అంకితం వెంకట నరసింగరావు

అంకితం వెంకట నరసింగరావు విశాఖపట్నం జిల్లాకు డిప్యూటీ కలెక్టరుగా ఉండేవారు.

అంకితం వెంకట నరసింగరావు
Ankitam Venkata Narsingarao.jpg
జననంఅంకితం వెంకట నరసింగరావు
1827
విశాఖపట్నం
మరణం1892
వృత్తిడిప్యుటీ కలెక్టర్, విశాఖపట్నం
మతంహిందూ
భార్య / భర్తఅచ్చీయమ్మ
పిల్లలుఅంకితం వెంకట ప్రకాష్ రావు, అంకితం వెంకట జగ్గారావు, అంకితం నారాయణ

జీవిత విశేషాలుసవరించు

ఆయన 1827లో జన్మించారు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి మరణించారు. తాను తాతగారి యింట పెరిగారు. ఉత్తర సర్కార్ల నవీన విద్యా పితామహుడైన రెవ్.జె.హై ఆయనను చదివించారు. ఆయన విశాఖపట్నం డిప్యూటీ కలెక్టరుగా అతి పిన్నవయస్సులో చేరారు.[1]

ఆయన విశాఖపట్నంలో ప్రసిద్ధమైన నక్షత్రశాలను స్థాపించిన గోడే వెంకట జగ్గారావు కుమార్తెను వివాహమాడారు. వీరు ఆ నక్షత్రశాలను కొంతకాలంపాటు కొనసాగించారు. వీరు తన మామగారి శాస్త్ర విషయక కృషియందు ఆసక్తి పొంది ఆ నక్షత్రశాలను అనేక విధములుగా అభివృద్ధి చేసి ప్రభుత్వంవారితోనూ, ఇతర దేశపు జ్యోతిశ్శాస్త్రజ్ఞులతోను ఉత్తర ప్రత్యుత్తరములు పెట్టుకొని అతి సమర్థులని పేరుపొంది రాయల్‌ ఏసియాటిక్‌ సొసైటీకి 1871లోనూ, రాయల్‌ జియో గ్రాఫికల్‌ సొసైటీకి 1872 లోనూ ఫెలో అయినారు. వెంకట జగ్గారావుగారి కుమార్తె అయిన వీరి భార్య గారు తమ తండ్రి గారిపై గల అభిమానంతో అబ్జర్వేటరీని శాశ్వత బ్రహ్మకల్పముగ కాపాడబడుటకై మూడు లక్షల రూపాయలను మూల ధనముగా నుంచారు. నరసింగరావు గారు తాము కనిపెట్టిన వింతల గురించి ఒక పుస్తకము ప్రచురించారు.[2][3] ఆయన సంస్థాన వ్యవహారాలు చేసుకొనేందుకు తన పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామా చేసిన తరువాత భారత ప్రభుత్వం "రాయ్‌ బహదూర్"గా బిరుదునిచ్చింది.

ఎ.వి.ఎన్.కళాశాలసవరించు

ముందు హిందూ హైస్కూలుగా ప్రారంభింపబడిన ఈ కళాశాల తరువాతి కాలంలో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాలగా రూపాంతరం చెందింది.[4] 1882లో “హిందూ" కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాలగా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా అంకితం వెంకట నరసింగరావు విరాళం ఇచ్చాడు. అందుకని అతని భార్య పేరు పెట్టారు. ఆయనిచ్చే విరాళం ఫలితంగా ఆ కళాశాల అభివృద్ధి చెందింది. భారతదేశంలో మొదటి శాస్రవిజ్ఞాన నోబెల్ గ్రహీత సి.వి.రామన్ తన ఇంటర్మీడియట్ విద్యను ఇదే కళాశాలలో పూర్తిచేసారు. ఈ కళాశాలలో అనేక ప్రముఖులు చదువుకున్నారు.[5]

విశాఖపట్నట్నంలో ప్రముఖ జమీందారులు 1860కి ముందు అంగోలా వెర్నాక్యులర్ స్కూలుకు సహకారం అందించేవారు. 1878లో ఈ సంస్థ మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా మారి "హిందూ కళాశాల"గా మారినది. ఈ కళాశాల ఆర్థిక లోటులో ఉన్నప్పుడు 1882లో నరసింగరావు గారు ఒక లక్ష రూపాయలు విరాళం, 11 ఎకరాల భూమి, స్వంత భవనంతో పాటు 15000 రూపాయల నిథిని అందజేసారు. ఆయన సేసిన సేవలకుగాను ఆయన భార్య పేరుతో ఈ కళాశాలకు 1899లో మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాలగా నామకరణం చేసారు.[5]

1950-61 లో ఈ కళాశాల స్వర్ణోత్సవాలు జరిగినవి. ఆయన కుమారుడు ఎ.వి.భానోజీ రావు ఈ కళాశాలను ఉన్నత స్థాయిలో నిలిపాడు. భానోజీరావు కుమారుడు జగ్గారావు ఈ కళాశాల అభివృద్ధికి కృషిచేసారు.

ఈ కళాశాలలో చదివినవారిలో ముఖులు అల్లూరి సీతారామరాజు, శొంఠి రామమూర్తి, బి.ఎన్.శర్మ (మద్రాసు హైకోర్టు జడ్జి), వేపా రామేశం (స్వాతంత్ర్య సమరయోధులు), తెన్నేటి విశ్వనాథం, ఎస్.వి.రంగారావు, శ్రీశ్రీ, రావిశాస్త్రి, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆదిభట్ల నారాయణదాసు మొదలైన వారు అభ్యసించారు.[5]

మూలాలుసవరించు

  1. eminent families of vizag, biography
  2. హిందూజన సంస్కారిణి 1989 ఏప్రిల్‌ సంచిక
  3. విశాఖలో జ్యోతిర్వేదం 14-05-2016[permanent dead link]
  4. ఆదిభట్ల నారాయణ దాసుగారి జీవిత చరిత్ర
  5. 5.0 5.1 5.2 "A.V. Narasinga Rao: Dedicated to education". B.M.G. The Hindu. 27 January 2003. Retrieved 15 May 2016.

ఇతర లింకులుసవరించు