1578
1578 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
మార్చు- జనవరి 31: జెంబ్లోక్స్ యుద్ధం : ఆస్ట్రియాకు చెందిన డాన్ జాన్, అలెగ్జాండర్ ఫర్నేస్ ల ఆధ్వర్యంలోని స్పానిష్ దళాలు డచ్‌ను ఓడించాయి; ఫర్నేస్, ఫ్రెంచ్ మాట్లాడే దక్షిణ నెదర్లాండ్స్‌పై తిరిగి నియంత్రణ పొందడం ప్రారంభించాడు.
- మే 31: మార్టిన్ ఫ్రోబిషర్ తన మూడవ యాత్రలో ఇంగ్లాండ్‌లోని హార్విచ్ నుండి కెనడాలోని ఫ్రోబిషర్ బేకు ప్రయాణించాడు.
- జూలై: ఉత్తర అమెరికాలో యూరోపియన్లు చేసిన మొదటి థాంక్స్ గివింగ్ వేడుకను న్యూఫౌండ్లాండ్‌లో మార్టిన్ ఫ్రోబిషర్ నిర్వహించారు. అతను ముడిసరుకులను రవాణా చేసేవాడు.
- ఆగష్టు 20 – సెప్టెంబర్ 6: ఫ్రాన్సిస్ డ్రేక్, తన భూప్రదక్షిణ సమయంలో, తన ఓడలో మాగెల్లాన్ జలసంధి గుండా వెళ్ళాడు. అప్పటికే దానికి కొత్తగా గోల్డెన్ హైండ్ అని పేరు మార్చారు. [1]
- అక్టోబర్ 1: అలెశాండ్రో ఫర్నేస్ డాన్ జాన్ తరువాత స్పానిష్ నెదర్లాండ్స్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాడు .
- అక్టోబర్ 21: వెండెన్ యుద్ధం : స్వీడన్లు రష్యన్లను ఓడించి, ముందుకు సాగి పోలోట్స్క్ పట్టుకున్నారు.
- ఒట్టోమన్ సామ్రాజ్యం అబ్ఖాజియాను జయించింది.
- సోనమ్ గైర్సో, ప్రిన్స్ అట్లాన్ ఖాన్ నుండి తలాస్ బిరుదును అందుకున్నాడు. టిబెట్ యొక్క మూడవ దలైలామా అయ్యాడు .
- హైదరాబాదులో నయాపుల్ (కొత్త వంతెన) వంతెన నిర్మాణం ప్రారంభమైంది. ఇది 1607 సంవత్సరంలో పూర్తయింది. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది.
జననాలు
మార్చు- ఏప్రిల్ 1: విలియం హార్వే, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు. (మ.1657)
- మైసూరు మహారాజా ఒడయార్-1 (మ. 1617)
మరణాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Voyage of the Golden Hind". The Golden Hind. 2012. Archived from the original on 2013-01-17. Retrieved 2013-09-02.