180 అనేది 2011లో విడుదలైన భారతీయ రొమాంటిక్ డ్రామా చిత్రం. దీనికి జయేంద్ర పంచపకేశన్ దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా ఆయన ఈ చిత్రానికి శుభ, ఉమర్జీ అనురాధలతో కలిసి రచయితగా వ్యవహరించారు. 180 తెలుగు చిత్రం, నూట్రన్‌బదు (అనువాదం 180) తమిళంలో ఏకకాలంలో చిత్రీకరించబడ్డాయి.[1] వీటిల్లో సిద్ధార్థ్, ప్రియా ఆనంద్, నిత్యా మీనన్ ప్రధానపాత్రల్లో, అలాగే మౌలీ, తనికెళ్ల భరణి, గీత తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. నూట్రన్‌బదుతో నిత్యా మీనన్ తమిళంలో అరంగేట్రం చేయగా,[2] ఏడేళ్ల తర్వాత సిద్ధార్థ్ తమిళ సినిమాకు పునరాగమనం చేసాడు. అతని చివరి తమిళ చిత్రం 2004లో వచ్చిన ఆయుత ఎజుత్తు.[3] రెడ్ వన్ కెమెరాలో 180 చిత్రాన్ని చిత్రీకరించడం విశేషం. ఈ చిత్రాన్ని ఎస్.పి.ఐ సినిమాస్, మఅఘల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. కాగా తమిళ వెర్షన్‌ను ఐంగారన్ ఇంటర్నేషనల్ పంపిణీ చేసింది. శరత్ సంగీతం సమకూర్చగా, బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని నిర్వహించారు. కిషోర్ తే ఎడిటింగ్ చేసాడు. ఈ చిత్రం 2011 జూన్ 25న విడుదలైంది.

180
దర్శకత్వంజయేంద్ర పంచపకేశన్
రచనఉమర్జీ అనురాధ (తెలుగు)
శుభ, జయేంద్ర (తమిళం)
స్క్రీన్‌ప్లేజయేంద్ర
శుభ
కథజయేంద్ర
నిర్మాతకిరణ్ రెడ్డి
స్వరూప్ రెడ్డి
సి. శ్రీకాంత్
నటవర్గం
  • సిద్ధార్థ్
  • ప్రియా ఆనంద్
  • నిత్యా మీనన్
ఛాయాగ్రహణంబాలసుబ్రహ్మణ్యం
కూర్పుకిషోర్ తే
సంగీతంశరత్
నిర్మాణ
సంస్థలు
ఎస్.పి.ఐ సినిమాస్
అఘల్ ఫిల్మ్స్
పంపిణీదారులుఅయ్ంగారన్ ఇంటర్నేషనల్ (తమిళ వెర్షన్)
విడుదల తేదీలు
2011 జూన్ 25 (2011-06-25)
నిడివి
122 నిమిషాలు
దేశంఇండియా
భాషలుతెలుగు
తమిళం

తారాగణంసవరించు

ప్రొడక్షన్సవరించు

అడ్వర్టైజ్‌మెంట్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర తన మొదటి చలన చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా 2010 జూన్ 15న చెన్నైలోని ఎవిఎమ్ స్టూడియోలో ప్రకటించారు. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించాడు. సిద్ధార్థ్‌కు జోడీగా ప్రియా ఆనంద్, నిత్యా మీనన్‌లు కథానాయికలుగా నటించారు. ఈ చిత్రబృందంలో శరత్, బాలసుబ్రహ్మణ్యం, కిషోర్ తే వరుసగా స్వరకర్తగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రకటించిన రోజునే ప్రారంభమైంది. చెన్నై, హైదరాబాదు, శాన్ ఫ్రాన్సిస్కోలలో చిత్రీకరించబడింది. రెడ్ డిజిటల్ సినిమా కెమెరాను ఉపయోగించారు.

బాక్స్ ఆఫీస్సవరించు

ఈ చిత్రం చెన్నైలో మొదటి మూడు రోజుల్లో 90% ఆక్యుపెన్సీతో థియేటర్లలో ₹8 మిలియన్లు వసూలు చేసింది.[4] రెండు వారాల తర్వాత, ఆక్యుపెన్సీ 90%కి చేరుకోవడంతో ₹12 మిలియన్లు వసూలు చేసింది.[5]

మూలాలుసవరించు

  1. "'180' becomes 'Nootrenbadhu' - Tamil Movie News". IndiaGlitz. 11 June 2011. Archived from the original on 14 జూన్ 2011. Retrieved 15 September 2011.
  2. "Priyamani signs her third Kannada film - Indian Express". archive.indianexpress.com. Retrieved 2020-01-14.
  3. "Siddharth returns to Tamil cinema with 180". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 2018-11-26. Retrieved 2020-01-14.
  4. "180 - Behindwoods.com - Tamil Top Ten Movies - 180 Pillaiyar Nootrenbadu Theru Kadaisi Veedu Udhayan Avan Ivan Aaranya Kaandam Azhagarsaamiyin Kudhirai Aanmai Thavarel Kanden Engeyum Kadhal Ko Vaanam". Behindwoods.com. Retrieved 15 September 2011.
  5. "180 - Behindwoods.com - Tamil Top Ten Movies - Theneer Viduthi Venghai 180 Pillaiyar Nootrenbadu Theru Kadaisi Veedu Udhayan Avan Ivan Aaranya Kaandam Azhagarsaamiyin Kudhirai Aanmai Thavarel Kanden Engeyum Kadhal Ko Vaanam". Behindwoods.com. Retrieved 15 September 2011.