45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

2014 చలన చిత్రోత్సవం

45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2014 నవంబరు 20 నుండి నవంబరు 30 వరకు గోవా లోని పనాజీ లో జరిగింది.[1][2] ఈ వేడుకలో చైనా కేంద్రంగా ఉంది.[3]

45వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on30 నవంబరు 2014
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రం"లెవియాథన్"
Lifetime achievement"వాంగ్ కర్-వై"

భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1952లో స్థాపించబడింది.[4][5] ఆసియాలో జరుగుతున్న అత్యంత ముఖ్యమైన చలన చిత్రోత్సవాలలో ఇదీ ఒకటి. భారతదేశంలోని పశ్చిమ తీరంలో గోవా రాష్ట్రంలో ప్రతిఏటా ఈ చిత్రోత్సవం జరుగుతుంది. ప్రపంచంలోని సినిమావాళ్లకు చలనచిత్ర కళపై నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ఈ చిత్రోత్సవం లక్ష్యం. దీనిద్వారా దేశాల చలన చిత్ర సంస్కృతులను వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలను అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేస్తుంది, ప్రపంచదేశాల ప్రజలలో స్నేహం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్స్ డైరెక్టరేట్ (సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో), గోవా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి.[6] సినీనటి సీమా బిస్వాస్ జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది.[7]

విజేతలు

మార్చు
  • ఉత్తమ చిత్రం: గోల్డెన్ పీకాక్ అవార్డు: "ఆండ్రీ జ్వ్యాగింట్సేవ్" దర్శకత్వం వహించిన "లెవియాథన్"
  • ఉత్తమ చిత్రం: సిల్వర్ పీకాక్ అవార్డు: శ్రీహరి సాతే దర్శకత్వం వహించిన "ఏక్ హజరాచి నోట్"
  • ఉత్తమ దర్శకుడు: "కిండర్ గార్టెన్ టీచర్" సినిమా దర్శకుడు నాదవ్ లాపిడ్
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటుడు అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "లెవియాథన్" సినిమాలో నటించిన అలెక్సీ సెరెబ్రియాకోవ్, "చోటోడర్ చోబి" సినిమాలో నటించిన దులాల్ సర్కార్.
  • ఐఎఫ్ఎఫ్ఐ ఉత్తమ నటి అవార్డు: సిల్వర్ పీకాక్ అవార్డు: "బిహేవియర్" సినిమాలో నటించిన అలీనా రోడ్రిగెజ్, "కిండర్ గార్టెన్ టీచర్" సినిమాలో నటించిన సరిత్ లారీ

ప్రత్యేక అవార్డులు

మార్చు
  • జీవన సాఫల్య పురస్కారం: వాంగ్ కర్-వై
  • శతాబ్ది: ప్రత్యేక జ్యూరీ అవార్డు: శ్రీహరి సాతే
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: రజినీకాంత్

అధికారిక ఎంపికలు

మార్చు

ప్రత్యేక ప్రదర్శనలు

మార్చు

ప్రారంభ సినిమా

మార్చు
  • మొహ్సేన్ మఖ్మల్‌బాఫ్ (ఇరాన్) దర్శకత్వం వహించిన ది ప్రెసిడెంట్

ముగింపు సినిమా

మార్చు
  • వాంగ్ కర్-వై (చైనా) దర్శకత్వం వహించిన గ్రాండ్ మాస్టర్

మూలాలు

మార్చు
  1. "45th IFFI takes off at Goa tomorrow". pib.nic.in.
  2. "Russian film Leviathan wins Golden Peacock at IFFI 2014". 30 November 2014.
  3. "45th International Film Festival of India concluded in Goa". 1 December 2014.
  4. M. Mohan Mathews (2001). India, Facts & Figures. Sterling Publishers Pvt. Ltd. pp. 134–. ISBN 978-81-207-2285-9. Retrieved 3 July 2021.
  5. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. pp. 98–. ISBN 978-81-7991-066-5. Retrieved 3 July 2021.
  6. "Key highlights of the 46th International Film Festival of India". PIB. Retrieved 3 July 2021.
  7. Pranjal Borah (21 November 2014). "Seema Biswas as Jury in 45th International Film Festival of India". KothaSobi. Archived from the original on 13 జనవరి 2021. Retrieved 22 November 2014.

బయటి లింకులు

మార్చు