గాజుల సత్యనారాయణ

(Gajula satyanarayana నుండి దారిమార్పు చెందింది)

గాజుల సత్యనారాయణ తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్షను రచించారు . ఇది జనవరి 9, 2004 లో మొదటి ముద్రణ పొందింది. 2014 సంవత్సరానికి 118 ముద్రణలు పొంది అదే 116 రూపాయలకు అందిస్తున్న అపూర్వ విజ్ఞాన సర్వస్వంగా అశేష పాఠకుల ఆదరణ పొందింది.

గాజుల సత్యనారాయణ
జననం (1957-10-04) 1957 అక్టోబరు 4 (వయసు 67)
దేవరాయకొండ మండలం, నల్గొండ జిల్లా
వృత్తిరచయిత
ప్రచురణకర్త
తల్లిదండ్రులు
  • గాజుల పుల్లయ్య (తండ్రి)
  • పుల్లమ్మ (తల్లి)

బాల్యం

మార్చు

ఈయన 4 అక్టోబరు 1957న నల్గొండ జిల్లా, దేవరకొండ మండలంలో పుట్టాడు. గాజుల పుల్లయ్య, పుల్లమ్మ వీరి తల్లిదండ్రులు. వీరిది చేనేత కుటుంబం. వీరి కుటుంబం ఈయన బాల్యంలోనే నల్గొండ నుండి గుంటూరుకు వలస వచ్చింది.

చదువు

మార్చు

పేద కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన ఈయన ఐదవ తరగతి వరకూ వీధిబడిలో చదివారు. ఆరు-ఏడు తరగతులు గుంటూరు శ్రీమతి కాసు సాయమ్మ మునిసిపల్ హైస్కూల్లో చదివారు. ఏడవ తరగతిలో ఇంగ్లీషులో తప్పడం వలన చదువు ఆపేసారు.

ఉద్యోగం

మార్చు

ఏడవ తరగతి తరువాత చదువు ఆగిపోవడంతో గుంటూరులోని ఒక పుస్తకాల షాపులో పది రూపాయల జీతానికి చేరారు. పుస్తకాల షాపుతో పాటు ఇంటి వద్ద తమ్ముళ్ళకూ, ఇంకా చుట్టు పక్కల పిల్లలకూ చదువు చెప్పేవారు. ఆపై పుస్తకాలు రాయటం ఒక వ్యాపకంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పెద్దబాలశిక్ష, తెలుగు సంస్కృతికి సంబంధించిన పుస్తకాలు రాయటం, ప్రచురించడం చేస్తున్నారు.

పెద్దబాలశిక్ష రచన

మార్చు

118 పునర్ముద్రణలు పొందిన బహుశా ఏకైక పుస్తకం పెద్దబాలశిక్ష. ఈ పుస్తకాన్ని రచించింది ఈయనే.

స్ఫూర్తి

మార్చు

1990లో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పెద్దబాలశిక్ష గురించి ప్రస్తావించారు. అది గాజుల సత్యనారాయణకు బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితో పెద్దబాలశిక్షను రూపొందించాలని సంకల్పించారు.

పుస్తక రూపకల్పన

మార్చు

పెద్దబాలశిక్ష రూపొందించాలని సంకల్పించుకున్నాక తొమ్మిది సంవత్సరాలు విషయ సేకరణ చేసారు. మూడు సంవత్సరాలు డి.టి.పి. చేయించారు. అది 2700 పేజీలు వచ్చింది, కుదించి 1530 పేజీలు చేసారు. ఇంకా చిన్న అక్షరాలతో 960 పేజీలకి మార్చి ముద్రించాలనుకున్నారు. కానీ ప్రచురణకర్తలు లాభం కోసం 300 లేదా 400 చేయాలని అన్నారు. అది అంత ఎక్కువ ధరకు అమ్మటం నచ్చలేదు. 116 రూపాయలకు అమ్మాలని నిర్ణయించి సంవత్సరం ఆగి తెనాలి లోని అన్నపూర్ణ సంస్థ ద్వారా ప్రచురించారు.

మొదటి ప్రచురణ

మార్చు

2004 సంవత్సరంలో 2000 కాపీలతో జనవరి 9న విజయవాడ పుస్తక ప్రదర్శనలో విడుదల చేసారు.

రచనలు

మార్చు
  • మహిళా డైరీ
  • పిల్లల పేర్లదర్శిని
  • హిందూ సంప్రదాయాలు
  • హిందూ వివాహ పరిచయం
  • శ్రీ శివలింగ దర్శనం
  • మన పండుగలు
  • దైవ దర్శనం
  • తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 1
  • తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 2
  • తెలుగువారి సంపూర్ణ చిన్న బాల శిక్ష
  • భక్తిరంజని
  • శివతత్వము
  • శ్రీరామసుధ
  • అమరావతిలో కాలచక్ర
  • ఆరోగ్యంతో నిండా నూరేండ్లు
  • సామెతలూ-పొడుపు కథలు
  • ప్రపంచ పరిచయం
  • అరచేతిలో ఆంధ్రప్రదేశ్
  • అరచేతిలో భారతదేశం
  • తెలుగు వ్యాసాలు
  • తెలుగు జి.కె.
  • ఇంగ్లీష్ జి.కె.
  • మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం
  • తెలుగువారి సంప్రదాయ-వేడుకలు
  • 366 దేవత స్తోత్రమంజరి
  • శ్రీలలితావిష్ణు సహస్రనామస్తోత్రములు
  • 108 అష్టోత్తర శతనామావళి
  • భక్తి సుధామంజరి
  • దశమహావిద్యలు (పది పుస్తకాలు)
  • భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు

పురస్కారాలు

మార్చు
  1. తెలుగువికాసం పురస్కారం
  2. తితిదే Archived 2016-02-02 at the Wayback Machine వారి ఆత్మీయ పురస్కారం
  3. కిన్నెర వారి ఉగాది పురస్కారం

మూలాలు

మార్చు