2023 డబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్ స్టార్ స్పెక్టాకిల్
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ (ఆంగ్లం: WWE Superstar Spectacle) అనేది భారతదేశంలోని హైదరాబాదు వేదికగా తొలిసారి నిర్వహించిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (డబ్ల్యూ డబ్ల్యూ ఈ) పోటీ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న డబ్ల్యూ డబ్ల్యూ ఈ పోటీని గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో 2023 సెప్టెంబరు 8న జరిగింది.[1] ఈ సూపర్ ఫైట్‌లో ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియప్ రియా రిప్లే, సమీ జైన్, కెవిన్ ఓవెన్స్ వంటి తదితర రెజ్లింగ్ స్టార్లతో పాటు 28 మంది అంతర్జాతీయ చాంపియన్స్(మల్లయోధులు) పోటీ పడ్డారు.[2]
చరిత్ర
మార్చుడబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ అనేది అమెరికన్ కంపెనీ డబ్ల్యూ డబ్ల్యూ ఈ చేత రూపొందించబడిన ఒక ప్రొఫెషనల్ రెజ్లింగ్ ఈవెంట్. 2020 అక్టోబరు 29న ప్రారంభమైన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాతో ఐదేళ్ల ఒప్పందంలో భాగంగా డబ్ల్యూ డబ్ల్యూ ఈ భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. మొదటి ఈవెంట్ జనవరి 2021లో నిర్వహించబడింది. ఇది భారత గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా డబ్ల్యూ డబ్ల్యూ ఈ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడింది. తిరిగి దేశంలో రెండవసారి సెప్టెంబరు 2023లో నిర్వహించారు.[3][4][5] ఈ ఈవెంట్ సోనీ మ్యాక్స్, సోనీ టెన్ 1, సోనీ టెన్ 3లలో ఇంగ్లీష్, హిందీలో కామెంట్రీలతో ప్రీమియర్ అయింది. కాగా భారతదేశం వెలుపల, ప్రత్యేకంగా WWE నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడింది.[6]
2023
మార్చుఆగస్టు 1న, WWE రెండవ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌ను 2023 సెప్టెంబర్ 8న భారతదేశంలోని హైదరాబాదులో గచ్చిబౌలిలోని జి. ఎం. సి. బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఇది 2017 నుండి భారతదేశంలో జరిగిన WWE మొదటి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించబడిన మొదటిది. 2021 ఈవెంట్‌లా కాకుండా, 2023 ఈవెంట్ టెలివిజన్‌లో ప్రసారం కాలేదు. దీనికి బదులుగా WWE లైవ్ ఈవెంట్‌గా నిర్వహించబడింది.[7]
ఇందులో భాగంగా మొత్తం ఆరు పోటీలు నిర్వహించారు. మొదటిదైన 6-మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్‌లో భారతదేశానికి చెందిన సంగా, వీర్ మహాన్, జిందర్ మహల్‌తో కూడిన ఇండస్ షేర్‌ను ఓవెన్స్, సమీ, మెకింటైర్ ఓడించారు. మెన్స్ సింగిల్స్‌లో జనరల్ గుంతర్, షాంకీపై విజయం సాధించి ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. వరల్డ్ విమెన్స్ చాంపియన్‌షిప్ ఫైట్‌లో డిఫెండింగ్ చాంప్ రియా రిప్లే, నటల్యాను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది.[8]
ఈవెంట్స్
మార్చుసంవత్సరం | తేది | నగరం | వేదిక | Final match | మూలాలు |
---|---|---|---|---|---|
2021 | 2021 జనవరి 22
(జనవరి 26న ప్రసారం చేయబడింది) |
సెయింట్ పీటర్స్‌బర్గ్, ఫ్లోరిడా, యునైటెడ్ స్టేట్స్ | ట్రోపికానా ఫీల్డ్, WWE థండర్‌డోమ్ | డ్రూ మెక్‌ఇంటైర్, సింధు షేర్ (రింకు, సౌరవ్) వర్సెస్ జిందర్ మహల్, బాలీవుడ్ బాయ్జ్ (సమీర్ సింగ్, సునీల్ సింగ్) | [9] |
2023 | 2023 సెప్టెంబరు 8 | గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | జి. ఎం. సి. బాలయోగి ఇండోర్ స్టేడియం | జాన్ సెనా, సేథ్ "ఫ్రీకిన్" రోలిన్స్ వర్సెస్ ఇంపీరియం (జియోవన్నీ విన్సీ, లుడ్విగ్ కైజర్) | [10] |
మూలాలు
మార్చు- ↑ "హైదరాబాద్‌లో తొలిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలు.. దుమ్మురేపి స్టార్ రెజ్లర్లు-Namasthe Telangana". web.archive.org. 2023-09-09. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "WWE Superstar Spectacle Highlights Hyderabad: John Cena, Seth Rollins Emerge Victorious in Main Event - News18". web.archive.org. 2023-09-09. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Currier, Joseph (January 9, 2021). "WWE announces 'Superstar Spectacle' India special". Wrestling Observer Figure Four Online (in ఇంగ్లీష్). Retrieved January 16, 2021.
- ↑ Motley Fool Transcribers (October 30, 2020). "World Wrestling Entertainment Inc (WWE) Q3 2020 Earnings Call Transcript". The Motley Fool. Archived from the original on October 30, 2020. Retrieved January 16, 2021.
- ↑ Powell, Jason (October 29, 2020). "10/29 WWE Conference Call report: Vince McMahon discusses the 2020 third quarter financial report". Pro Wrestling Dot Net. Archived from the original on January 16, 2021. Retrieved January 16, 2021.
- ↑ Johnson, Mike (January 13, 2021). "Official details released on WWE Superstar Spectacle, lots of big WWE names to appear". PWInsider. Retrieved January 16, 2021.
- ↑ Johnson, Mike (August 22, 2023). "Is WWE Superstar Spectacle Going to be a Broadcast Event?". PWInsider. Retrieved August 23, 2023.
- ↑ "హైదరాబాద్ ను ఊపేసిన డబ్ల్యూడబ్ల్యూఈ". web.archive.org. 2023-09-09. Archived from the original on 2023-09-09. Retrieved 2023-09-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Currier, Joseph (January 9, 2021). "WWE announces 'Superstar Spectacle' India special". Wrestling Observer Figure Four Online (in ఇంగ్లీష్). Retrieved January 16, 2021.
- ↑ Crowley, Liam (August 1, 2023). "WWE Running International Live Event on The Same Day as Upcoming SmackDown Show". ComicBook.com. Retrieved August 1, 2023.