భారత ఎన్నికల సంఘం 1957 మే 6న భారతదేశానికి రెండవ రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరో ఇద్దరు రాష్ట్రపతి అభ్యర్థులను ఓడించి భారతదేశానికి రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. రాష్ట్రపతి ఎన్నికలలో రెండవ స్థానంలో నిలిచిన చౌదరి హరిరాం 2,672 ఓట్లు, నాగేంద్ర నారాయణ్ దాస్ 2,000 ఓట్లు సాధించారు. బాబు రాజేంద్రప్రసాద్ 459,698 ఓట్ల సాధించి రెండవసారి భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాజేంద్ర ప్రసాద్, భారత రాష్ట్రపతిగా రెండు పర్యాయాలు గెలిచి, సేవలందించిన ఏకైక వ్యక్తి.
1957 భారతదేశ రాష్ట్రపతి ఎన్నికలు|
|
|
|
|
ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం 1957 ఏప్రిల్ 6న ప్రకటించింది.[1]
ఎస్. నం.
|
ఎన్నికల ఈవెంట్
|
తేదీ
|
1.
|
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
|
16 ఏప్రిల్ 1957
|
2.
|
నామినేషన్ల పరిశీలనకు తేదీ ఖరారు
|
17 ఏప్రిల్ 1957
|
3.
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
20 ఏప్రిల్ 1957
|
4.
|
పోలింగ్ తేదీ
|
6 మే 1957
|
5.
|
లెక్కింపు తేదీ
|
10 మే 1957
|