అల్యూమినియం అయోడైడ్

(AlI3 నుండి దారిమార్పు చెందింది)

అల్యూమినియం అయోడైడ్ ఒకరసాయన సంయోగపదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనపదార్థం. ఈ రసాయన సమ్మేళనపదార్థం అల్యూమినియం, అయోడిన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది.ఈ రసాయన పదార్థం రసాయన సంకేతపదం AlI3.అల్యూమినియంతో అయోడిన్ రసాయనికచర్య వలన లేదా హైడ్రోజన్ అయోడిన్ తో అల్యూమినియం లోహం చర్యవలన అల్యూమినియం అయోడైడ్ సంయోగపదార్థం ఏర్పడును. లోహ అల్యూమినియం లేదా అల్యూమినియం హైడ్రాక్సైడ్ తో హైడ్రోజన్ అయోడైడ్ లేదా హైడ్రో అయోడిక్ఆమ్లం చర్య వలన ఆరు జలాణువులను (hexahydrate) కలిగిన అల్యూమినియం అయోడైడ్ ఏర్పడును. అరైల్ ఈథరులను అల్యూమినియం అయోడైడ్ విచ్చితి (cleaves) చేస్తుంది.[1]

అల్యూమినియం అయోడైడ్
Ball and stick model of aluminium iodide dimer
పేర్లు
Preferred IUPAC name
Aluminium iodide
ఇతర పేర్లు
Aluminium(III) iodide

Aluminum iodide
Aluminium triiodide

Aluminum triiodide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7784-23-8]
పబ్ కెమ్ 82222
యూరోపియన్ కమిషన్ సంఖ్య 232-054-8
SMILES I[Al](I)I
ధర్మములు
AlI3
మోలార్ ద్రవ్యరాశి 407.69495 g/mol (anhydrous)
515.786 g/mol (hexahydrate)
స్వరూపం colorless powder
but impure samples
are often brown
సాంద్రత 3.98 g/cm3 (anhydrous)
2.63 g/cm3 (hexahydrate)
ద్రవీభవన స్థానం 189.4 °C (372.9 °F; 462.5 K) (anhydrous)
185 °C, decomposes (hexahydrate)
బాష్పీభవన స్థానం 360 °C (680 °F; 633 K) , sublimes
reacts violently (anhydrous)
soluble (hexahydrate)
ద్రావణీయత in alcohol, ether soluble (hexahydrate)
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక ధర్మాలు

మార్చు

అల్యూమినియం అయోడైడ్ సహజంగా రంగులేని పొడి ఘనపదార్థం.మలినాలున్న అల్యూమినియం అయోడైడ్ రసాయన పదార్థం బ్రౌన్‌రంగులో ఉండును. నిర్జల అల్యూమినియం అయోడైడ్ అణుభారం 407.69495 గ్రాములు/మోల్., ఆరు జలాణువులున్న అల్యూమినియం అయోడైడ్ అణుభారం 515.786 గ్రాములు/మోల్.25 °C వద్ద నిర్జల అల్యూమినియం అయోడైడ్ సాంద్రత 3.98 గ్రాములు/సెం.మీ3.అలాగే ఆరు జలాణువులున్న అల్యూమినియం అయోడైడ్ సాంద్రత 2.63 గ్రాములు/సెం.మీ3.నిర్జల అల్యూమినియం అయోడైడ్ ద్రవీభవన స్థానం189.4 °C (372.9 °F; 462.5 K),, ఆరు జలాణువులున్న అల్యూమినియం అయోడైడ్‌ను వేడిచేసిన 185 °C వద్ద విఘటన/వియోగం చెందును.నిర్జల అల్యూమినియం అయోడైడ్ 360 °C (680 °F; 633K) వద్ద ఉత్పతనం (sublimes) చెందును.నిర్జల అల్యూమినియం అయోడైడ్ నీటితో వైలెంట్ గా చర్య జరుపును.సజల అల్యూమినియం అయోడైడ్ నీటిలో కరుగును. సజల అల్యూమినియం అయోడైడ్ ఇంకను ఆల్కహాల్,, ఈథరు లలో కరుగుతుంది.

సౌష్టవం

మార్చు

అల్యూమినియం అయోడైడ్ Al2I6 రూపం కలిగిన ఒక ఘన డైమెరిక్/ద్వ్యణుక పదార్థం. డైమెరిక్ పదార్థం అనగా ఒకేరకమైన పోలిక ఉన్న రెండుఅణువులను కలిగిఉండుట. ఇది AlBr3సౌష్టవాన్ని పోలిక కలిగిఉన్నది[2].మొనోమేరిక్ (ఒకరకమైన అణువు నుకలిగిన), డైమెరిక్ రూపపదార్థాన్ని వాయుస్థితిలో గుర్తించారు[3] .మొనోమార్ అణువు త్రికోణ సమతలంగా ఉంది, బంధ దూరం/పొడవు 2.448 (6) Å కలిగి ఉంది.430 K వద్ద డైమెరిక్/ ద్వ్యణుక పదార్థం Al2Cl6, Al2Br6 ల పోలికతో ఉండి, అల్యూమినియం-అయోడిన్‌ల బంధ పొడవులను 2.456 (6) Å (టెర్మినల్), 2.670 (8) Å (అనుసందానిత) లను కలిగి ఉంది.

అల్యూమినియం అయోడైద్ అనుపేరు విస్తృతంగా త్రిఅయోడైడ్ (triiodide) లేదా ద్వ్యణుకం (dimer) ను వివరించటానికి వాడుచున్నారు.ట్రైఅయోడైడ్ కన్న గది ఉష్ణోగ్రత వద్ద సాపేక్షముగా అస్థిరమైనది[4] అయిన్నప్పటికి మొనో అయోడైడ్ కూడాఅల్యూమినియం-అయోడిన్ సంబంధంలో తనపాత్రను పోషిస్తున్నది.

3 AlI → AlI3 + 2 Al

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. M. Gugelchuk (2004). Aluminum Iodide, in Encyclopedia of Reagents for Organic Synthesis (Ed: L. Paquette). New York: J. Wiley & Sons. doi:10.1002/047084289X.ra083.
  2. Troyanov, Sergey I.; Krahl, Thoralf; Kemnitz, Erhard (2004). "Crystal structures of GaX3(X= Cl, Br, I) and AlI3". Zeitschrift für Kristallographie. 219 (2–2004): 88–92. doi:10.1524/zkri.219.2.88.26320. ISSN 0044-2968.
  3. Hargittai, Magdolna; Réffy, Balázs; Kolonits, Mária (2006). "An Intricate Molecule: Aluminum Triiodide. Molecular Structure of AlI3and Al2I6from Electron Diffraction and Computation". The Journal of Physical Chemistry A. 110 (10): 3770–3777. doi:10.1021/jp056498e. ISSN 1089-5639.
  4. Dohmeier, C.; Loos, D.; Schnöckel, H. (1996). "Aluminum(I) and Gallium(I) Compounds: Syntheses, Structures, and Reactions". Angewandte Chemie International Edition. 35: 129–149. doi:10.1002/anie.199601291.