1987 క్రికెట్ ప్రపంచ కప్ అధికారులు
1987 క్రికెట్ ప్రపంచ కప్ (రిలయన్స్ ప్రపంచ కప్) అనేది క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో నాల్గవ ఎడిషన్. 1987 అక్టోబరు 8 నుండి నవంబరు 8 వరకు భారతదేశం, పాకిస్తాన్ దేశాలలో ఈ టోర్నమెంట్ జరిగింది. ఇంగ్లాండు వెలుపల ఇరవై ఒక్క వేర్వేరు వేదికలపై జరిగిన మొదటి టోర్నమెంట్ ఇది.[1] 1987 క్రికెట్ ప్రపంచ కప్‌లో 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్‌తోసహా మొత్తం 27 మ్యాచ్‌లు జరిగాయి.[2]
అంపైర్లు
మార్చుఎంపిక చేసిన 12 మంది అంపైర్లలో 4 మంది పాకిస్థాన్‌కు చెందినవారు కాగా, ఇద్దరు ఇంగ్లాండ్, భారత్‌కు చెందినవారు కాగా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, వెస్టిండీస్, శ్రీలంక దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మొదటి సెమీఫైనల్‌ను డిక్కీ బర్డ్ - డేవిడ్ షెపర్డ్ పర్యవేక్షించగా, టోనీ క్రాఫ్టర్ - స్టీవ్ వుడ్‌వర్డ్ రెండవ సెమీఫైనల్‌ను పర్యవేక్షించారు.[3][4] 1987 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ను రామ్ గుప్తా, మహబూబ్ షా పర్యవేక్షించారు.[5]
స.నెం. | అంపైర్ | దేశం | మ్యాచ్‌లు |
---|---|---|---|
1 | మహబూబ్ షా | పాకిస్తాన్ | 6 |
2 | డేవిడ్ షెపర్డ్ | ఇంగ్లాండ్ | 6 |
3 | రామ్ గుప్తా | భారతదేశం | 6 |
4 | వీకే రామస్వామి | భారతదేశం | 5 |
5 | స్టీవ్ వుడ్వార్డ్ | న్యూజీలాండ్ | 5 |
6 | డిక్కీ బర్డ్ | ఇంగ్లాండ్ | 5 |
7 | డేవిడ్ ఆర్చర్ | వెస్టిండీస్ | 5 |
8 | టోనీ క్రాఫ్టర్ | ఆస్ట్రేలియా | 5 |
9 | ఖిజర్ హయత్ | పాకిస్తాన్ | 5 |
10 | పిడబ్ల్యూ విదనగమగే | శ్రీలంక | 4 |
11 | అమానుల్లా ఖాన్ | పాకిస్తాన్ | 1 |
12 | ఖలీద్ అజీజ్ | పాకిస్తాన్ | 1 |
మూలాలు
మార్చు- ↑ 1983 Cricket World Cup Grounds
- ↑ 27 matches were played in 1987 Cricket World Cup ESPN cricinfo
- ↑ Dickie Bird and David Shepherd in the 1st semifinal of 1987 Cricket World Cup ESPN cricinfo
- ↑ Tony Crafter and Steve Woodward in the 2nd semifinal of 1987 Cricket World Cup ESPN cricinfo
- ↑ Ram Gupta and Mahboob Shah for the 3rd & 2nd time respectively in Cricket World Cup Final ESPN cricinfo
బయటి లింకులు
మార్చు- క్రిక్ఇన్ఫో నుండి క్రికెట్ ప్రపంచ కప్ 1987
- క్రికెట్ ప్రపంచ కప్ 1987