హైదరాబాద్ రాష్ట్రం
హైదరాబాద్ రాజ్యం (హైదరాబాద్, బేరార్) ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ ప్రాంతమే బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్, బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన భారతదేశంలో గాని లేదా పాకిస్తాన్లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు.
State of Hyderabad
| |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1724–1948 | |||||||||||
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ), బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853, 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ. | |||||||||||
స్థాయి | మొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798 బ్రిటిష్ భారతదేశం యొక్క రాజరిక రాజ్యం 1798–1947 | ||||||||||
రాజధాని | ఔరంగాబాద్ (1724-1763) (ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో) హైదరాబాద్ (1763-1948) (ప్రస్తుతం భారతదేశంలోని telangana లో) | ||||||||||
సామాన్య భాషలు | ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ | ||||||||||
మతం | హిందూ, ఇస్లాంమతం | ||||||||||
ప్రభుత్వం | Principality (1724–1948) Province of the Dominion of India (1948–1950) | ||||||||||
నిజాం | |||||||||||
• 1720–48 | కమ్రుద్దీన్ ఖాన్ (మొదటి) | ||||||||||
• 1911–48 | ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహ్ VII (ఆఖరి) | ||||||||||
ప్రధాన మంత్రి | |||||||||||
• 1724–1730 | ఇవజ్ ఖాన్ (మొదటి) | ||||||||||
• 1947–1948
ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956 హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952 బూర్గుల రామకృష్ణారావు 1952–1956 | మీర్ లాయిక్ అలీ (ఆఖరి) | ||||||||||
చారిత్రిక కాలం | ముఘల్ సామ్రాజ్యం (1724-1798) బ్రిటిష్ ఇండియా (1798-1947) | ||||||||||
• స్థాపన | 1724 | ||||||||||
1946 | |||||||||||
18 సెప్టెంబరు 1948 | |||||||||||
• విభజన | 1 నవంబరు 1956 | ||||||||||
విస్తీర్ణం | |||||||||||
215,339 కి.మీ2 (83,143 చ. మై.) | |||||||||||
ద్రవ్యం | హైదరాబాదీ రూపీ | ||||||||||
|
ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంగా (హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం), మహారాష్ట్ర యొక్క మరాఠ్వాడ ప్రాంతంగా విభజించబడింది.
బ్రిటీష్ పాలనలో
మార్చు1801 నాటికి నైజాం ప్రాంతం మధ్య దక్కన్ కలిగి చుట్టూ బ్రిటీష్ ఇండియాతో భూభాగంతో బంధింపబడి, బ్రిటీష్ అధికారం క్రింద ఉండే ప్రిన్స్‌లీ స్టేట్ స్థితిలో ఉండేది. ఐతే అంతకు 150 ఏళ్ళనాడు విస్తారమైన బంగాళాఖాతపు కోస్తాతీరాన్ని కలిగివుండేది. రాజ్యాంతర్భాగాల్లో కొంత ప్రాంతం నేరుగా నిజాం అధికారంలో ఉండగా, కొంత ప్రాంతాన్ని నిజాం సామంతులైన సంస్థానాధీశులు పరిపాలించేవారు, కొద్ది భూభాగాన్ని రాజు తన వ్యక్తిగత అవసరాల కోసం స్వంత ఆస్తిగా ఉంచుకున్నారు. జమీందారులు కట్టవలసిన కొద్ది ధనం నిజాం రాజుకు కట్టి పరిపాలనలో బాగా స్వాతంత్ర్యం తీసుకునేవారు. ఒకవిధంగా సంస్థానాధీశుల పాలనలో ఉన్న భూభాగంపై నిజాం పాలన కన్నా వారి పాలనే ఎక్కువగా సాగేది.
ఆ జమీందార్లలో ఒకరిలో ఒకరికి సరపడకపోతే వారిలో వారు సైన్యసహితంగా పోరుసల్పడమే కాక ఒకరి గ్రామాలను ఒకరు కొల్లగొట్టి, గ్రామాలను పాడుచేసేవారని 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించేనాటికి కొల్లాపూర్ సంస్థానం, వనపర్తి సంస్థానాలకు నడుమ అటువంటి వివాదం [1].
1857లో ప్రధానంగా సైన్యంతో పాటు సంస్థానాధీశులు, స్థానిక రాజులు అసంతృప్తితో కంపెనీ పరిపాలనపై తిరుగుబాటు చేసిన సమయంలో మధ్య దక్కన్లో అతిఎక్కువ భూభాగాన్ని పరిపాలిస్తున్న హైదరాబాద్ నవాబు దివాన్ సాలార్ జంగ్ మాత్రం బ్రిటీష్ పక్షాన్ని వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా బ్రిటీషర్ల వద్ద 'నమ్మదగ్గ మిత్రుడు' అన్న బిరుదును సంపాదించుకున్నారు. ఈ నిర్ణయం ఆధునిక దేశభక్తులు చాలా అసంతృప్తితో గమనిస్తూంటారు. బ్రిటీష్ ఇండియాలో అతి ఎక్కువ భూభాగాన్ని కలిగివుండి, కొంతవరకూ బలమైన సైన్యశక్తిని కూడా కలిగున్న నిజాం తిరుగుబాటుదారుల వైపు ఉండివుంటే బ్రిటీషర్లు అనూహ్యంగా బలహీనమైపోయి ఉండేవారేనని పేర్కొంటూంటారు. ఉత్తరభారతదేశానికి ఢిల్లీ ఎటువంటిదో దక్షిణభారతానికి హైదరాబాద్ అటువంటిది. ఐతే చారిత్రికంగా ఈ పరిణామం జరగలేదు, పైగా దేశంలోని అనేకమైన రాజ్యాలతోపాటే హైదరాబాద్ బ్రిటీష్ వైపు నిలిచాయి. 1857తో ఈస్టిండియా కంపెనీ పరిపాలన అంతమై బ్రిటీష్ కిరీటపు పాలన కిందకు నేరుగా వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రధానమైన ప్రిన్స్‌లీ స్టేట్‌గా నిలిచింది. ఆపైన 20 ఏళ్ళకు విక్టోరియా మహారాణి భారత సామ్రాజ్ఞిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం తన సైన్యంతో నిజాం సైన్యంపై ఆపరేషన్ పోలో ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
హైదరాబాదు రాష్ట్రం
మార్చు1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. ఇది 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, 1956 నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించేవరకు కొనసాగింది. ఈ కాలంలో వెల్లోడి, రామకృష్ణారావు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభం | అంతం | వ్యవధి |
---|---|---|---|---|---|
2 | ఎం కె వెల్లోడి | 1950 జనవరి 26 | 1952 మార్చి 6 | ||
3 | బూర్గుల రామకృష్ణారావు | 1952 మార్చి 6 | 1956 అక్టోబరు 31 |
సివిల్ సర్వీస్
మార్చుహైదరాబాద్ సివిల్ సర్వీస్ అనేది హైదరాబాద్ రాజ్యంలో ఒక ఆధునిక పౌరసేవా వ్యవస్థ. 1882లో సర్ సాలార్ జంగ్ I పాత మొఘల్ పరిపాలన పద్ధతులు, సంప్రదాయాలను తొలగించి హైదరాబాద్ సివిల్ సర్వీస్‌ను ప్రారంభించాడు.
ఏరో క్లబ్
మార్చుహైదరాబాదు ఏరో క్లబ్ అనేది హైదరాబాదు రాజ్యంలోని విమానాశ్రయ క్లబ్. హైదరాబాదు VII నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విమానానికి ఎయిర్‌ఫీల్డ్‌గా ఉండేది. ఈ క్లబ్ 1937లో బేగంపేట విమానాశ్రయంలో మొట్టమొదటి వైమానిక ప్రదర్శనను నిర్వహించింది.
ఇవి కూడా చూడండి
మార్చు- ఆపరేషన్ పోలో - హైదరాబాద్ రాష్ట్రాన్నిను భారతదేశంలో కలుపుకునేందుకు జరిపిన సైనిక చర్య
- హైదరాబాదీ రూపీ - హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రత్యేక కరెన్సీ, ఇది భారతీయ రూపాయికి భిన్నంగా ఉంటుంది
- హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు
- మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
- కళ్యాణ కర్ణాటక
మూలాలు
మార్చు- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.