సాయిపల్లవి

నటి
(సాయి పల్లవి నుండి దారిమార్పు చెందింది)

సినీ నటి.[4][6] తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది.[7]

సాయిపల్లవి
జననం (1992-05-09) 1992 మే 9 (వయసు 32)[1][2] [3]
కోటగిరి, తమిళనాడు[4]
విద్యవైద్య విద్య
విద్యాసంస్థటిబిలిసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియా
వృత్తినటి
తల్లిదండ్రులు
 • సెంతామరై కన్నన్ (తండ్రి)
 • రాధామణి (తల్లి)
బంధువులుపూజా క‌న్న‌న్ (కవల సోదరి)[5]

నేపథ్యం

మార్చు

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. బడుగ గిరిజన కుటుంబంలో జన్మించారు తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ కన్నన్‌ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరులో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది.

ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.

సినిమా

మార్చు

వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రంలో నటించింది.[8]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు మూలాలు
2005 కస్తూరి మాన్ కాలేజీ అమ్మాయి తమిళ్ గుర్తింపు లేని పాత్ర [9]
2008 ధామ్ ధూమ్ శెంబా బంధువు[10] తమిళ్ గుర్తింపు లేని పాత్ర
2015 ప్రేమమ్ మలర్ మలయాళం [11]
2016 కాళి అంజలి మలయాళం [12]
2017 ఫిదా భానుమతి తెలుగు [13]
మిడిల్ క్లాస్ అబ్బాయి పల్లవి "చిన్ని" తెలుగు [14]
2018 దియా తులసి తమిళ్ ద్విభాషాచిత్రం [15]
కణం తెలుగు
పడి పడి లేచే మనసు వైశాలి చెరుకూరి తెలుగు [16]
మారి 2 ఆనంది మారియప్పన్ తమిళ్ [17]
2019 అథిరన్ నిత్య మలయాళం తెలుగులో అనుకోని అతిథి [18]
ఎన్.జి.కె గీత కుమారి తమిళ్, తెలుగు [19]
2020 పావ కధైగల్ సుమతి తమిళ్ ఆంథోలోజి ఫిలిం ; సెగ్మెంట్ ఓర్ ఇరవు [20]
2021 లవ్ స్టోరీ మౌనిక రాణి తెలుగు [21]
శ్యామ్‌ సింగరాయ్‌ రోజి (మైత్రేయి) తెలుగు [22][23]
2022 విరాట పర్వం వెన్నెల తెలుగు [24]
గార్గి గార్గి తెలుగు, తమిళం, కన్నడ [25]

అవార్డులు , నామినేషన్లు

మార్చు
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం మూలాలు
2015 ఆసియా విజన్ అవార్డులు నటనలో కొత్త సంచలనం - స్త్రీ ప్రేమమ్ గెలుపు [26]
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలుపు [27]
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం గెలుపు [28]
5వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ మహిళా అరంగేట్రం - మలయాళం గెలుపు [29]
వనిత ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నూతన నటి - నటి గెలుపు [30]
2017 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ అత్యంత ప్రజాదరణ పొందిన నటి కలి గెలుపు [31]
64వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - మలయాళం ప్రతిపాదించబడింది [32]
6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - మలయాళం ప్రతిపాదించబడింది [33]
CPC సినీ అవార్డులు ఉత్తమ నటి గెలుపు [34]
2018 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తెలుగు ఫిదా గెలుపు [35]
7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి - తెలుగు ప్రతిపాదించబడింది [36]
2019 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ నటి - తమిళం మారి 2 ప్రతిపాదించబడింది [37]
2021 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సహాయ పాత్రలో ఉత్తమ నటి పావ కదైగల్ ప్రతిపాదించబడింది [38]

మూలాలు

మార్చు
 1. "Sai Pallavi (Actress)". starsunfolded.com. Retrieved 2 January 2018.
 2. "Sai Pallavi From Dancer to Actress". wikibiopic.com. Archived from the original on 6 సెప్టెంబరు 2019. Retrieved 6 September 2019.
 3. "Sai Pallavi South Actress". wikifolder.com. Archived from the original on 2 మార్చి 2020. Retrieved 2 March 2020.
 4. 4.0 4.1 తలారి, విజయ్ కుమార్ (25 March 2018). "నా కోసం అందులో వెతక్కండి". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 26 March 2018. Retrieved 26 March 2018. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 25 మార్చి 2018 suggested (help)
 5. Namasthe Telangana (3 December 2021). "హ్యాపీ మూడ్‌లో సాయిప‌ల్ల‌వి..సందేశం హ‌ల్‌చ‌ల్‌". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 6. "మొటిమలుంటే ఏంటంట?". eenadu.net. ఈనాడు. Archived from the original on 31 December 2017. Retrieved 1 January 2018.
 7. Eenadu (20 June 2022). "'లేడీ పవర్‌స్టార్‌' ట్యాగ్‌పై సాయిపల్లవి కామెంట్స్‌". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 8. ఎస్. ఆర్, షాజిని. "MCA Box Office Collections: Nani-Sai Pallavi starrer joins $ 1 M club". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 2 January 2018.
 9. "Actor Sai Pallavi to make her Sandalwood debut soon". The News Minute. 3 April 2019. Retrieved 26 April 2020.
 10. Mana Telangana (29 July 2019). "అలనాటి బాలలు.... ఈనాటి భామలు". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.
 11. "Malar of 'Premam' Becomes Fan Favourite". International Business Times. 6 June 2015. Retrieved 26 April 2020.
 12. "'Kali': 5 reasons to watch Dulquer Salmaan-Sai Pallavi starrer". International Business Times. 28 March 2016. Retrieved 26 April 2020.
 13. "Sai Pallavi overwhelmed with response for Fidaa". Telangana Today. 27 July 2017. Retrieved 26 April 2020.
 14. "'I like you very much, will you marry me?', a cheeky Sai Pallavi in 'MCA'". The News Minute. 13 November 2017. Retrieved 26 April 2020.
 15. "Sai Pallavi's long delayed 'Diya'/'Kanam', finally gets release date". The News Minute. 24 April 2018. Retrieved 26 April 2020.
 16. "Sai Pallavi battles memory loss in Padi Padi Leche Manasu". Cinema Express. 10 December 2018. Archived from the original on 16 డిసెంబర్ 2018. Retrieved 26 April 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 17. "'Araathu Aanandhi': Sai Pallavi's look in 'Maari 2' revealed". The News Minute. 7 November 2018. Retrieved 26 April 2020.
 18. "Sai Pallavi on working with Fahadh Faasil in her upcoming film Athiran and setting boundaries as an actor". Firstpost. 11 April 2019. Retrieved 26 April 2020.
 19. "Sai Pallavi on working with director Selvaraghavan in NGK, and sharing screen space with Suriya". Firstpost. 4 June 2019. Retrieved 26 April 2020.
 20. "Tracing the culture of anthologies in Tamil cinema, from Penn to Paava Kathaigal". First Post. 21 October 2020. Retrieved 27 November 2020.
 21. Namasthe Telangana (23 September 2021). "తెలంగాణలో స్థిరపడాలనుంది". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 22. Andhrajyothy (9 May 2021). "శ్యామ్ సింగరాయ్ నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
 23. Namasthe Telangana (22 December 2021). "శ్యామ్ సింగ‌రాయ్ ప్రీరిలీజ్ వేడుక‌ల్లో ఎందుకు ఏడ్చిందో చెప్పిన సాయిప‌ల్ల‌వి". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 24. "Sai Pallavi and Rana Daggubati's 'Virata Parvam' release postponed". The News Minute (in ఇంగ్లీష్). 14 April 2021. Retrieved 15 April 2021.
 25. "Sai Pallavi announces new film titled Gargi on her 30th birthday". India Today. Retrieved 9 May 2022.
 26. "Asiavision movie awards 2015". International Business Times. 18 November 2015. Retrieved 26 April 2020.
 27. "18th Asianet Film Awards". International Business Times. 18 February 2016. Retrieved 26 April 2020.
 28. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". Filmfare. 18 June 2016. Retrieved 26 April 2020.
 29. "SIIMA Awards 2016 Winners' list". International Business Times. 2 July 2016. Retrieved 26 April 2020.
 30. "Vanitha Film Awards 2016". International Business Times. 16 February 2016. Retrieved 26 April 2020.
 31. "19th Asianet Film Awards". International Business Times. 13 February 2017. Retrieved 26 April 2020.
 32. "Nominations for the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 8 June 2017. Retrieved 26 April 2020.
 33. "SIIMA Awards 2017 Malayalam Nominations". International Business Times. 31 May 2017. Retrieved 26 April 2020.
 34. "CPC cine awards 2016". Malayala Manorama. 10 February 2017. Retrieved 26 April 2020.
 35. "Winners: 65th Jio Filmfare Awards (South) 2018". The Times of India. 17 June 2018. Retrieved 26 April 2020.
 36. "SIIMA Awards 2018 – Telugu, Kannada nomination list out". International Business Times. 5 August 2018. Retrieved 26 April 2020.
 37. "Nominations for the 66th Filmfare Awards (South) 2019". Filmfare. 10 December 2019. Retrieved 9 May 2020.
 38. "Dhanush, Manju Warrier, Chetan Kumar, others: SIIMA Awards announces nominees". The News Minute (in ఇంగ్లీష్). 28 August 2021. Retrieved 6 September 2021.