హైడ్ న్ సిక్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. సహస్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నరేంద్ర బుచ్చిరెడ్డిగారి నిర్మించిన ఈ సినిమాకు బసిరెడ్డి రానా దర్శకత్వం వహించాడు. విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్‌దేవ్, శ్రీధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలైంది.[1]

హైడ్ న్ సిక్
దర్శకత్వంబసిరెడ్డి రానా
రచనబసిరెడ్డి రానా
నిర్మాతనరేంద్ర బుచ్చిరెడ్డిగారి
తారాగణం
  • విశ్వంత్
  • శిల్పా మంజునాథ్
  • రియా సచ్‌దేవ్
  • సాక్షి శివ
ఛాయాగ్రహణంచిన్న రామ్
కూర్పుఅమర్ రెడ్డి కుడుముల
సంగీతంలిజో కె జోష్
నిర్మాణ
సంస్థ
సహస్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
20 సెప్టెంబరు 2024 (2024-09-20)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

శివ (విశ్వంత్) తన అక్కతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఆర్మీ డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెడిసిన్ చదువుతుంటాడు. తన తండ్రి, బావ ఆర్మీలో పనిచేసి వీర మరణం పొందడంతో తన తమ్ముడు ఆర్మీకి వెళ్లడం శివ అక్కకు ఇష్టం ఉండదు. శివ (విశ్వంత్) తనతో పాటు కాలేజీలో చదువుతున్న వర్ష (రియా సచ్‌దేవ్)ను ప్రేమిస్తాడు. అనుకోకుండా శివ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. శివను ఎందుకు టార్గెట్ చేశారు. ఈ కేసులో శివ ఎలా బయటపడ్డాడు అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సహస్ర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బసిరెడ్డి రానా
  • సంగీతం: లిజో కె జోష్
  • సినిమాటోగ్రఫీ: చిన్న రామ్
  • ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ
  • ఆర్ట్: నిఖిల్ హస్సన్

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."లైఫ్ అఫ్ శివ"సుద్దాల అశోక్ తేజలిజో కె జోష్హరిచరణ్ & రాధిక భిడే4:07
2."పెయిన్ అఫ్ శివ"సుద్దాల అశోక్ తేజలిజో కె జోష్లిజో కె జోస్5:02

మూలాలు

మార్చు
  1. Sakshi (20 September 2024). "'హైడ్ న్ సీక్' మూవీ రివ్యూ". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  2. Cinema Express (20 September 2024). "Hide N Seek Movie Review: Innovative premise with sloppy storytelling" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.

బయటి లింకులు

మార్చు