2022 శ్రీలంక రాజకీయ సంక్షోభం
శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స కు, శ్రీలంక పార్లమెంటుకూ మధ్య ఆధిపత్య పోరు కారణంగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభమే 2022 శ్రీలంక రాజకీయ సంక్షోభం. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనలు దీనికి ఆజ్యం పోశాయి. శ్రీలంకలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ వ్యతిరేక సెంటిమెంట్ అంతర్యుద్ధం తర్వాత దేశం ఎన్నడూ చూడని రాజకీయ అస్థిరతను రేకెత్తించింది. [4]
2022 శ్రీలంక రాజకీయ సంక్షోభం | |||
---|---|---|---|
the Sri Lankan economic crisis and the 2022 Sri Lankan protests లో భాగం | |||
తేదీ | 2022 ఏప్రిల్ 3– ప్రస్తుతం | ||
స్థలం | శ్రీలంక | ||
కారణాలు | |||
స్థితి |
| ||
ముఖ్య నాయకులు | |||
|
ప్రధానమంత్రి రాజపక్స మినహా గోటబయ రాజపక్స మంత్రివర్గంలోని మొత్తం 26 మంది సభ్యులు రాత్రికి రాత్రే మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో, 2022 ఏప్రిల్ 3 న రాజకీయ సంక్షోభం మొదలైంది. వారు రాజ్యాంగ ప్రోటోకాల్‌ను అనుసరించనందున రాజీనామా చెల్లుబాటు కాదని విమర్శకులు అంటూ, దానిని "బూటకం"గా వర్ణించారు, [5] [6] [7] మరుసటి రోజున వారిలో చాలా మందిని వేర్వేరు మంత్రిత్వ శాఖలలో తిరిగి నియమించారు. [8] దేశాన్ని నడపడానికి కేర్‌టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, తక్షణమే ఎన్నికలు జరపాలనీ పిలుపులు కూడా పెరుగుతున్నాయి. పేపర్ కొరత, ఎన్నికలకయ్యే వ్యయం పైన ఆందోళనల కారణంగా ఎన్నికలు జరపడం ఆచరణ సాధ్యం కాదని భావించారు. [9]
ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహం, అసంతృప్తిని ప్రదర్శిస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. రాజకీయ మార్పు కోసం తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు అధ్యక్షుడు గోటబయను కోరారు. [10] అతను నిరాకరించాడు. [11] [12] [13] కార్యనిర్వాహక అధ్యక్షుని కార్యనిర్వాహక అధికారాలను రద్దు చేయడానికి ప్రైవేట్ సభ్యుల బిల్లును తీసుకురావడం ద్వారా 20వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ నిర్ణయించింది. [14]
2022 జూలై 12 న మాల్దీవులకు, అక్కడి నుండి జూలై 14 న సింగపూరుకూ పారిపోయిన అధ్యక్షుడు గోటబయ రాజపక్స, 2022 జూలై 14 న పదవికి రాజీనామా చేసాడు. రాజీనామా లేఖను సింగపూరు నుండి ఈమెయిలు ద్వారా స్పీకరుకు పంపించాడు.
నేపథ్యం
మార్చు2019, 2020 ఎన్నికల తర్వాత
మార్చు2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల సమయంలో శ్రీలంక పొదుజన పెరమున (SLPP) మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేసింది. SLPP, మెజారిటీ సింహళ బౌద్ధుల మద్దతును పొందింది. ఇది ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైంది. [15] [16] COVID-19 మహమ్మారి మొదటి తరంగాన్ని ఎదుర్కొన్న తీరుకు గాను SLPP ప్రభుత్వం, మెజారిటీ మద్దతును పొందింది. [17] 2019 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 69 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గోటబయ శ్రీలంక 7వ కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. [18] అతను, తన సైనిక నేపథ్యం కారణంగాను, 2009 మేలో [19] 26 ఏళ్ల శ్రీలంక అంతర్యుద్ధాన్ని ముగించడంలో రక్షణ కార్యదర్శిగా అతని పాత్ర కారణంగానూ బలమైన వ్యక్తిగా తన ప్రజాదరణను సుస్థిరం చేసుకున్నాడు.
2019 ఈస్టర్ సండే బాంబు పేలుళ్లలో శ్రీలంక విలవిలలాడుతున్న నేపథ్యంలో 2019 ఎన్నికలకు అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయినప్పుడు అతను, అపారమైన ప్రజా మద్దతును పొందాడు. [20] శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీందా రాజపక్స ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు. 2020లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో రాజపక్స కుటుంబంలోని చాలా మంది సభ్యులు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను పొందారు. చమల్ రాజపక్స వ్యవసాయ మంత్రిగా, నమల్ రాజపక్స క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా, బాసిల్ రాజపక్స ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. రాజపక్స కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ప్రభుత్వంలో ఉండడంతో ప్రభుత్వం బంధుప్రీతి చేస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. 2020 పార్లమెంటు ఎన్నికల సమయంలో వారు ప్రాధాన్యత ఓట్లు, ప్రజల ఆదేశంపై నియమించబడ్డారని సమాధానం ఇచ్చి, ప్రభుత్వం దీనిని సమర్థించుకుంది.
2021 నుండి
మార్చు2021 సంవత్సరానికి గోటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై ఉన్న ప్రజాదరణ క్షీణించింది. అసమర్థత కారణంగా దానికి విస్తృతమైన వ్యతిరేకత వచ్చింది. [21] కోవిడ్ మహమ్మారి తొలి తరంగాన్ని విజయవంతంగా ఎదుర్కోవడం, టీకాలు వేయించడంలోనూ ప్రభుత్వం కీర్తి పొందినప్పటికీ, ఆర్థిక వ్యవస్థను సరిగా నిర్వహించడం వల్ల రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజాదరణ 2021 నుండి తగ్గడం ప్రారంభమైంది. [22] ]
అంతేకాదు, రాత్రికి రాత్రే రసాయనిక ఎరువుల నిషేధం నిర్ణయాన్ని ప్రకటించడంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అటువంటి దురదృష్టకర చర్యను తీసుకోవద్దని పదేపదే కోరిన వ్యవసాయ నిపుణుల మాట వినడానికి బదులుగా భారతీయ పండితురాలు, GMO వ్యతిరేక కార్యకర్త అయిన వందనా శివను సంప్రదించిన గోటబయ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. [23] ప్రపంచంలో 100% సేంద్రియ వ్యవసాయాన్ని అనుసరించే మొట్టమొదటి దేశంగా శ్రీలంకను తయారు చేయాలని గోటబయ ఉద్దేశించాడు. రసాయన ఎరువుల నిషేధంతో పంటలు తీవ్రంగా దెబ్బతిని, దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. [24] ప్రజల కొనుగోలు తీరుపై దాని ప్రభావం పడింది. ముఖ్యమైన ఆహార పదార్థాలు, చక్కెర, పాలపొడి, కిరోసిన్ నూనె, వంట గ్యాస్‌తో సహా ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి దేశంలో పొడవైన క్యూలలో ప్రజలు నిలబడాల్సి వచ్చింది. [25] [26]
2021 సెప్టెంబరులో జాతీయ కరెన్సీ మారకం రేటు పడిపోవడం, అధిక ఆహార ధరల ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడం, మహమ్మారి కారణంగా పర్యాటక రంగంలో పరిస్థితి మరింత దిగజారడంతో ప్రభుత్వం ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. [27] నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం అత్యవసర నిబంధనలను అమలులోకి తెచ్చింది. చక్కెర, పాలపొడి వంటి అవసరమైన ఆహార పదార్థాలను వ్యాపారులు నిల్వ చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వం ఉద్దేశంలో, ఇది భారీ ఆహార కొరతకు దారితీసింది. [28] శ్రీలంక మీడియా ప్రజలలో అనవసర భయాలను రేకెత్తిస్తున్నదని ప్రభుత్వం ఆరోపించింది. కొరత లేదని చెప్పింది. [29] 2021 ఆగస్టు 30 న జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, శ్రీలంక పార్లమెంటు 2021 సెప్టెంబరు 6 న దానిని ఆమోదించింది. [30] [31] 2021 నవంబరులో ఆహార ధరలు పెరగడం, ప్రపంచంలోనే మొట్టమొదటి సేంద్రీయ వ్యవసాయ దేశంగా అవతరించే ప్రణాళికకు వ్యతిరేకంగా వారాల తరబడి నిరసనలు వెల్లువెత్తడంతో శ్రీలంక ఆ ప్రణాళికను విరమించుకుంది. [32] [33]
ఇళ్ళు, హోటళ్లలో పేలుళ్లకు దారితీసిన గ్యాస్ సిలిండర్ల కూర్పులో మార్పు కూడా ప్రభుత్వానికి ప్రతికూల ప్రచారాన్ని కలిగించింది. చాలా మంది బయోగ్యాస్ ఉపయోగించాలంటే భయపడి ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఓవెన్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. [34] [35] కీలకమైన విదేశీ నిల్వలను కాపాడుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. ఇది దిగుమతులు తగ్గడానికి దారితీసింది. దిగుమతుల నిషేధపు తొలి చర్య మోటారు వాహనాలపై పడింది. ఇది తమ జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేయడంతో వాహన దిగుమతిదారులకు కోపం వచ్చింది. కోవిడ్ డెల్టా వేరియంట్ ముప్పు పర్యాటక పరిశ్రమకు పునరుద్ధరణపై ఉన్న ఆశలను మరింత దిగజార్చింది. [36] దీనికి తోడు, శ్రీలంకకు విదేశీ చెల్లింపులు కూడా 2021లో క్షీణించడం ప్రారంభించాయి, ఇది దేశం యొక్క GDPని మరింత దెబ్బతీసింది. ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుల సమ్మెలను ఎదుర్కొంది. వారు అధిక జీతాలు డిమాండ్ చేసారు. ఉపాధ్యాయులు ఆన్‌లైన్ విద్యలో కూడా సమ్మెలు చేయడంతో, అప్పటికే నేరుగా పాఠశాలకు వెళ్ళి చదివే పరిస్థితిని కోల్పోయిన విద్యార్థుల విద్యనూది ప్రభావితం చేసింది. [37] [38]
నిరసనలు
మార్చుశ్రీలంక దేశస్థులు వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడిని, ప్రభుత్వాన్నీ గద్దె దిగమని డిమాండు చేసారు. [39] యూనివర్శిటీ విద్యార్థులతో సహా చాలా మంది యువకులు శాంతియుత నిరసనలలో పాల్గొని, వ్యవస్థలో సమూలమైన మార్పు కోసం పిలుపునిచ్చారు. యువకులు దేశాన్ని నడిపించడానికి మార్గం సుగమం చేయాలని చట్టసభ సభ్యులను కోరారు. [40] [41] శ్రీలంక రాజ్యాంగంలోని 20వ సవరణను తొలగించి, కార్యనిర్వాహక అధ్యక్షుడిని రద్దు చేయాలని కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. పార్లమెంటులో కొత్త ముఖాలను ఎన్నుకునేందుకు 225 మంది ఎంపీలను ఇంటికి పొమ్మని కూడా కొంతమంది నిరసనకారులు కోరారు. నిరసనల సమయంలో, విద్యావంతులైన విద్యావేత్తలను పార్లమెంటుకు ఎన్నుకోవాలనే పిలుపులు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకుల నికర విలువను, ఆస్తులనూ బహిర్గతం చేయాలనే పిలుపులు కూడా వచ్చాయి.
రాజకీయ అస్థిరత
మార్చు2022 ఏప్రిల్ 3 న 26 మంది క్యాబినెట్ మంత్రుల రాజీనామాతో రాజకీయ అస్థిరత పెరిగింది [42] మంత్రులు తమ రాజీనామాలను అధ్యక్షుడికి బదులుగా ప్రధానమంత్రికి సమర్పించినందున, శ్రీలంక రాజ్యాంగంలోని ఇరవయ్యవ సవరణ నిబంధనల ప్రకారం ఆ రాజీనామాలు చెల్లవని పరిగణించారు. ప్రధాన మంత్రి మహింద రాజపక్స కుమారుడు క్రీడలు, యువజన మంత్రి అయిన నమల్ రాజపక్స, సోదరులు చమల్ రాజపక్స, బాసిల్ రాజపక్సలు కూడా రాజీనామా చేశారు. [43]
తక్షణమే సకలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధ్యక్షుడు చర్యలు తీసుకున్నాడు. 2022 శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, 2025లో జరిగే తదుపరి శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల వరకు తాత్కాలిక పరిష్కారంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అన్ని పార్టీలను ఆహ్వానించాడు. [44] [45] సకల పక్ష మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఇద్దరూ మారరని, మంత్రివర్గంలో వివిధ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు ఉంటారనీ అతని ప్రతిపాదనలో ఉంది. ప్రధాన ప్రతిపక్షాలు SJB, JVP లు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. అధ్యక్షుడితో సహా మొత్తం ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని అవి కోరాయి. [46] మహీందా రాజపక్స తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే పుకార్లు, ఊహాగానాలు వచ్చాయి. అయితే మహీందా అధికారంలో కొనసాగుతాడని ఆ తరువాత వెల్లడైంది. [47] [48]
2022 ఏప్రిల్ 4 న, నలుగురు మంత్రులతో తాత్కాలిక క్యాబినెట్‌ను గోటబయ రాజపక్స ఏర్పాటు చేశాడు. సంక్షోభం కారణంగా రాజీనామా చేసిన క్యాబినెట్‌లో భాగంగా ఉన్న ఈ నలుగురు మంత్రులను వేర్వేరు మంత్రిత్వ శాఖలకు మార్చారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో, అలీ సబ్రీని ఆర్థిక మంత్రిగా, జిఎల్ పీరీస్‌ను విదేశాంగ మంత్రిగా, దినేష్ గుణవర్దనను విద్యా మంత్రిగా, జాన్‌స్టన్ ఫెర్నాండోను హైవేస్ మంత్రిగా నియమించారు. ఏప్రిల్ 5న, అలీ సబ్రీ తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశాడు, కేవలం ఒకరోజు మాత్రమే కార్యాలయంలో పనిచేశాడు. [49][50] అంతేకాకుండా తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలని భావించాడు. [51] కానీ, అతను తన రాజీనామాను ఉపసంహరించుకుని, ఆర్థిక మంత్రిగా కొనసాగాడు. [52] [53]
అత్యవసర పరిస్థితి ప్రారంభమైన తర్వాత, ఏప్రిల్ 5న, పార్లమెంటు మొదటిసారి తిరిగి సమావేశమైంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. [54] పాలక SLPP ప్రభుత్వం 41 మంది ఎంపీలతో కూడిన దాని కీలక మిత్రపక్షాల మద్దతును కోల్పోవడం ప్రారంభించింది: శ్రీలంక పొదుజన పెరమున (SLPP)కి చెందిన 9 మంది ఎంపీలు ప్రభుత్వం నుండి వైదొలిగి స్వతంత్ర వ్యక్తులుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (SLFP) ), సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ (CWC), ఆల్ సిలోన్ మక్కల్ కాంగ్రెస్ (ACMC) లు ప్రభుత్వాన్ని విడిచిపెట్టి ప్రతిపక్షంలోకి వెళ్లాయి. [55] [56] [57] హర్ష డి సిల్వాను కనీసం ఆరు నెలల పాటు శ్రీలంక అధ్యక్షుడిగా చేయాలని ఎంపీ హరీన్ ఫెర్నాండో కోరాడు. హర్షకు ఆర్థిక వ్యవస్థ గురించి విస్తృత పరిజ్ఞానం, అవగాహన ఉంది. [58]
గోటబయ రాజపక్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 2022 ఏప్రిల్ 6 న ప్రతిపక్ష పార్టీ SJB ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్ లోపల నిరసన వ్యక్తం చేసింది. [59] రాష్ట్రపతి, ప్రధాని దిగిరాకపోతే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెడతామని ఎస్‌జేబీ పార్టీ పేర్కొంది. [60] [61]
2022 ఏప్రిల్ 7 న, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించాలని శ్రీలంక ప్రైవేట్ రంగం సమిష్టిగా వ్రాతపూర్వకంగా అభ్యర్థన చేసింది. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, తయారీదారులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగం, పర్యాటక రంగానికి సమిష్టిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 38 సంస్థలు విపత్తును నివారించడానికి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలని పార్లమెంటుకు విజ్ఞప్తి చేశాయి. [62] 2022 ఏప్రిల్ 7 న, ఛాంబర్ ఆఫ్ యంగ్ లంకన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (COYLE) కూడా ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమస్యను తగిన శ్రద్ధతో పరిష్కరించకుంటే అది వ్యాపారాల మూసివేతకు దారితీస్తుందని హెచ్చరించింది. [63]
కొత్తగా నియమితులైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ రాజకీయ స్థిరత్వం కోసం పిలుపునిచ్చాడు. శ్రీలంకకు తక్షణ బెయిలౌట్ లేదా IMF, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి బహుళ పక్ష ఏజెన్సీల నుండి తాత్కాలికంగా చెల్లింపులపై మోరటోరియమ్ అవసరం అని పట్టుబట్టాడు. సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి బహుపాక్షిక ఏజెన్సీల నుండి సహాయం పొందడం మినహా ఇతర వికల్పాలు ఏమీ లేవని కూడా అతను నొక్కి చెప్పాడు. ముఖ్యంగా 2022 జూలై నాటికి మెచ్యూర్ అయ్యే US$ [64] బిలియన్ల ISB బాండ్ రీపేమెంట్‌ను తిరగరాయాలని అతను ప్రభుత్వానికి పిలుపునిచ్చాడు.
మాజీ ప్రపంచ బ్యాంక్ అధికారి శాంత దేవరాజన్ శ్రీలంక ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదం సామాజిక అశాంతి, గందరగోళం అని 2022 ఏప్రిల్ 8 న హెచ్చరించాడు. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని నివారించేందుకు ఆహారం, ఇంధనంపై సబ్సిడీలను తగ్గించడంతో పాటు పేద ప్రజలకు సహాయం చేసే లక్ష్యంతో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చని ఆయన చెప్పాడు. [65] మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కేబినెట్ మంత్రుల రాజీనామాలు విధాన అనిశ్చితిని పెంచుతాయని, ఫలితంగా రుణం తీసుకోవడం కష్టతరం అవుతుందనీ హెచ్చరించింది. [66]
2022 మే 9 న, సామూహిక ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య ప్రధాన మంత్రి మహింద రాజపక్స రాజీనామా చేసాడు. [67]
కొత్త ప్రభుత్వం
మార్చు2022 ఏప్రిల్ 18 న, పార్లమెంట్‌లోని మొత్తం 225 మంది ఎంపీలతో పాటు అధ్యక్షుడితో సహా మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయాలని నిరసనలు ఉన్నప్పటికీ గోటబయ, 17 మంది సభ్యులతో కొత్త మంత్రివర్గాన్ని నియమించాడు. [68] [69] దినేష్ గుణవర్దనను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించగా, డగ్లస్ దేవానందను ఫిషరీస్ మంత్రిగా, కనక హెరాత్‌ను హైవేస్ మంత్రిగా, దిలుమ్ అమునుగమను రవాణా, పరిశ్రమల మంత్రిగా, ప్రసన్న రణతుంగను పబ్లిక్ సెక్యూరిటీ, టూరిజం మంత్రిగా నియమించారు. చన్నా జయసుమన ఆరోగ్య మంత్రిగా, నలక గోదాహేవా మీడియా మంత్రిగా, ప్రమిత తెన్నకోన్ ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిగా, అమిత్ తేనుక విదనగామగే క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా, కాంచన విజేశేఖర విద్యుత్ & ఇంధన మంత్రిగా, అసంక షెహన్ సేమసింఘే నియమితులయ్యారు. వాణిజ్యం & సమృద్ధి అభివృద్ధి మంత్రిగా, జనక వక్కుంబుర వ్యవసాయం & నీటిపారుదల శాఖ మంత్రిగా, విదుర విక్రమనాయక్ కార్మిక మంత్రిగా, మోహన్ ప్రియదర్శన డి సిల్వా నీటి సరఫరా మంత్రిగా, రమేష్ పతిరణ విద్య & ప్లాంటేషన్ పరిశ్రమల మంత్రిగా, విమలవీర డి . స్సానాయకే వైడ్‌లైఫ్ & ఫారెస్ట్ రిసోర్సెస్ మంత్రిగా, అహ్మద్ నజీర్ జైనులాబ్దీన్ పర్యావరణ మంత్రిగా నియమితులయ్యారు. [70] [71] కొత్త క్యాబినెట్ పోర్ట్‌ఫోలియోలో, మొత్తం 17 మంది మంత్రులు పురుషులే కావడంతో మహిళా ప్రాతినిధ్యం అసలే లేదు. [72]
ప్రధానమంత్రి
మార్చు2022 మే 11 న, గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని, యుఎన్‌పి నాయకుడు అయిన రణిల్ విక్రమసింఘేతో రహస్యంగా సమావేశమై, దేశ ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించాడు. కనీసం ఆరు నెలల పాటు రణిల్‌ను దేశానికి కొత్త ప్రధానిగా నియమించవచ్చని విమర్శకులు ఊహించారు. [73] గోటబయ రణిల్‌కు ప్రధాని పదవిని చేపట్టాలని ఆఫర్ ఇవ్వడంతో సమావేశం కూడా ముగిసింది. [74] గోటబయ ప్రతిపక్ష నాయకుడు సాజిత్ ప్రేమదాసను కూడా సంప్రదించారని, మాజీ సజిత్‌ను ప్రధాని పదవిని చేపట్టాలని సిఫార్సు చేశారని, అయితే దానిని సాజిత్ తిరస్కరించారని వెల్లడించారు. [75] గోటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తేనే తాను ప్రధాని పదవిని చేపడతానని సాజిత్ పట్టుబట్టాడు. [76] గోటబయ పదవిలో ఉన్నంత కాలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని ఎస్‌జేబీ పార్టీ వెల్లడించింది. [77] హరీన్ ఫెర్నాండోతో సహా అతని పార్టీకి చెందిన కొందరు సభ్యులు దేశం క్లిష్ట పరిస్థితుల్లో, కూడలిలో ఉన్న సమయంలో సజిత్ డిమాండ్లు, షరతులపై తమ నిరాశను, అసమ్మతిని వ్యక్తం చేశారు. హరీన్ SJB ను వీడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అతను పార్లమెంటులో స్వతంత్ర సభ్యునిగా పనిచేస్తానని ప్రకటించాడు. [78]
2022 మే 12 న, రణిల్ విక్రమసింఘే ఆరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాడు. [79] [80] శ్రీలంక పొదుజన పెరమున పార్లమెంటు సభ్యుల మద్దతు ఇస్తామని హామీ ఇవ్వగా, ఇతర పార్టీలు ఆయన మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించాయి.
రాష్ట్రపతి, ప్రధానమంత్రి రాజీనామాలు
మార్చు2022 జూలై 9 న శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాన మంత్రుల ఇళ్లపై ప్రజలు దాడి చేసి తగులబెట్టారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత గోటబయ, విక్రమసింఘే ఇద్దరూ పదవులకు రాజీనామా చేయడానికి అంగీకరించారు. [81] [82] అధ్యక్షుడి రాజీనామా తర్వాత అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలతో సహా రాజకీయ పార్టీలు అంగీకరించాయి. [83] [84] జూలై 13న అధ్యక్షుడు రాజీనామా చేసిన తర్వాత, జూలై 19న నామినేషన్ల కోసం పిలుపునిచ్చిన తర్వాత జూలై 20న పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని జూలై 12న స్పీకర్ ప్రకటించాడు. [85]
అధ్యక్షుడి పరారీ, రాజీనామా
మార్చు2022 జూలై 9 న అధ్యక్షుడు గోటబయ రాజపక్స, తన అధికార నివాసాన్ని వీడి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడున్నాడో ప్రజలకు తెలియలేదు. జూలై 10 న పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి, ఆక్రమించారు. [86] అధ్యక్షుడు ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని జూలై 11న పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. [87] జూలై 12 రాత్రి గోటబయ, దేశం విడిచి పారిపోయాడు. శ్రీలంక సైనిక దళాల విమానంలో కొలంబో నుండి బయల్దేరి మాల్దీవుల రాజధాని మాలె వెళ్ళాడు. [88] ప్రధాని రణీల్ విక్రమసింఘేను తాత్కాలిక అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకరు నియమించారు. [89] ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. సైన్యానికి, నిరసనకారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది. [90]
2022 జూలై 14 న గోటబయ రాజపక్స శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసాడు. మాల్దీవుల నుండి సింగపూరు వెళ్ళి, అక్కడి నుండి రాజీనామాను ఈమెయిలు ద్వారా స్పీకరుకు పంపించాడు. [91] [92]
కొత్త అధ్యక్షుడి ఎన్నిక
మార్చుజూలై 15 న రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడయ్యాడు. ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూరియ అతని చేత ప్రమాణ స్వీకారం చేయించాడు.[93] గోటబయ అధ్యక్ష పదవీ కాలంలో ఇంక మిగిలి ఉన్న కాలాన్ని పూర్తి చేసేందుకు గాను, 2022 జూలై 20 నాటికి కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు.[94]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Pathi, Krutika (13 July 2022). "Thousands protest against Sri Lanka's new acting president". Associated Press. Colombo. Retrieved 14 July 2022.
Sri Lankan President Gotabaya Rajapaksa fled on a military jet on Wednesday after angry protesters seized his home and office, and appointed Prime Minister Ranil Wickremesinghe as acting president while he is overseas.
- ↑ Marian, Teena (14 July 2022). "Speaker yet to receive GRs resignation". News First. Retrieved 14 July 2022.
- ↑ Jayasinghe, Uditha (14 July 2022). "Sri Lanka awaits president's resignation after flight". Reuters. Colombo. Retrieved 14 July 2022.
- ↑ "Rajapaksa Clan Losing Grip on Power in Sri Lanka". thediplomat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka's cabinet ministers resign as crisis protesters defy curfew". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-09.
- ↑ "Cabinet resigns". www.dailymirror.lk (in English). Retrieved 4 April 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Sri Lanka main SJB slams 'sham' cabinet resignation, says no deal". EconomyNext (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 9 April 2022.
- ↑ "4 new Ministers sworn in". www.dailymirror.lk (in English). Retrieved 9 April 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Will our problems be solved by a general election? | Daily FT". www.ft.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Kuruwita, Zaheena Rasheed,Rathindra. "Thousands in Sri Lanka insist Rajapaksa family quit politics". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Gotabaya Rajapaksa: Economic crisis protesters defy curfew in Sri Lanka". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-04-10.
- ↑ "'Go Home, Gota': Huge Protest in Sri Lanka Mounts Pressure on Rajapaksa to Quit". The Wire. Retrieved 2022-04-10.
- ↑ Arulthas, Mario. "Sri Lanka: Gota needs to go – but so does the ethnocratic state". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "SJB moves to abolish 20th amendment - Breaking News | Daily Mirror". www.dailymirror.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Hardline Sri Lanka monk calls for Buddhist Sinhalese government". Reuters. 2019-07-07. Retrieved 2022-04-10.
- ↑ Arudpragasam, Amita. "The Rajapaksas Will Ruin Sri Lanka's Economy". Foreign Policy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Sinhalese Leviathan: How Gotabaya Rajapaksa Is Remaking Sri Lanka". thediplomat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Brothers who led in war revive grip on Sri Lanka". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-11-21. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka election: Unity hard to achieve in divided country". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2019-11-17. Retrieved 2022-04-10.
- ↑ "Many Sri Lankans want a strongman leader, and that favors Gotabaya Rajapaksa". Reuters (in ఇంగ్లీష్). 2019-08-10. Retrieved 2022-04-10.
- ↑ Jayasinghe, Uditha; Ghoshal, Devjyot (2022-02-25). "Analysis: Shocks and missteps: how Sri Lanka's economy ended in crisis". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ Shan (2022-01-18). "The Rajapaksas to blame for Sri Lanka's disastrous 2021". East Asia Forum (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka's shift towards organic farming". Navdanya international (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-16. Archived from the original on 2021-09-05. Retrieved 2022-04-10.
- ↑ Shah, Ted Nordhaus, Saloni. "In Sri Lanka, Organic Farming Went Catastrophically Wrong". Foreign Policy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Gotabaya's Underwhelming Presidency". thediplomat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ Kuruwita, Rathindra. "Sri Lanka's poor queue for hours to buy kerosene amid crisis". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Covid: Sri Lanka in economic emergency as food prices soar". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-09-01. Archived from the original on 2021-11-30. Retrieved 2022-04-09.
- ↑ "Sri Lanka declares food emergency as forex crisis worsens". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Why are there food queues in this Indian Ocean island?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-09-11. Retrieved 2022-04-10.
- ↑ "Explained: The perfect storm that has led to Sri Lanka's national 'food emergency'". The Indian Express (in ఇంగ్లీష్). 2021-09-14. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka parliament approves state of emergency". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ Watt, Louise (2021-11-21). "Sri Lanka abandons drive to become world's first organic country amid spiralling food prices". The Daily Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka walks back fertiliser ban over political fallout fears". France 24. 5 August 2021. Archived from the original on 27 October 2021. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka's mysterious gas explosions become nobody's baby". EconomyNext (in ఇంగ్లీష్). 2021-12-18. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka presidential probe on gas explosions contradicts previous official claims". EconomyNext (in ఇంగ్లీష్). 2021-12-22. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka Is Running Out of Money for Imports as Delta Rages". www.bloomberg.com. Retrieved 2022-04-10.
- ↑ "The lessons of Sri Lanka's ongoing three-month teachers' strike". World Socialist Web Site (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ PTI (2021-10-21). "Schools reopen across Sri Lanka even as teachers' strike continues". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-10.
- ↑ "Gotabaya Rajapaksa: Angry Sri Lankans want the president to go". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-04-04. Retrieved 2022-04-10.
- ↑ "Why are Sri Lankans protesting in the streets?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-04-08. Retrieved 2022-04-10.
- ↑ "Students throw their weight behind island-wide protests". University World News. Retrieved 2022-04-10.
- ↑ Jessie Yeung. "Sri Lanka ministers resign as protests erupt over economic crisis". CNN. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka's cabinet ministers resign amid protests, social media ban". France24. 3 April 2022. Retrieved 9 April 2022.
- ↑ "Sri Lankan lawmakers seek interim government to solve crisis". The New Indian Express. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lankan President invites all parties in Parliament to join govt to resolve economic crisis; central bank governor resigns: Key points - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Apr 4, 2022. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka's two main oppn parties reject President's request to form all-party interim govt". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-04. Retrieved 2022-04-10.
- ↑ "MR likely to step down as PM in new interim govt. - Breaking News | Daily Mirror". www.dailymirror.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Reports on Mahinda resigning as PM false: PM's Office - Latest News | Daily Mirror". www.dailymirror.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "అంతా చైనాకే అమ్మేశారు.. అందుకే లంకలో ఆకలి కేకలు." EENADU. Archived from the original on 2022-07-13. Retrieved 2022-07-13.
- ↑ "Sri Lanka Finance Minister Ali Sabry resigns; ready to vacate parliament seat". EconomyNext (in ఇంగ్లీష్). 2022-04-05. Retrieved 2022-04-10.
- ↑ "New Finance Minister Ali Sabry resigns". NewsWire (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-05. Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-10.
- ↑ "I am still the Finance Minister: Ali Sabri - Breaking News | Daily Mirror". www.dailymirror.lk (in English). Retrieved 2022-04-08.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Sabry continues as Finance Minister". Island. 9 April 2022. Retrieved 10 April 2022.
- ↑ "Parliament to meet on Tuesday (5)". Sri Lanka News - Newsfirst (in ఇంగ్లీష్). 2022-04-05. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka ruling alliance loses majority ahead of parliament meet". www.aljazeera.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
- ↑ "SLPP MPs who became independent in Parliament". www.adaderana.lk (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ Srinivasan, Meera (2022-04-05). "Sri Lanka crisis: Gotabaya Rajapaksa loses parliamentary majority". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-10.
- ↑ "'Make Harsha President for 6-Months': Harin". Sri Lanka News - Newsfirst (in ఇంగ్లీష్). 2022-04-06. Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka main opposition SJB protests in parliament, demands president's resignation". EconomyNext (in ఇంగ్లీష్). 2022-04-06. Retrieved 2022-04-10.
- ↑ "SJB says will bring no-confidence motion against govt". www.dailymirror.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Srinivasan, Meera (2022-04-08). "Sri Lanka opposition threatens no-confidence motion, industry warns of 'precipice'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-10.
- ↑ "Private sector appeals to Parliament to prioritise political stability | Daily FT". www.ft.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "COYLE warns crises stalling many businesses; wants urgent resolution | Daily FT". www.ft.lk (in English). Retrieved 2022-04-10.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Jayasinghe, Uditha; Ghoshal, Devjyot (2022-04-07). "Sri Lanka calls for $1 bln debt restructure as crisis rages". Reuters (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ Buddhavarapu, Ravi (2022-04-08). "Social turmoil is Sri Lanka's biggest risk, ex-World Bank official says of economic crisis". CNBC (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Sri Lanka resignations heighten uncertainty compounding external crisis: Moody's". EconomyNext (in ఇంగ్లీష్). 2022-04-06. Retrieved 2022-04-10.
- ↑ "Mahinda Rajapaksa: Sri Lankan PM resigns amid economic crisis". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-05-09. Retrieved 2022-05-09.
- ↑ "Gotabaya Rajapaksa: Under fire Sri Lanka president appoints new cabinet". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2022-04-18. Retrieved 2022-04-18.
- ↑ "Sri Lankan president appoints new Cabinet of 17 ministers amid protests against him: Report". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-04-18. Retrieved 2022-04-18.
- ↑ "Sri Lanka appointed new 17-member Cabinet". Sri Lanka News - Newsfirst (in ఇంగ్లీష్). 2022-04-18. Retrieved 2022-04-18.
- ↑ "17 member new Cabinet announced". NewsWire (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-18. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
- ↑ "No women in Sri Lanka's new Cabinet". NewsWire (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-04-18. Archived from the original on 2022-04-18. Retrieved 2022-04-18.
- ↑ "RW tipped to be PM? - Latest News | Daily Mirror". www.dailymirror.lk (in English). Retrieved 2022-05-12.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Battle begins for PM post Ranil tipped to be next PM?". www.dailymirror.lk (in English). Retrieved 2022-05-12.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Sajith will not accept Premiership under GR - SJB". NewsWire (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-11. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-12.
- ↑ "Sajith ready to accept Premiership if President resigns". www.adaderana.lk (in ఇంగ్లీష్). Retrieved 2022-05-12.
- ↑ "SJB wants President to resign after appointing Sajith as PM | Daily FT". www.ft.lk (in English). Retrieved 2022-05-12.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Harin to sit independent, signals split in SJB". www.dailymirror.lk (in English). Retrieved 2022-05-12.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే". ఈనాడు. Archived from the original on 2022-07-13. Retrieved 2022-07-13.
- ↑ "RANIL SWORN IN AS PM - Top Story | Daily Mirror". www.dailymirror.lk (in English). Retrieved 2022-05-13.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Farzan, Zulfick (9 July 2022). "REAKING: President to step down on 13th July". News 1st. Retrieved 9 July 2022.
- ↑ "After Sri Lankan Prime Minister Ranil Wickremesinghe resigns, protesters set his house on fire". CBS News. 9 July 2022. Retrieved 9 July 2022.
- ↑ "Sri Lanka Economic Crisis: Sri Lankan parties agree to form all-party interim govt after Rajapaksa's resignation". The Times of India. 11 July 2022. Retrieved 11 July 2022.
- ↑ "Sri Lanka Opposition parties agree to form all-party interim govt". Business Standard. 11 July 2022. Retrieved 11 July 2022.
- ↑ "Sri Lanka parliament to select new president on July 20 amid nomination speculation". Economy Next. 12 July 2022. Retrieved 12 July 2022.
- ↑ "Sri Lanka Crisis: వీధులన్నీ జనమయం.. అడుగులన్నీ అధ్యక్ష భవనంవైపే (IN PICS)". ఈనాడు. 2022-07-10. Archived from the original on 2022-07-13. Retrieved 2022-07-13.
- ↑ "Lankan Prez Rajapaksa still in country, says speaker Yapa Abeywardena". Hindustan Times. 11 July 2022. Retrieved 11 July 2022.
- ↑ "శ్రీలంక విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స". ఆంధ్రజ్యోతి (in ఇంగ్లీష్). 2022-07-13. Archived from the original on 2022-07-13. Retrieved 2022-07-13.
- ↑ telugu, NT News (2022-07-13). "శ్రీలంక సంక్షోభం : తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే". నమస్తే తెలంగాణ. Archived from the original on 2022-07-14. Retrieved 2022-07-14.
- ↑ "లంకలో సంచలన ఆదేశాలు: కనిపిస్తే కాల్చివేతే". Sakshi. 2022-07-13. Archived from the original on 2022-07-14. Retrieved 2022-07-14.
- ↑ "Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా". ఈనాడు. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.
- ↑ "గొట 'బై'". ఆంధ్రజ్యోతి (in ఇంగ్లీష్). 2022-07-15. Archived from the original on 2022-07-15. Retrieved 2022-07-15.
- ↑ "PM Ranil Wickremesinghe sworn in as Sri Lanka's interim president". Al Jazeera. 15 July 2022. Retrieved 16 July 2022.
- ↑ "Sri Lanka PM becomes acting president, election set for July 20". France24. 15 July 2022. Retrieved 16 July 2022.