ఆపరేషన్ పోలో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్లకు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.
రాష్ట్రానికి చెందిన అధిక శాతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. రాష్ట్ర కాంగ్రెసును నిజాము నిషేధించడం చేత, ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసారు.
భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, రాజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశం. ఈలోగా పరిస్థితిని ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా సమితికి నివేదించడానికి నిజాము ఒక బృందాన్ని పంపించాడు.
1948 ఆగష్టు 9 న టైంస్ ఆఫ్ లండన్‌లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్ ఆలీ ఇలా అన్నాడు
నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. గోడ్డాన్ ప్లాన్ అని కూడా అంటారు మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. 1948 సెప్టెంబర్ 18న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్ లాయిక్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.
రజాకార్ల దౌష్ట్యం
మార్చుప్రజాప్రభుత్వ ఏర్పాటు
మార్చు1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్ ప్రముఖ్‌గా ప్రకటించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- "ఆపురేషన్ పోలో" గురించి నరేంద్ర లూథర్ బ్లాగు
- లొంగుబాటు తరువాత సర్దార్ పటేల్‌తో 7వ నిజాం విత్రం Archived 2012-08-17 at the Wayback Machine
- సుందర్ లాల్ రిపోర్టులో భాగాలు (ఈ వ్యాసం చర్చా పేజీలో రిపోర్టు ఆంగ్లంలో కాపీ చేయబడింది)
- నిజామ్ పాలనలో
- ఆపురేషన్ పోలో గురించిThe Armchair Historian - Operation Polo (Monday, 18 September 2006) - Contributed by Sidin Sunny Vadukut - Last Updated (Monday, 18 September 2006)