అల్యూమినియం సల్ఫేట్

(Al2(SO4)3 నుండి దారిమార్పు చెందింది)

అల్యూమినియం సల్ఫేట్ (Aluminium sulfate) ఒక రసాయన సమ్మేళనం.దీనిని ప్రత్నామ్యాయంగా Aluminum sulphate అనికూడా పిలుస్తారు.

అల్యూమినియం సల్ఫేట్
Aluminium sulfate hexadecahydrate
పేర్లు
IUPAC నామము
అల్యూమినియం సల్ఫేట్
ఇతర పేర్లు
Cake alum
Filter alum
Papermaker's alum
Alunogenite
aluminum salt (3:2)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10043-01-3]
పబ్ కెమ్ 24850
యూరోపియన్ కమిషన్ సంఖ్య 233-135-0
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BD1700000
SMILES [Al+3].[Al+3].[O-]S(=O)(=O)[O-].[O-]S([O-])(=O)=O.[O-]S([O-])(=O)=O
  • InChI=1/2Al.3H2O4S/c;;3*1-5(2,3)4/h;;3*(H2,1,2,3,4)/q2*+3;;;/p-6

ధర్మములు
Al2(SO4)3
మోలార్ ద్రవ్యరాశి 342.15 g/mol (anhydrous)
666.42 g/mol (octadecahydrate)
స్వరూపం white crystalline solid
hygroscopic
సాంద్రత 2.672 g/cm3 (anhydrous)
1.62 g/cm3 (octadecahydrate)
ద్రవీభవన స్థానం 770 °C (1,420 °F; 1,040 K) (decomposes, anhydrous)
86.5 °C (octadecahydrate)
31.2 g/100 mL (0 °C)
36.4 g/100 mL (20 °C)
89.0 g/100 mL (100 °C)
ద్రావణీయత slightly soluble in alcohol, dilute mineral acids
ఆమ్లత్వం (pKa) 3.3-3.6
వక్రీభవన గుణకం (nD) 1.47[1]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
monoclinic (hydrate)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
-3440 kJ/mol
ప్రమాదాలు
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none
REL (Recommended)
2 mg/m3[2]
IDLH (Immediate danger)
N.D.[2]
సంబంధిత సమ్మేళనాలు
ఇతర కాటయాన్లు
Gallium sulfate
Magnesium sulfate
సంబంధిత సమ్మేళనాలు
See Alum
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

అల్యూమినియం సల్ఫేట్ ఒక అకర్బన రసాయన సమ్మేళన పదార్థం. అల్యూమినియం, సల్ఫర్,, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన ఈసమ్మేళన పదార్థం ఏర్పడినది. ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా Al2 (SO4) 3. ఇది నీటిలో కరుగుతుంది. ఇది తెల్లని స్పటికార ఘన పదార్థం. దీనికి చెమ్మగిల్లే (hygroscopic) లక్షణం ఉంది. నిర్జల అల్యూమినియం సల్ఫేట్ యొక్క అణుభారం 342.15గ్రాములు/మోల్.[3] అక్టాడేకాహైడ్రేట్ (octadecahydrate) అల్యూమినియం సల్ఫేట్ యొక్క అణుభారం 666.42గ్రాములు/మోల్. నిర్జల (Anhydrous) అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంద్రత 2.672 గ్రా/సెం.మీ3. అక్టాడేకాహైడ్రేట్ అల్యూమినియం సల్ఫేట్ యొక్క సాంద్రత 1.62గ్రాములు/ సెం.మి3. నిర్జల అల్యూమినియం సల్ఫేట్ యొక్క ద్రవీభవన స్థానం 770 °C (1,420 °F; 1,040 K),[4]ఉష్ణోగ్రత వద్ద సమ్మేళనం వియోగం చెందును. అక్టాడేకాహైడ్రేట్ అల్యూమినియం సల్ఫేట్ యొక్క ద్రవీభవన స్థానం 86.5 °C

ఆల్కహాల్లో తక్కువ ప్రమాణంలో కరుగుతుంది.అలాగే ఖనిజ ఆమ్లాలలో కరుగుతుంది. ఈ సమ్మేళన పదార్థం యొక్క వక్రిభవన విలువ సూచిక1.47.

రసాయనిక చర్యలు

మార్చు

అల్యూమినియం సల్ఫేట్ ను 580-900 °C మధ్య వేడిచేసిన γ− అల్యుమినియా, సల్ఫర్ ట్రై ఆక్సైడ్ గా వియోగం చెందును.

సోడియం బై కార్బోనేట్ తో అల్యూమినియం సల్ఫేట్ రసాయనిక చర్య ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అగును.

Al2(SO4)3 + 6 NaHCO3 → 3 Na2SO4 + 2 Al(OH)3 + 6 CO2

ఇలా విడుదల అయ్యిన బొగ్గుపులుసు వాయువు కుఫోమ్ స్టెబిలైజర్ ను చేర్చటం వలన అగ్నిమాపక యంత్రంలో నురుగు (Foam) ఏర్పరచెదరు.

లభ్యత

మార్చు

నిర్జల అల్యూమినియం సల్ఫేట్ అరుదుగా సహజంగా అగ్ని పర్వత పరిసరాలలో, రాకాసి బొగ్గు నిల్వ ప్రాంతాలలో millosevichite అను ఖనిజ రూపంలో లభిస్తుంది. అల్యూమినియం సల్ఫేట్ రకరకాల హైడ్రేట్ రూపాలలో లభిస్తుంది. వాటిలో హెక్సా డెకా హైడ్రేట్ (Al2 (SO4) 3), ఆక్టా డెకాహైడ్రేట్ (Al2 (SO4) 3•18H2O) లు అతిసాధారణంగా లభించు అల్యూమినియం సల్ఫేట్ యొక్క హైడ్రేట్ లు. హెప్టాడెకా హైడ్రేట్ ([Al (H2O) 6]2 (SO4) 3•5H2O) అనునది. స్వాభావికంగా alunogen అను ఖనిజ రూపంలో లభిస్తుంది.

ఉత్పత్తి

మార్చు

అల్యూమినియం హైడ్రోక్సైడ్ (Al (OH) 3) నకు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చేర్చి చర్య జరిపించడం వలన అల్యూమినియం సల్ఫేట్ ఏర్పడును.

2 Al(OH)3 + 3 H2SO4 → Al2(SO4)3•6H2O

ఇంకొక పద్ధతిలో సల్ఫ్యూరిక్ ఆమ్లంలో అల్యూమినియాన్ని వేడి చెయ్యడం వలన కూడా అల్యూమినియం సల్ఫేట్ ఉత్పత్తి అగును.

2 Al(s) + 3 H2SO4 → Al2(SO4)3 + 3 H2 (g)

ఉపయోగాలు

మార్చు

అల్యూమినియం సల్ఫేట్ ను జలాశుద్ధికరణ ప్రక్రియలో వినియోగిస్తారు.[5] అలాగే రంగుల అద్దకం, వస్త్ర ముద్రణలో వర్ణస్థాపకము/ వర్ణాకర్షణి (mordant) గా వినియోగిస్తారు. జలాశుద్ధీకరణ ప్రక్రియలో అల్యూమినియం సల్ఫేట్ నీటిలోని మలినాలన్నీ ఒకచోట దగ్గరగా చేర్చి, అటుపిమ్మట ట్యాంకు/నిల్వ పాత్ర యొక్క అడుగు భాగంలో జమ అయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియ విధానాన్నిపేరుకొనుట (coagulation) లేదా సమాక్షేపణం ( flocculation) అంటారు. అయితే అల్యూమినియం సల్ఫేట్ ను అధిక మొత్తంలో వాడటం వలన నీటిని కలుషిత పరచే అవకాశమున్నది.

అల్యూమినియం సల్ఫేట్ ను తటస్థ లేదా స్వల్పంగా క్షార గుణమున్న నీటిలో కరగించిన జిగట స్వభావమున్న అల్యూమినియం హైడ్రోక్సైడ్ (Al (OH) 3 అవక్షేపాన్ని ఏర్పరచును. ఈ అవక్షేపం రంగు అద్దకం, వస్త్ర ముద్రణ సమయంలో రంగులు, నీటిలో కరుగ కుండ, వస్త్రానికి అతుక్కుని ఉండేలా చేస్తుంది.[6]

అల్యూమినియం సల్ఫేట్ ను కొని సందర్భాలలో తోటలలోని, ఉద్యానవనాలలోని నేల యొక్క pH విలువను తగ్గించుటకై ఉపయోగిస్తారు. అల్యూమినియం పొటాసియం సల్ఫెట్ ను బేకింగ్ పౌడర్ లో ఉపయోగిస్తారు.[5] భవన నిర్మాణంలో వాటర్ ప్రూపింగ్ కారకంగా ఉపయోగిస్తారు. అలాగే కాంక్రీట్ త్వరగా దృఢ పడునట్లు చేయ్యును. అలాగే అగ్నిమాపక పరికారాలలో నురుగు నిచ్చు కారకంగా ఉపయోగిస్తారు.దీనిని స్టిప్టిక్ పెన్సిల్ లలో ఉపయోగిస్తారు.అలాగే పురుగుల, కీటకాలు కాటువేసినప్పుడు, ఎవైన కుట్టినప్పుడు కలిగే నొప్పులను నివారణ మందులలో వాడెదరు.

మూలాలు

మార్చు
  1. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
  2. 2.0 2.1 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0024". National Institute for Occupational Safety and Health (NIOSH).
  3. "ALUMINUM SULFATE". ncbi.nlm.nih.gov. Retrieved 2015-10-22.
  4. "ALUMINUM SULFATE". chemicalland21.com. Archived from the original on 2015-12-06. Retrieved 2015-10-22.
  5. 5.0 5.1 "Uses Of Aluminum Sulfate". aluminumsulfate.net. Archived from the original on 2015-10-11. Retrieved 2015-10-22.
  6. "What Is Aluminum Sulfatepublisher=aluminumsulfate.net". Retrieved 2015-10-22.