డెకామీటరు

(Dkm నుండి దారిమార్పు చెందింది)

డెకా అనగా పది (Ten) అని అర్ధము. డెకా మీటరు (Dkm) లేదా (dkm) అనగా పది మీటరులు అనిభావన. పది డెకా మీటరులు ఒక హెక్టామీటరు. పది హెక్టా/వంద డెకా మీటరులు ఒక కిలోమీటరు[1][2].[3] ఇది మెట్రిక్ వ్యవస్థలో పొడవుకు ప్రమాణం.

డెకామీటరు
ఒక హెక్టారు విస్తీర్ణం గల స్థలంలో వందవ భాగం ఒక చదరపు డెకామీటరు. చదరపు డెకామీటరులోని భుజం డెకా మీటరు అవుతుంది. అనగా హెక్టారు విస్తీర్ణం గల చదరంలోని భుజం 10 డెకామీటర్లు.
ప్రమాణం యొక్క సమాచారం
ప్రమాణ వ్యవస్థమెట్రిక్
ఏ బౌతికరాశికి ప్రమాణంపొడవు
గుర్తుdam 
ప్రమాణాల మధ్య సంబంధాలు
1 dam in ...... is equal to ...
   SI ప్రమాణాలు   10 మీ.
   ఇంపిరియల్/యు.ఎస్. ప్రమాణాలు   10.936 yd
 393.70 అం.

ఈ కొలత SI వ్యవస్థలో ఎక్కువగా పరిపూర్ణత కోసం చేర్చబడింది: సూత్రప్రాయంగా, ఉపసర్గ, ప్రమాణాల ఏదైనా కలయికగా వ్రాయవచ్చు, కాని ఆచరణలో చాలా అరుదుగా ఉపయోగించబడతాయి.

నదులు, సరస్సుల వంటి పెద్ద పరిమాణాల నీటిని వివరించడానికి వాల్యూమెట్రిక్ రూపంగా క్యూబిక్ డెకామీటరు ప్రమానం సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక క్యూబిక్ డెకామీటరు (dam3) అనగా ఒక మెగాలీటరు (ML) కు సమానం.

చదరపు డెకామీటరు (dam2) ను ఏర్ అంటారు. ఒక హెక్టారు అనగా 100 dam2

ఒక సాంకేతిక వాతావరణం ఒక డెకామీటర్ నీటి పీడనానికి సమానం.

మూలాలు

మార్చు
  1. Decimal multiples and submultiples of SI units Archived 2019-03-30 at the Wayback Machine, 2006, SI Brochure: The International System of Units (SI), 8th edition
  2. Unit of length (metre) Archived 2019-03-01 at the Wayback Machine, 2006, SI Brochure: The International System of Units (SI), 8th edition
  3. The Two Classes of SI Units and the SI Prefixes, 2008, The NIST Guide for the Use of the International System of Units