కాల్షియం హైడ్రైడ్
కాల్సియం హైడ్రైడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అకర్బన సంయోగ పదార్థం.కాల్సియం, హైడ్రోజన్/ ఉదజని పరమాణువుల సంయోగం వలన ఈ అకర్బన రసాయన సమ్మేళన పదార్థం ఏర్పడినది.కాల్సియం హైడ్రైడ్ యొక్క రసాయన సంకేత పదం CaH2.అరుదుగా లభ్యమగు స్వచ్ఛమైన కాల్సియం హైడ్రైడ్ తెల్లగా ఉండును, సాధారణంగా లభించు కాల్సియం హైడ్రైడ్ రసాయన పదార్థం బూడిద రంగులో ఉండును. కాల్సియం హైడ్రైడ్ తీవ్రంగా, చురుకుగా నీటితో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. కాల్సియం హైడ్రైడ్ ను ఎక్కువగా పదార్థాలను పొడిపరచు (desiccant) గా ఉపయోగిస్తారు.[3]
పేర్లు | |
---|---|
IUPAC నామము
కాల్సియం హైడ్రైడ్
| |
ఇతర పేర్లు
Calcium(II) hydride
కాల్సియం హైడ్రైడ్ | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7789-78-8] |
పబ్ కెమ్ | 105052 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 232-189-2 |
SMILES | [H-].[H-].[Ca+2] |
| |
ధర్మములు | |
CaH2 | |
మోలార్ ద్రవ్యరాశి | 42.094 g/mol |
స్వరూపం | gray powder (white when pure) |
సాంద్రత | 1.70 g/cm3, solid |
ద్రవీభవన స్థానం | 816 °C (1,501 °F; 1,089 K) |
reacts violently | |
ద్రావణీయత | reacts in alcohol |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Orthorhombic, oP12 |
Pnma, No. 62 | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−181.5 kJ·mol−1 |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
41.4 J·mol−1·K−1[1] |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | DANGER |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H260 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R15 |
S-పదబంధాలు | (S2), S7/8, S24/25, S43 |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతర కాటయాన్లు
|
Sodium hydride, Potassium hydride |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
కాల్సియం హైడ్రైడ్ లవణమయ హైడ్రైడ్ (saline hydride). సలైన్ హైడ్రైడ్ అనగా లవణం వంటి నిర్మాణం/లక్షణాలు కలిగినదని అర్థం. క్షారలోహాలు, క్షారమృత్తిక లోహాలు అన్నియు సలైన్ హైడ్రైడ్ లను ఏర్పరచును.
భౌతిక ధర్మాలు
మార్చుకాల్సియం హైడ్రైడ్ ఘనపదార్థం.అరుదుగా లభ్యమగు స్వచ్ఛమైన కాల్సియం హైడ్రైడ్ తెల్లగా ఉండును, సాధారణంగా లభించు కాల్సియం హైడ్రైడ్ రసాయన పదార్థం బూడిదరంగులో ఉండును. కాల్సియం హైడ్రైడ్ అణుభారం 42.094 గ్రాములు/మోల్. సాధారణ ఉష్ణోగ్రత (25 °C) వద్ద కాల్సియం హైడ్రైడ్ సాంద్రత 1.70గ్రాములు/సెం.మీ3. కాల్సియం హైడ్రైడ్ ద్రవీభవన ఉష్ణోగ్రత 816 °C (1,501 °F; 1,089K). నీటితో చురుకుగా, తీవ్ర స్థాయిలో చర్య జరుపును. ఆల్కహాల్ లతో చర్య జరుపును.
కాల్సియం హైడ్రైడ్ అణుసౌష్టవం అర్థోరొంబిక్.
ఉత్పత్తి
మార్చుకాల్సియం మూలకాన్ని నేరుగా 300-400 °C వద్ద హైడ్రోజన్ వాయుతో చర్య జరిపించడం ద్వారా కాల్సియం హైడ్రైడ్‌ను ఉత్పత్తి చేయుదురు.
ఉపయోగాలు
మార్చులోహ ఆక్సైడులను క్షయికరణ కావించుట
మార్చుకాల్సియం హైడ్రైడ్ ఒక క్షయికరణ కారకం.టైటానియం (Ti, వెనేడియం (V, నియోబియం (Nb, టేంటలం (Ta)., యురేనియంలోహ అక్సిడుతో క్షయికరణచర్య వలన వాటి లోహ పొడి/చూర్ణము (powder) లను ఏర్పరచును. కాల్సియం హైడ్రైడ్, కాల్సియం లోహంగా వియోగం వలన ఈ క్షయికరనచర్య వలన లోహ ఆక్సైడులనుండి, లోహాలు ఏర్పడుచుటకు కారణమైఉండును.
- TiO2 + 2 CaH2 → Ti + 2 CaO + 2 H2
ఉదజని ఉత్పత్తి వనరుగా
మార్చుకాల్సియం హైడ్రైడ్ ను ఉదజని వాయువు జనకంగా ఉపయోగిస్తారు.1940 కాలంలో కాల్సియం హైడ్రైడ్ ను హైడ్రోలిత్అనే వ్యాపార నామంతో అమ్మేవారు.ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగిన, అత్యవసర స్థితిలో, ముఖ్యంగా గాలిఓడలలో (Airship) నింపుటకు అవసరమైన హైడ్రోజన్ వాయుఉత్పత్తి జనకంగా హైడ్రోలిత్అనే వ్యాపార నామం కలిగిన కాల్సియం హైడ్రైడ్ జు వాడేవారు, కాని కాల్సియం హైడ్రైడ్ నియోగం (ఉదజని ఉత్పత్తికై) ఖరీదైన వ్యవహారం.ఇక్కడ అత్యవసర స్థితి అనేది యుద్ధసమయ వాడుకను తెలుపుతుంది.కాల్సియం హైడ్రైడ్ విస్తృతంగా, దశాబ్దాలుగా వాతావరణ బుడగలలో (weather balloons) నింపుటకు అవసరమైన వాయువును ఉత్పత్తి చేయుసురక్షితమైన, అనుకూలమైన రసాయనంగా ఉపయోగిస్తున్నారు.
ప్రయోగశాలలో తక్కువ మోతాదులో శుద్ధమైన హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేయుటకు కాల్సియం హైడ్రైడ్‌ను ఉపయోగిస్తారు>మోటరు స్పిరిట్/డిజిల్ లోని తేమ షాతాన్ని నిర్ణయించాడానికి, దీనిని పరీక్షించవలసిన డిజెల్ లో కలిపి, విడుదలైన హైడ్రోజన్ పరిమాణాన్ని బట్టి డిజెల్ లోని నీటి/తేమను నిర్ణయించెదరు.
పొడిపరచు/చెమ్మ(తేమ)తొలగించుటకు
మార్చుకాల్సియం హైడ్రైడ్, నీటితో జరుగు రసాయన చర్య/జల విశ్లేషణ చర్య ఈ దిగువ సూచించిన విధంగాగా ఉండును.
- CaH2 + 2 H2O → Ca(OH)2 + 2 H2
కాల్సియం హైడ్రైడ్ జల విశ్లేషణ జనితాలైన/ ఉత్పాదితలైన హైడ్రోజన్ వాయువు, కాల్సియం హైడ్రాక్సైడ్ (Ca (OH) 2) లను ద్రావణాన్ని ఇగిర్చి వేరు చేయవచ్చును. కాల్సియం హైడ్రైడ్‌ను అమైన్స్ (amines), పైరిడిన్ (pyridine) వంటి క్షారద్రావణాలను డిస్సికెంట్ (పొడిపరచు/చెమ్మ (తేమ) తొలగించుపదార్థం) గా ఉపయోగిస్తారు. అలాగే ఆల్కహాల్ లను పొడి పరచుటకు (తేమను తొలగించుటకు) ఉపయోగిస్తారు.
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు/ఆధారాలు
మార్చు- ↑ Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A21. ISBN 0-618-94690-X.
- ↑ మూస:CLP Regulation
- ↑ Gawley, R. E., Davis, A., "Calcium Hydride," in Encyclopedia of Reagents for Organic Synthesis, 2001, John Wiley & Sons, Ltd. doi:10.1002/047084289X.rc005