అంజలి నింబాల్కర్

డాక్టర్ అంజలి నింబాల్కర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి చెందిన రాజకీయ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. [1] అంజలి నింబాల్కర్ 2018 నుండి కర్నాటక శాసనసభకు బెల్గాం జిల్లాలోని ఖానాపూర్ నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు [2] [3]ఆమె 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడింది.

అంజలి నింబాల్కర్
ಅಂಜಲಿ ನಿಂಬಾಳ್ಕರ್
శాసనసభ సభ్యురాలు
In office
2018–2023
నియోజకవర్గంఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం
అంతకు ముందు వారువిఠల్ హెగేకర్
తరువాత వారుఅరవింద్ చంద్రకాంత్ పాటిల్
వ్యక్తిగత వివరాలు
జననం (1976-08-22) 1976 ఆగస్టు 22 (వయసు 48)
ఖానాపూర్ కర్ణాటక
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిహేమంత్ నింబాల్కర్
సంతానంఒక కూతురు ఒక కొడుకు
నివాసంఖానాపూర్
కళాశాలముంబాయి విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకురాలు

ఆమె గైనకాలజీ లాపరోస్కోపీలో మాస్టర్స్‌తో బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ డిగ్రీ పట్టాను కలిగి ఉంది. కర్ణాటక శాసనసభకు ఎన్నికైన పది మంది వైద్యుల్లో ఆమె ఒకరు. [4]

వ్యక్తిగత జీవితం

మార్చు

అంజలి నింబాల్కర్ 1976 ఆగస్టు 22న కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌లో హిందూ మరాఠా కుటుంబంలో జన్మించారు. ఆమె హేమంత్ నింబాల్కర్ ( ఇండియన్ పోలీస్ సర్వీస్ ) అధికారిని వివాహం చేసుకుంది. [5] [6]

రాజకీయ జీవితం

మార్చు

2018లో, అంజలి నింబాల్కర్ కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విఠల్ హలగేకర్ (బీజేపీ) అభ్యర్థిపై గెలుపొందారు. [7] [8]

2020లో, అంజలి నింబాల్కర్ బెల్గాం జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఎన్నికలకు పోటీ చేసింది కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన అరవింద్ చంద్రకాంత్ పాటిల్ చేతిలో అంజలి నింబాల్కర్ ఓడిపోయింది.

2023లో అంజలి నింబాల్కర్భారతీయ జనతా పార్టీకి చెందిన విఠల్ హలగేకర్ చేతిలో ఓడిపోయింది, అంజలికి మొత్తం 37,205 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి విఠల్ హలగేకర్ 91,834 ఓట్లతో గెలుపొందారు.

2024లో, అంజలి నింబాల్కర్ 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గానికి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడింది.[9]

మూలాలు

మార్చు
  1. "Hebbalkar, Nimbalkar appointed as Cong. spokespersons". The Hindu (in Indian English). 2020-09-23. ISSN 0971-751X. Retrieved 2022-06-12.
  2. "Don't want salary hike, use money to help poor: K'taka Cong MLA Anjali Nimbalkar". The Week (in ఇంగ్లీష్). Retrieved 2022-06-12.
  3. "Women's Day: Why are you people wishing us, MLA asks". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-03-08. Retrieved 2022-06-12.
  4. "10 doctors make it to the Assembly". The Hindu (in Indian English). 2018-05-16. ISSN 0971-751X. Retrieved 2022-06-12.
  5. Chennabasaveshwar (2018-05-16). "Karnataka Elections: IPS officer's wife creates history for Congress in Khanapur". oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-12.
  6. bijapur, naushad (2018-05-16). "It's women power, 3 from Belagavi win". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-06-12.
  7. "Karnataka Election Results 2018, Karnataka Assembly Elections Results 2018". www.elections.in. Retrieved 2022-06-12.
  8. "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections". The Financial Express (in ఇంగ్లీష్). Retrieved 2022-06-12.
  9. Eenadu (26 March 2024). "నాడు ఓడినా.. నేడు సత్తా చాటేదెలా?". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.