌందరరాజన్ (సోదరుడి కుమార్తె)
సంతానం విజయ్ వసంత్
వినోత్ కుమార్
తంగమలార్
వృత్తి

జననం, విద్యాభాస్యం

మార్చు

హెచ్. వసంత్ కుమార్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని అగస్తీశ్వరంలో హరికృష్ణన్ నాడార్, తంగమ్మాళ్ దంపతులకు 1950 ఏప్రిల్ 14న జన్మించాడు. ఆయన మధురై విశ్వవిద్యాలయం నుండి తమిళ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు.

వృత్తి జీవితం

మార్చు

వసంతకుమార్ 1970ల్లో ఆయన సేల్స్‌మెన్‌గా పని చేసి అంచెలంచెలుగా ఎదిగి 1978లో వసంత్ అండ్ కో కంపెనీని స్థాపించి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ డీలర్‌గా మారాడు. తమిళనాడు, పుదుచ్చేరిలో కలిపి వసంత్ అండ్ కో సంస్థకు 90 షోరూమ్‌లు ఉన్నాయి. ఆయన వసంత్ టీవీ పేరుతో టీవీ చానల్ కూడా ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

మార్చు

హెచ్. వసంత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో నంగునేరి అసెంబ్లీ నియోజవకర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైయ్యాడు. ఆయన 2011లో ఓడిపోయి ఆ తర్వాత 2016లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వసంత్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.

హెచ్. వసంతకుమార్ కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 2020 ఆగస్టు 28న మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Congress on strong wicket in Nanguneri". The Hindu. 5 May 2006. Archived from the original on 7 November 2012. Retrieved 3 August 2010.
  2. "The story of Vasanthakumar: a driven, resourceful, self-made entrepreneur". The Federal (in అమెరికన్ ఇంగ్లీష్). 28 August 2020. Archived from the original on 1 September 2020. Retrieved 29 August 2020.
  3. Sakshi (28 August 2020). "కోవిడ్‌-19 : కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూత". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.