హెజీబు అచ్యుతరామయ్య
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
హెజీబు అచ్యుతరామయ్య (1924 - 1996) గ్రంథాలయ కార్యకర్త.
జీవిత విశేషాలు
మార్చుఅతను 1924 జూన్ 4 తేదీన విజయనగరం జిల్లా వసంత గ్రామంలో జన్మించాడు. హిందీ విశారద వరకు చదివి చిన్నతనం నుండే ప్రజా ఉద్యమాల వైపు మొగ్గాడు. అతను 1953లో తన గ్రామంలో పొట్టి శ్రీరాములు గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. యువకుల శ్రమదానంలో దానికి భవనం నిర్మించాడు . ఆ గ్రంథాలయ పురోగతికి విశేష కృషిచేశాడు. తన గ్రామంలోనే కాక విజయనగరం జిల్లాలో పలు గ్రామాలలో గ్రంథాలయాలను స్థాపించేందుకు కృషిచేశాడు అతను కొంతకాలం విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యాలయంలో పనిచేశాడు
అతను 1996 జూన్ 18 తేదీన పరమపదించారు.
మూలాలు
మార్చుఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |