ఫల్వార నూనె

(Phulwara oil నుండి దారిమార్పు చెందింది)

ఫల్వారచెట్టు సపోటేసి వృక్షకుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము డిప్లొనెమ బుటిరేసి (Diploknema butyracea).ఈ చెట్టును చిహరి, ఛుర, ఫల్వా (phulwa) అనికూడా పిలుస్తారు.[1][2] దీని తెలుగు పేరు ఇరుకు చెట్టు.

చెట్టు
పూలమొగ్గలు
కాయ

చెట్టు-వ్యాప్తి

మార్చు

పొడవైన ఆకురాల్చు వృక్షము.ఇంచుమించు 15 మీటర్లేత్తు పెరుగుతుంది. ఏపుగా పెరుగుతుంది.నేపాల్, సిక్కింలలో కొన్నిచోట్ల 40 మీటర్లేత్తు పెరిగినవికూడా ఉన్నాయి. చెట్టుబెరడు గ్రే లేదా బ్రౌన్ గా వుండును. ఇవి సముద్రమట్టంనుండి 400-1500 మీటర్లవరకు వ్యాపించి పెరుగుతాయి. ఈచెట్లు కొండలోయల్లోని నదులవడ్దున, కొండవాలుల్లో (Hill slopes) పెరుగుతాయి.5-10 సంవత్సరాలకు గట్టిపడి, కాయల దిగుబడి మొదల్వైతుంది. 50-60 సంవత్సరాల వరకు కాపునిస్తాయి. ఒక చెట్టు నుండి 100-250 కిలోల వరకు కాయలదిగుబడి వుంటుంది. భారతదేశంలో హిమాలయ పరిసరప్రాంతాలు, కుమోన్ (kumoan), సిక్కిం, ఉత్తరబెంగాల్. భూటన్ వరకు ఉన్నాయి. సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వీటిపెంపకానికి అనువైన ప్రాంతాలు.5-10 సంవత్సరాలనుండి చెట్టుపండ్లను కాయడం ప్రారంభమవుతుంది[3].[4]

పూలు :ఏప్రిల్-మే నెలలలో పూస్తాయి.పూలు తెల్లగా లేదా పాలిపోయిన పసుపురంగులో వుండును

పళ్ళు : గ్లోసిగా బాదంకాయ ఆకారంలో, దీర్ఘ అండాకారంలో వుండును.పళ్ళు 2.0-3.5 సెం.మీ.పొడవు, 2-2.5 సెం, మీవ్యాసం కలిగి వుండును. పళ్లలో చక్కెర 8.5%, పీచు పదార్దం 5.6% వుండును.[5] పళ్లు మే-అగస్టునెలల్లో పక్వానికివచ్చును.జూన్-జులైలలో పండ్లను సేకరించవచ్చును.

గింజలు (seeds) : గింజలు గ్లోసిగా, నల్లగా వుండి,1.8-2.0 సెం.మీ. పరిమాణంలో వుండును. పండులో విత్తనశాతం 80% వుండును.గింజలో విత్తనము (kernel) తెల్లగా బాదంపప్పు ఆకారంలో వుండును. గింజలో నూనె 42-47%, విత్తనము/బీజములో 60% వరకు నూనెశాతం వుండును. ప్రొటిన్ 18% వుండును.

మంచివిత్తనములనుండి తీసిననూనె మంచిరుచి, వాసనకల్గి తెలుపుగా వుండును.ఎక్కువకాలం నిల్వవుంచినను త్వరగా పాడవదు.

ఫల్వార నూనె భౌతికలక్షణాల పట్టిక[6]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4552-1.4650
ఐయోడిన్ విలువ 90-101 (44-48) *
సపనిఫికెసను విలువ 191-200
అన్సఫొనిపియబుల్ పదార్థం 1.4-5%
ఆమ్ల విలువ 9.1%
విశిష్ట గురుత్వం 300Cవద్ద 0.856-0.862
ద్రవీభవ ఉష్ణోగ్రత 39-510C
టైటరు విలువ 48-520C

గమనిక=*కొన్నిరకాలనూనెల్లో

ఫల్వార నూనెలోని కొవ్వు ఆమ్లంల శాతం[3][7]

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం (C16:0) 56.6
స్టియరిక్ ఆమ్లం (C18:0) 3.6
ఒలిక్ ఆమ్లం (C18:1) 36.0
లినొలిక్ ఆమ్లం (C18:2) 3.8

నూనె ఉపయోగాలు

మార్చు
  • ఫల్వార నూనెను నెయ్యి, వెన్నకు బదులుగా వంటలలో వాడెదరు., ఆహారపదార్థాలవేపుడుకు ఫల్వార నూనెను వినియోగిస్తారు.[8]
  • కొకో బట్టరు బదులుగా చాకోలెట్ల తయారిలో వాడవచ్చును[3].
  • వనస్పతి తయారిలో ఉపయోగించవచ్చును
  • మందుల, సబ్బుల, కొవ్వొత్తుల, మిఠాయిల తయారిలో ఉపయోగిస్తారు.దీపనూనెగా వాడెదరు[4].

ఇవికూడా చూడండి

మార్చు

ఉల్లేఖన/మూలాలు/ఆదారాలు

మార్చు
  1. "CHYUR- INDIAN BUTTER TREE". chyura.blogspot.in. Retrieved 2015-03-20.
  2. "Phulwara oil". encyclo.co.uk. Retrieved 2015-03-20.
  3. 3.0 3.1 3.2 SEA Hand Book-2009.By The Solvent Extractors' Association of India
  4. 4.0 4.1 "Extraction Of High Quality Dna From Diploknema Butyracea" (PDF). sciencepub.net. Retrieved 2015-03-20.
  5. "Phulwara". manoramagroup.co.in. Archived from the original on 2015-02-23. Retrieved 2015-03-20.
  6. "VEGETABLE PRODUCTS(REGULATION)ORDER,1998" (PDF). fssai.gov.in. Archived from the original (PDF) on 2013-11-26. Retrieved 2015-03-20.
  7. "Triglyceride composition ofmadhuca butyraceae seed fat". link.springer.com. Retrieved 2015-03-20.
  8. "CHEURA" (PDF). novodboard.com. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-03-20.