హేయ్ పిల్లగాడ 2017లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో ‘కాళి’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘హేయ్ పిల్లగాడ’ పేరుతో వి.చంద్రశేఖర్ సమర్పణలో లక్ష్మి చెన్నకేశవ ఫిలిమ్స్ బ్యానర్ పై డి.వి కృష్ణ స్వామి నిర్మించాడు. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 26న విడుదల చేసి,[1] సినిమాను 24 నవంబర్ 2017న విడుదల చేశారు.[2]

హేయ్ పిల్లగాడ
దర్శకత్వంసమీర్ తాహిర్
రచనరాజేష్ గోపీనాధన్
నిర్మాతడి.వి కృష్ణ స్వామి
తారాగణందుల్కర్ సల్మాన్, సాయి పల్లవి 
ఛాయాగ్రహణంగిరీష్ గంగాధరన్
కూర్పువివేక్ హర్షన్
సంగీతంగోపి సుందర్
పంపిణీదార్లుసెంట్రల్ పిక్చర్స్
విడుదల తేదీ
2017 నవంబరు 24 (2017-11-24)
సినిమా నిడివి
118 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సిద్దార్థ్ (దుల్కర్ సల్మాన్) అంజలి (సాయి పల్లవి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా సిద్దార్థ్ కోపం వస్తూవుంటుంది, కానీ అంజలి మాత్రం సిద్దు ఎప్పటికైనా మారుతాడని కోపం తగ్గించు కుంటాడని ఎదురు చూస్తుంటుంది. కానీ సిద్దు ప్రవర్తనలో మార్పు రాదు. ఒక రోజు ఇద్దరూ కలిసి వైజాగ్ కు బయలు దేరుతారు. దారి మధ్యలో ఒక డాబా దగ్గర సిద్దార్థ్ తో రౌడీలతో గొడవవుతుంది. ఆ గొడవ వల్ల సిద్దు, అంజలిలు ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

  • దుల్కర్ సల్మాన్ - సిద్ధార్థ్ \ సిద్దు
  • సాయి పల్లవి - అంజలి
  • వినాయకన్
  • చెంబన్ వినోద్ జోస్
  • సౌబిన్ షాహిర్
  • వి.కె. ప్రకాష్
  • సంధ్య రమేష్
  • సిధార్థ శివ
  • సందీప్ నారాయణన్
  • వనిత కృష్ణచంద్రన్
  • దినేష్ పనికెర్
  • కుంచన్ - ఇంటి ఓనర్
  • అలెన్సెర్ లే లోపెజ్
  • అంజలి నాయర్
  • మాస్టర్ ఇహ్మన్
  • హరీష్ పెరుమన్న
  • ఇంతియాజ్ ఖదీర్ - బ్యాంకు మేనేజర్
  • సీని అబ్రహం
  • తాంసీల్
  • నెబిష్ బెన్సన్
  • విజిలేష్ కార్యాడ్
  • విష్ణు పురుషన్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లక్ష్మి చెన్నకేశవ ఫిలిమ్స్
  • నిర్మాత: డి.వి కృష్ణ స్వామి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సమీర్ తాహిర్
  • సంగీతం: గోపి సుందర్
  • సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్

మూలాలు మార్చు

  1. Chauhan, Ramesh (26 August 2017). "సాయి పల్లవి 'హేయ్ పిల్లగాడ' టీజర్ వచ్చేసింది..." Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.
  2. IB Times (10 November 2017). "Dulquer Salmaan, Sai Pallavi's Hey Pillagada release date out" (in ఇంగ్లీష్). Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.
  3. The Times of India (24 November 2017). "Hey Pillagada Review {3/5}: Go watch this film this weekend for all the characters' stupendous performances, you will not regret it!". Archived from the original on 2 September 2021. Retrieved 2 September 2021.