2022 లో ఆంధ్రప్రదేశ్

2022 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రధానమైన సంఘటనలను ఈ పేజీలో చూడవచ్చు.

జనవరి

మార్చు

జనవరి 1: విజయవాడలో ఏటా జరిగే పుస్తక ప్రదర్శన మొదలైంది. రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ దీన్ని రాజభవన్ నుంచే రిమోటు ద్వారా ప్రారంభించాడు. ఈ ప్రదర్శనలో 150 స్టాళ్ళను ఏర్పాటు చేసారు.[1]

జనవరి 3: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్రస్ మోడీని కలిసి రాష్ట్ర సమస్యలకు సంబంధించిన 16 పాయింట్లతో వినతి పత్రాన్ని సమర్పించాడు.[2]

జనవరి 6: పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు-2022 ను మిజోరాం గవర్నరు కంభంపాటి హరిబాబు ప్రారంభించాడు. [3]

మార్చి

మార్చు

మార్చి 3: అమరావతిని రాజధానిగా కొంసాగించాల్సిందేనని, సి.ఆర్>డి.ఏ చట్టాన్ని అనుసరించాల్సిందేననీ అమరావతి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా తీర్పు ఇచ్చింది. అధికారం లేనప్పుడు సీఆర్‌డీఏ చట్టం రద్దు కూడా కుదరదని తేల్చి చెప్పింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని, రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది. అభివృద్ది పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. రాజధాని భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని చెప్పింది. ఏ ఒక్క కార్యాలయాన్ని కూడా అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని చెప్పింది. [4][5]

మూలాలు

మార్చు
  1. "Andhrajyothy ePaper". epaper.andhrajyothy.com. Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  2. "Andhrajyothy ePaper". epaper.andhrajyothy.com. Retrieved 2022-03-19.
  3. "Andhrajyothy ePaper". epaper.andhrajyothy.com. Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  4. "AP High Court: సీఆర్డీఏ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందే: ఏపీ హైకోర్టు తీర్పు". ఈనాడు. 2022-03-03. Archived from the original on 2022-03-18. Retrieved 2022-03-18.
  5. రెడ్డి, దివ్య (2022-03-03). "AP High Court: అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే: ఏపీ హైకోర్టు తీర్పు". టివి5 వార్తలు (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-18. Retrieved 2022-03-18.